Latest Updates
-
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్!
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత కోలుకోవడం ఎలా...
ప్రేమ అనేది జీవితంలో ఒక చిన్న భాగమే కానీ, ప్రేమే జీవితం కాదు...శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ పాపులర్ డైలాగ్ మీకు గుర్తుందా? ప్రేమే జీవితం కాకపోయినా...ప్రమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో ..ఒక వేళ అందులో విఫలమైతే ...అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది.
ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను మర్చిపోవడం అంత సులభం కాదు. అలాగని పదే పదే వారిని వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమీ ఉండదు, కాబట్టి, ఆ జ్ఝాపకాల్లోంచి వీలైనంత త్వరగా బయటపడి మామూలు మనిషిగా మారాలి. అప్పుడే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు. మరి అందుకు ఫాలో అవ్వాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం...

అంతా మన మంచికే:
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా...సానుకూల ద్రుక్పథంతో ముందకు వెళ్ళడం చాలా అవసరం. విడిపోయిన తర్వాత చాలా బాధిస్తుంటుంది. అలాంటి సమయంలో సానుకూలంగా ఆలోచించడం ఎలా అనుకుంటున్నారా? కానీ ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగితే ...మన మనసును కలచివేసే విషయాలన్నీ వీలైనంత త్వరగా సమాథైపోతాయి .

ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి :
అప్పటి వరకూ తోడుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మన జీవితం నుంచి పక్కకు జరిగితే ...దాన్ని నెగటివ్ గా తీసుకుని బాధపడడటం కంటే ఇలా జరగడం మన మంచికేనేమో ! భవిష్యత్తులో ఇంతకంటే మంచి వ్యక్తి మన జీవితంలోకి వస్తారేమో ! అన్న సానుకూల ద్రుక్పతథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది.

పాజిటివ్ ఆలోచనలు:
పైవిధంగా తెలిపినట్లు విడిపోయిన వారు, పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ప్రేమించిన వ్యక్తిని త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అంతకు మించిన మధుర క్షణాలు భవిష్యత్తులో మళ్లీ మన సొంతమవ్వచ్చు..

టచ్ లో ఉండకూడదు:
కొంత మంది ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయిన తర్వాత కూడా వారికి పదే పదే ఫోన్ చేయడం, మెసేజ్ లు పెట్టడం, వారు ఎదురుపడినప్పుడు దగ్గరికి వెళ్లి మాట్లాడటం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారికి ఒక్కోసారి కోపం పెరిగే అవకాశం ఉంటుంది. పైగా వారి నుంచి సానుకూల స్పందన లభించనందువల్ల మనపై మనకే కోపం రావడం, ఎవరితోనూ సరిగ్గా కలవలేకపోవడం వంటి ప్రతికూల భావాలు చోటుచేసుకుంటాయి.

టచ్ లో ఉండకూడదు:
ఇది రానురాను జీవితంపై ఆసక్తి కోల్పోయేలా చేసే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఇంత దూరం రాకముందే ఎవరికి వారు జాగ్రత్తపడడం మంచిది. ఈక్రమంలో మొబైల్ లో వారికి సంబంధించిన కాంటాక్ట్స్ తొలగించడం, వారికి సంబంధించిన వస్తువులను, జ్ఝాపకాలను దూరం చేయడం, తన స్నేహితులను ఎక్కువగా కలవకపోవడం...ఇలా చేయడం ద్వారా వారిని క్రమంగా మర్చిపోయేలా అవకాశం ఉంటుంది.

వీటికి తావివ్వొద్దు:
ప్రేమలో ఫెయిల్ అయిన వారిలో కొంత మందికి ఓపిక, సహనం నశిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కాక చిరాకు పెరుగుతుంది. దీంతో ప్రేమించిన వారిని అసహ్యించుకోవడం, వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం వంటివి చేస్తుంటారు. దీంతో ముందూ వెనకా ఆలోచించకుండా తప్పటడుగు వేస్తుంటారు. ఇలాంటి ఆవేశపూరిత ప్రవర్థన వల్ల మనశ్వాంతిని కోల్పోవడమే కాక, ఒక్కోసారి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఫలానా వ్యక్తిని మర్చిపోవాలని ’ అని గట్టిగా నిర్ణయించుకున్న
కాబట్టి ఫలానా వ్యక్తిని మర్చిపోవాలని ' అని గట్టిగా నిర్ణయించుకున్న క్షణం నుంచి వారి గురించి ఏ రకమైన ఆలోచనలనైనా మనస్సులోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఇలా మనసును నెమ్మదిగా అదుపు చేసుకుంటే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అంత కష్టమేమీ కాకపోవవచ్చు.

కెరీర్ పై దృష్టి పెట్టాలి :
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయే క్రమంలో వారి గురించి ఆలోచించడం పూర్తిగా మానేసి, మన గురించి మన భవిష్యత్తు గురించి దృష్టి సారించాలి. ఇప్పటిదాక జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపోయి.. మన కెరీర్ ఏంటి ? భవిష్యత్తులో ఇప్పటి దాకా ఏం సాధించాం ? ఇంకా మనముందు ఎలాంటి లక్ష్యాలున్నాయి?

కెరీర్ పై దృష్టి పెట్టాలి :
ఇలా కెరీర్ కు సంబంధించిన విషయాలన్నీ ఒక్కసారి నెమరువేసుకోవాలి. ఇలాంటి ఆలోచనల్నీ పాత జ్ఝాపకాల్ని క్రమంగా మర్చిపోయేలా చేస్తాయి. ఫలితంగా మంచి కెరీర్ సొంతమవుతుంది. తద్వారా మునుపటి కంటే ఎంతో ఆనందంగా గడపొచ్చు.

కెరీర్ పై దృష్టి పెట్టాలి :
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం...అంత త్వరగా, అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదన్నది వాస్తవమే కావచ్చు..కానీ దాన్ని కాస్త వేగవంతం చేయాలంటే మాత్రం..ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగని ఓంటరిగా కూర్చొని ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను నెమరువేసుకుని ఆనందించడం కాదు. వీలైనంత ఎక్కువ సమయం కుంటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ వారితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి.

కెరీర్ పై దృష్టి పెట్టాలి :
అలాగే కొన్ని రోజులు ఇతర ప్రదేశాలకు వెళ్లి రావడం వల్ల కూడా స్థల మార్పిడి జరిగి ప్రేమించిన వ్యక్తిని, వారికి సంబంధించిన జ్ఝాపకాలను నెమ్మదిగా మర్చిపోవచ్చు. ఇలా సన్నిహితులతో సంతోషంగా ఉంటూ. బాధైనా, సంతోషమైనా వారితో పంచుకుంటూ ఉంటే మనస్సులో ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉంటాయి. తద్వారా పాత విషయాలన్నీ నెమ్మదిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications











