Latest Updates
-
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట! -
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
అమ్మాయిలు ఎక్కువ ఎమోషన్ అవడానికి అసలు కారణాలేంటి ??
అమ్మాయిలు ఎక్కువ ఎమోషన్ కి లోనవుతారు ఎందుకని చాలా మంది అబ్బాయిలు ఫీలవుతుంటారు. చాలా మంది అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అందుకే ప్రతి చిన్న విషయానికి.. ఎమోషన్ కి లోనవుతూ ఉంటారు. కానీ.. అందరు అమ్మాయిలు అలానే ఉండరు. కొంతమంది బయటపడతారు, కొంతమంది ఎమోషన్ ని ఎక్స్ ప్రెస్ చేయరు.
అయితే.. అబ్బాయిలు ఏమోషన్ కి లోనవరని చాలామంది భావిస్తారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు ఎక్కువ ఎమోషనల్ అని భావిస్తాం. అయితే.. వాళ్లు కూడా ఎమోషన్ అవుతారు. కాకపోతే.. బయటపడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు.. కానీ.. అమ్మాయిలు దాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తారు.
చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, పెంచిన తీరు, చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్లపై ఉన్న కండిషన్స్ కూడా.. అమ్మాయిల్లో ఎమోషన్ ఎక్కువగా ఉండటానికి కారణం అవుతాయి. మరి.. అమ్మాయిల్లో ఎక్కువగా ఎమోషనల్ ఫీలింగ్ ఉండటానికి అసలు కారణాలేంటో చూద్దాం..

పెరిగిన విధానం
కొన్ని ఫ్యామిలీల్లో.. మహిళలు ఎమోషనల్ గా పెరిగి ఉండవచ్చు. వాళ్ల కంటే ముందు.. తమ చుట్టూ ఉన్నవాళ్లు బావుండాలనే తత్వం కలిగి ఉండవచ్చు. వాళ్లు అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లు ఎమోషన్ అవడానికి కారణమవుతుంది.

హార్మోన్స్
కొన్ని సందర్భాల్లో రుతుక్రమాలు కూడా ఎమోషనల్ కి కారణమవుతాయి. రుతుక్రమం సమయంలో ఈస్ట్రోజెన్ ఫంక్షన్స్ ఎక్కువ ఎమోషన్ అవడానికి కారణమవుతాయి.

సామాజిక ఒత్తిడి
సామాజిక ఒత్తిడి కూడా.. ఎమోషనల్ గా ఫీలవడానికి కారణమవుతుంది. మహిళలపై అనవసర విషయాల్లో ఒత్తిడి, ఎక్స్ పెక్టేషన్స్ పెరగడం వల్ల.. ఎమోషనల్ అవుతారు.

గతంలో జరిగిన బాధాకర సంఘటన
కొంతమంది విషయంలో.. వాళ్లకు గతంలో ఎదురైన బాధాకర సంఘటన కూడా.. ఎమోషనల్ అవడానికి కారణమవుతుంది. చిన్న విషయానికి కూడా ఎందుకు అంత ఎమోషన్ అవుతుందని అని మీకు అనిపించి, కారణం దొరకకపోతే.. దానికి.. ఆమె మైండ్ లో ఉన్న గతంలో జరిగిన విషయమే కారణం అని గ్రహించండి.

సానుభూతి
మహిళలు సాధారణంగా చాలా సానుభూతి కలిగి ఉంటారు. వాళ్ల సంరక్షణ బాధ్యత వాళ్లను చాలా ఎమోషనల్ కి గురిచేస్తుంది.

బ్రెయిన్ యాక్టివిటీ
మగవాళ్లతో పోల్చితే.. ఆడవాళ్లు.. బ్రెయిన్ చాలా సందర్భాల్లో, చాలా పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా ఒత్తిడి పెరిగినప్పుడు ఎమోషనల్ అవుతుంటారు.

అంగీకరించాల్సినది
మనమందరం గ్రహించి ఉంటాం. మహిళలు ఎమోషన్ ని బయటపెడతారు. కానీ.. మగవాళ్లు ఎమోషన్ ని దాచిపెడతారు. ఆడవాళ్లు వాళ్ల ఎమోషన్ ని కన్నీళ్ల రూపంలో బయటపెడతారు. కానీ.. మగవాళ్లు.. కన్నీటిని కూడా దాచిపెడతారు.



Click it and Unblock the Notifications