Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
ఆమెకు మీపై ఆసక్తి తగ్గిపోయిందని తెలిపే సంకేతాలు..!
రిలేషన్ లో ఏదైనా జరగవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ బోర్ ఫీలవవచ్చు, మీ నుంచి దూరమవ్వాలని భావించవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేయాలని భావించవచ్చు. ఏం జరిగినా మనం ఊహించలేనివే. కాబట్టి ఎలాంటి పరిస్థితైనా... పరిస్థితులను బట్టి అంచనా వేయాలి.
మీపై ఆసక్తి కోల్పోవడంలో ఏ తప్పూ లేదు. అయితే మీ గర్ల్ ఫ్రెండ్ మంచిది లేదా చెడ్డదా అనే విషయాన్ని తెలుసుకోవడం కష్టం. ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని గ్రహించడం కూడా కష్టమే. అయితే ఆ లక్షణాలను మనం గ్రహించవచ్చు. అవేంటో చూద్దాం..

క్లోజ్ నెస్
ఇంతకుముందు పబ్లిక్ ప్లేస్ లలో కూడా మీతో ఆమె చాలా క్లోజ్ గా ఉండేది. కౌగిలించుకోవడం, ముట్టుకోవడం వంటి వాటితో చాలా క్లోజ్ గా మారుతుంది. కానీ ఈ మధ్య ఆమె పబ్లిక్ ప్లేస్ లో మీ చేతిని కూడా పట్టుకోవడం లేదంటే.. ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం.

మీ మాటకే ప్రాధాన్యం
గతంలో మీరు ఏం చెప్పినా.. మీతో అంగీకారం తెలిపేది. కానీ ఇటీవల మీరు చెప్పే విషయాలను వ్యతిరేకిస్తోంది. ఏ చిన్న విషయాన్నైనా.. తప్పు పడుతోంది అంటే.. ఆమె మీపై ఆసక్తిని కోల్పోతోందని సంకేతం.

మీరే ప్రపంచం
గతంలో ఆమెకు మీరే ప్రపంచం. కానీ ఇటీవల తన సహోద్యోగి అందం గురించి ఎక్కువగా మాట్లాడుతుందా ? ఆ వ్యక్తి ఎంత తెలివైన వ్యక్తో తరచుగా మాట్లాడుతుంది. అలాంటి మాటలన్నీ ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని సూచిస్తుంది.

ఫ్యూచర్ ప్లాన్స్
ఇంతకుముందు తన ఫ్యూచర్ ప్లాన్స్, ట్రిప్స్ లో మిమ్మల్ని చేర్చి మాట్లాడేది. కానీ.. ఈ మధ్య ఆమె తన సోలో ప్లాన్స్ గురించే మాట్లాడుతుంది. అవును ఆమె ఒంటరిగా ప్రయాణించడానికే ఆసక్తి చూపుతోందంటే.. ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని సంకేతం.

మీతోనే ఉండేది
గతంలో ఆమె ఎప్పుడూ మీతోనే ఉండేది. కానీ ఈ మధ్య ఎక్కువ సమయం తన సహాద్యోగులతోనే గడుపుతోంది. కానీ దీనికి సంకేతం ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం.

హీరో
గతంలో ఆమె మిమ్మల్ని హీరోగా భావించేది. చాలా క్యూట్ గా ఉన్నావంటూ.. కాంప్లిమెంట్ ఇచ్చేది. కానీ ఇటీవల మిమ్మల్ని అవమానించడం, తక్కువగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం.

లక్షణాలు
ఈ లక్షణాలన్నీ మీ రిలేషన్ ముగిసిందని సంకేతం. కాబట్టి.. మీ చేయి దాటి ఏవిషయాలు పోయాయో ఒకసారి తెలుసుకోవడం అవసరం.



Click it and Unblock the Notifications