For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ లేక‌పోతే బంధం బీట‌లువారిన‌ట్టేనా?

By Sujeeth Kumar
|

విజ‌య‌వంత‌మైన సంబంధం వెనుక ర‌హ‌స్య‌మేంటి? ఇక్క‌డ విజ‌యాన్ని ఎలా నిర్వ‌చిస్తాం... రుచిక‌ర‌మైన ఆహారంలో మాదిరిగానే అనుబంధంలోనూ ప్రేమ‌, శృంగారం, న‌మ్మ‌కం, గౌర‌వం క‌ల‌గ‌లిసి ఉంటాయి. అప్పుడే ఆ అనుభ‌వం స‌మ‌పాళ్లుగా ఉంటుంది.

దీంట్లో శృంగారం లోపిస్తే బంధం చ‌ప్ప‌గా మారుతుందా? కొంద‌ర‌మే సెక్స్ లేక‌పోతే త‌మ బంధం బ‌ల‌హీన‌ప‌డిపోతుంద‌ని భావిస్తే మ‌రికొంద‌రు దీంతో విభేదిస్తారు. 5 మంది జంట‌లు ఈ అంశం పై త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

1. సెక్స్ లేని బంధం రుచించ‌లేదు

1. సెక్స్ లేని బంధం రుచించ‌లేదు

సంబంధంలో ఉన్న తొలినాళ్ల‌లో అంతా బాగానే అనిపిస్తుంది. భాగ‌స్వాములిద్ద‌రి మ‌ధ్య విప‌రీత‌మైన సెక్స్ కోరిక‌లు ర‌గులుతుంటాయి. అయితే కొంత కాలానికి ఈ ఆక‌ర్ష‌ణ మ‌రుగున‌ప‌డిపోతుంది. నేనొక అనుబంధంలో 10ఏళ్ల పాటు కొన‌సాగాను. ఆ త‌ర్వాత అత‌డికి సెక్స్ ప‌ట్ల వ్యామోహం త‌గ్గిపోతుంది. నాకు సెక్స్ లేనిదే బంధం రుచించ‌లేదు. అందుకే విడిపోయాం.

2. శృంగారం లేకున్నా ప్రేమ త‌గ్గ‌లేదు

2. శృంగారం లేకున్నా ప్రేమ త‌గ్గ‌లేదు

మా ఇద్ద‌రికీ కామ‌న్‌గా చాలా అంశాలున్నాయి. ఇద్ద‌రి సెన్సార్ ఆఫ్ హ్యూమ‌ర్ , ఆహారంపై మ‌క్కువ‌, రాజ‌కీయ ఆస‌క్తులు ఒక‌టిగా ఉండేవి. మా పెళ్ల‌యి 30ఏళ్ల‌వుతుంది. ఇద్ద‌రు ఎదిగిన పిల్ల‌లున్నారు. రెండో పిల్ల‌వాడు పుట్ట‌గానే మా మ‌ధ్య శృంగార‌ప‌ర ఆక‌ర్ష‌ణ త‌గ్గిపోయింది. అంత మాత్రాన అత‌డికి నా మీద ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఏమాత్రం త‌గ్గ‌లేదు. సెక్స్‌ప‌రంగా బాగా ఎంజాయ్ చేయ‌లేదు కానీ మేమిద్ద‌రం సంతోషంగానే ఉన్నాం.

3. భాగ‌స్వామిని బ‌ట్టే...

3. భాగ‌స్వామిని బ‌ట్టే...

బాగ‌స్వామికి శృంగార‌ప‌ర కోరిక‌లు ఎలా ఉన్నాయి. ఒక‌వేళ అనుబంధంలో కొన‌సాగుతుంటే దాన్ని బాహాటంగా చెప్పుకునేందుకు గొప్ప‌లు అవ‌స‌ర‌మా? ఒక‌రికి అస‌లు సెక్స్‌ప‌ట్ల అస్స‌లు ఆస‌క్తి లేద‌నుకోండి, అవ‌త‌లివారు మ‌నం అర్థం చేసుకునేదాన్ని బ‌ట్టి ఉంటుంది. సంతోషంగా ఉండ‌టానికి ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకోవ‌డం ముఖ్యం.

4. ఆసుప‌త్రిలో క‌లుసుకున్నాం..

4. ఆసుప‌త్రిలో క‌లుసుకున్నాం..

పెళ్లి కాక‌ముందు యాక్సిడెంట్‌కు గురైన నా భ‌ర్త ప‌క్ష‌వాతం వ‌చ్చింది. మేమిద్ద‌రం ఆసుప‌త్రిలో క‌లుసుకున్నాం. నేను అత‌డికి ఫిజియోథెర‌పీ ట్రీట్‌మెంట్ ఇచ్చేదాన్ని. ఇద్ద‌రం అప్పుడే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్ద‌రి మ‌ధ్య భావోద్వేగ‌ప‌రంగా మంచి అనుబంధం ఉండేది. అస‌లు శృంగార‌ప‌ర ఆక‌ర్ష‌ణ లేద‌ని చెప్పాలి. ఇప్ప‌టికీ పెళ్ల‌యి 5ఏళ్ల‌వుతుంది సంతోషంగా ఉన్నాం.

5. అది లేక విడిపోవ‌డ‌మే మంచిదనిపించింది...

5. అది లేక విడిపోవ‌డ‌మే మంచిదనిపించింది...

సెక్సువ‌ల్ ఇన్‌కంపాటిబిలిటీ అని అనొచ్చు లేదా ఆక‌ర్ష‌ణ లేక‌పోవ‌డం కావొచ్చు. ఏదేమైనా మా ఏడేళ్ల బంధంలో ఒక‌రంటే ఒక‌రికి వ్యామోహం త‌గ్గింది. ఇతరుల‌తో గ‌డిపడం ఆనందంగా అనిపించేది. మా మ‌ధ్య సెక్స్ బొత్తిగా లేక‌పోయేస‌రికి ఇక విడిపోవ‌డ‌మే మంచిద‌నిపించింది.

English summary

can-a-relationship-exist-without-sexual-attraction

can-a-relationship-exist-without-sexual-attraction,
Desktop Bottom Promotion