Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
వివాహితుల ద్వారా అవివాహితులైన వారి స్నేహితులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
మీరు కనుక వివాహితులయితే మీ సంసార జీవితం గురించి మీ స్నేహితులు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. అది మీ పడకగది గురించి కావచ్చు లేదా పెళ్ళయ్యాకా రోజువారీ జీవితం ఎలా ఉంటుందన్న దాని గురించీ కావచ్చు.
ఈరోజు మేము ఈ ఆర్టికిల్ ద్వారా వివాహితులు ,అవివాహితులయిన తమ స్నేహితులతో ఏమి పంచుకోవచ్చో తెలుపబోతున్నాము.
వివాహం అంటే కేవలం మీ భాగస్వామితో మధుర క్షణాలని ఆస్వాదించడమే కాదు, ఎన్నో ఎత్తు పల్లాలని చవి చూడాల్సుంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మీకు వివాహం కాగానే మీరు వారి నుండి దూరమైపోతారన్న అభద్రతా భావం మీ అవివాహిత స్నేహితులని వెంటాడుతుంది.కానీ అలాంటిదేమీ జరగదనీ,మీ వైవాహిక జీవితం గురించి వారితో పంచుకున్నట్లయితే కనుక మీరు వారికి ఎప్పుడు కావాల్సిన అందుబాటులో ఉంటారన్న భరోసా కల్పించవచ్చు.
హాయిగా వివాహం చేసుకుని జీవిస్తున్న వారు చెప్పిన ఈ క్రింది విషయాలు చదివి వైవాహిక జీవితం పట్ల ఉన్న భ్రమకు తొలగించుకోండి.

పెళ్ళంటే అత్తగారిని ద్వేషించడం కాదు:
టీవీలలో చూపించే ఆ మాయదారి సీరియళ్ళ ప్రభావం నుండి బయటకొచ్చి చూడండి.అలా చూస్తే మీ అత్తగారు ఎంత మంచివారో మీకు తెలుస్తుంది. ఒక్కోసారి మీరు ఆమెని ద్వేషించవచ్చు కానీ అదే జీవితం కాదు.

అందమైన మగవారిని చూడటం:
అందమైన యువకులని చూడటం ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. మీరు వివాహితులైనంత మాత్రం చేత చూడకూడదని లేదు కదా.

అన్నీ కలిసి చేసుకోవడం ఎల్లవేళలా కుదరదు:
వివాహం అయినా కూడా మనకంటూ సొంత జీవితాలుంటాయి కదా.మీరు మీ భాగస్వామితో మాత్రమే కాకుండా స్నేహితులతో షాపింగుకి లేదా డిన్నర్లకీ కూడా వెళ్తుండవచ్చు.

మొదటి సంవత్సరపు ఎత్తు పల్లాలు:
మీరు అనుకున్నంత పూలబాటేమీ కాదు పెళ్ళంటే.భాగస్వాముల మధ్య అనేక సర్దుబాట్లు,రాజీలూ తప్పవు పెళ్ళయిన కొత్తలో.

పెళ్ళంటే శృంగారం మాత్రమే కాదు:
ఎవ్వరికైనా ఎప్పుడూ శృంగారంలో పాల్గొనే సమయం ఎక్కడుటుంది చెప్పండి??మీరు మీ భాగస్వామితో మానసికంగా కూడా బంధాన్ని బలపరచుకోవాలి.వివాహం అంటే శారీరక సంబంధం మాత్రమే కాదు మానసిక బంధం కూడా.

పెళ్ళి కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు:
పెళ్ళవ్వగానే తరువాతి మెట్టు పిల్లల్ని కనడం మాత్రమే కాదు.భాగస్వాములిద్దరూ కలిసి ఇంకా అనేక రకాల పనులు చెయ్యచ్చు.



Click it and Unblock the Notifications