Latest Updates
-
ఒత్తిడితో కంటి మీద కునుకు కరువు.. ఈ యోగాసనాలతో ఇట్టే నిద్ర పట్టేస్తుంది.! -
సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు -
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.? -
వ్యాధినిరోధక శక్తిని పెంపు, ఎముకలకు కొండంత బలం..హైదరాబాదీ పెళ్లిళ్ల స్పెషల్ మటన్ మరాగ్ -
మీ పిల్లల్లో చుండ్రు సమస్య.. ఈ జెల్‌ను కాసేపు తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.? -
రోజుకు ఎన్ని పండ్లు తినాలి? డాక్టర్ చెబుతున్న చేదు నిజాలివే! -
పెళ్లి కాలేదా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువే! -
ఇడ్లీ,దోశలు వేస్ట్..ఇది తింటేనే అసలైన శక్తి..టేస్ట్ కేకో కేక! -
కొబ్బరి చెట్లు తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు పెరుగుతాయో తెలుసా.? -
మీ పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారా? ఈ ట్రిక్ తెలిస్తే అసలు ఫోన్ జోలికే వెళ్లరు!
ఫస్ట్ మీటింగ్ లో అబ్బాయిలు.. అమ్మాయిలో గుర్తించే విషయాలు
అబ్బాయిలు తమ పర్సనాలిటీ మాత్రమే చూస్తారని అమ్మాయిలు ఫీలవుతారు. కానీ మగవాళ్లు స్త్రీలలో ఇంకా చాలా గమనిస్తారు. అమ్మాయిల్లో ఎట్రాక్టివ్ బాడీ పేష్ లనే కాకుండా.. మరికొన్ని విషయాలను చాలా ఆసక్తిగా గమనిస్తారు.
వారు స్త్రీలలో ఉండే కొన్ని గుణాలని కూడా అభిమానిస్తారు. మనుష్యులంటే అనేక గుణాలు, అలవాట్ల కలయికే ముఖ్యమని భావిస్తారు. అందుకే ఏదో ఒక భాగమో, గుణమో చూసి ఇష్టపడటం సరైన పద్ధతి కాదు. మొదటిసారి అబ్బాయిని కలిసినప్పుడు వాళ్ల చూపులన్నీ తమ బ్రెస్ట్, బ్యాక్ పైనే ఉంటాయని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు కొంతమందికి ఉండవచ్చు. కానీ.. చాలామంది ఆకర్షణ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఫస్ట్ మీటింగ్ లో అబ్బాయిలు గమనించే విషయాలు తెలుసుకోవాలనుందా.. అయితే ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

చిరునవ్వు:
అవును మీ చిరునవ్వు మగవారిని కట్టిపడెయ్యగలదు. అమ్మాయిల చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది, ఒకవేళ మీరు నవ్వినప్పుడు బుగ్గల మీద సొట్టలు పడితే ఇంక ఆ నవ్వుకి ఏ మగాడైనా దాసోహమనాల్సిందే.

కళ్ళు:
తన అందమైన కళ్ళతో ఒక స్త్రీ మగవారి కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఇక వారు ఆగలేరు. అందువల్ల మీ మొదటి మీటింగులో సన్‌గ్లాసెస్ పెట్టుకోవద్దు. అతిగా కళ్ళకి మేకప్ చేసుకోకుండా మీ నీలి కళ్ళతోనే వెళ్ళండి మీరు మొదటిసారిగా అతన్ని కలిసేటప్పుడు.

పరిమళం:
ఆడవారు గాఢంగా ఉండే పెర్‌ఫ్యూంస్ వాడితే అబ్బాయిలకు నచ్చదు. అలాగే మీ శరీరం నుంచి వెలువడే చెమట వాసన కూడా వారికి నచ్చదని గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మీ శరీరం నుంచి ఒక రకమైన పరిమళం వస్తుంది. అది మగవారికి చాలా ఇష్టం.

పలువరుస:
మీరెంత అందంగా ఉన్నా కూడా మీ పళ్లు పాచిపట్టినట్లుగా ఉంటే మీ నోటి దుర్వాసనని ఊహించుకుని కనీసం కలలో కూడా మిమ్మల్ని ముద్దాడాలనుకోరు .

జుట్టు:
మగవారికి పొడవాటి కురులంటే ఇష్టం. జుట్టుని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోండి. మీకు పొడవాటి కురులుంటే, చల్ల గాలికి అలా మీ కురులు ఎగురుతుంటే చూడటం ఏ మగాడికైనా అధ్భుత దృశ్యమే.

కంఠస్వరం:
ఆడవారి కంఠధ్వనికి కూడా మగవారు ఆకర్షితులవుతారని మీకు తెలుసా?? తీయని లేదా హస్కీ స్వరం రెండూ కూడా వారికి నచ్చుతాయి. మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మగవారు మీ కంఠధ్వనినీ, టోన్‌నీ గమనిస్తారు.

మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే విధానం:
మీరు సూపర్ మోడల్ లాగ రెడీ అయినా లేదా సాదా సీదాగా ఉన్నా మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నారో అతను గమనిస్తాడు. మీరు ఏమి ధరించారో లేదా ఏ కాస్మెటిక్స్ వాడారో ఇవేమీ అతనికి అక్కర్లేదు.

ఫిగర్:
అవును నిజమే, మగవారు మొదటి మీటింగులో మీ ఆపాదమస్తకమూ ఒకసారి స్కాన్ చేసెస్తారు.అలా అన్నామని తప్పుగా అర్ధం చేసుకోకండి.అతను మిమ్మల్ని తన మస్తిష్కంలో బంధిస్తున్నాడంతే ఆ తరువాత మీ గురించి కలలు కనడానికి.



Click it and Unblock the Notifications