For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విఫలమైన ప్రేమకు కన్నీటి వీడ్కోలు...నీ సుఖమే నే కోరుకున్నా...

విఫలమైన ప్రేమకు కన్నీటి వీడ్కోలు...నీ సుఖమే నే కోరుకున్నా...

|

ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. నిజానికి, ప్రేమలో ఉండటమనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. ప్రేమను తిరిగి పొందటమనేది ఒక వరం. మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా? అయితే, మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి మీకు ప్రేమ లభించలేదా? ఇటువంటి సందర్భం జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమ భావనలు కేవలం ఒక వ్యక్తి నుండే వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఆ భావనలను స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోతుంది. దీని వలన ప్రేమ భావనలు ఏ విధంగా ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ఆ వ్యక్తి నుంచి ప్రేమను తిరిగి పొందలేకపోయి ఉండుంటారు. వేచి చూసి, ఆ వ్యక్తి నుంచి తిరిగి ప్రేమను పొందడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉండుంటారు. చివరికి, ఎటువంటి ఫలితం లభించి ఉండదు. వారి నుంచి ప్రేమ అందదని తేలుతుంది.

GOODBYE TO THE LOVE THAT NEVER HAPPENED TO BE MINE

మన ప్రేమను వారు స్వీకరించి తిరిగి ప్రేమను పంచుతారని శతవిధాలా ప్రయత్నించి ఉన్నా చివరికి మన మనస్సుకు గాయమే మిగిలి ఉంటుంది.

ప్రేమకు సంబంధించిన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ అనేది చివరికి గాయాన్ని మిగల్చడం. ప్రేమ ప్రేమను అందించకుండా మనసుకు గాయం చేయడం అత్యంత బాధాకర అంశం. వన్ సైడ్ లవ్ విషయంలో అదే జరుగుతుంది.

ప్రేమ అనే పరిమళాన్ని మనం ఆస్వాదించకుండా తప్పించుకోలేము. మనలోకి ఇది చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొంతమంది అదృష్టవంతులు ప్రేమలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మరికొంత మంది ప్రేమ వలన మనసును గాయపరచుకుంటారు.

వన్ సైడ్ లవ్ వలన బాధ ఎందుకు కలుగుతుంది?

వన్ సైడ్ లవ్ వలన బాధ ఎందుకు కలుగుతుంది?

ప్రేమ అనేది నవల్స్ లో వర్ణించినంత మధురంగా నిజజీవితంలో అందరికీ సంతోషాన్ని కలిగించలేదు. ప్రేమ వలన మధురమైన జీవితం కలిగిన వారు నిజంగా అదృష్టవంతులే. వాస్తవం అనేది కల్పిత గాథల కంటే భిన్నంగా ఉంటుంది. ఫెయిరీ టేల్స్ లోని ప్రేమను చూసి తమ జీవితంలో అటువంటి ప్రేమను పొందాలని కలలుగనే వారు నిజజీవితంలోని ప్రేమ గురించి తెలుసుకుని బాధకు గురవుతారు.

వన్ సైడ్ లవ్ అనేది ఎల్లప్పుడూ బాధాకరంగా ఉంటుంది. ఈ బాధ అనేది తీరనిది. ఈ విశాల ప్రపంచంలో గల్లంతైన స్పేస్ షిప్ వంటిది వన్ సైడ్ లవ్. గుండె లోలోతుల్లో వన్ సైడ్ లవ్ వలన దాగున్న విరహ వేదనని ఎవరూ తప్పించలేరు. ప్రేమ నెరవేరాలని కోరుకుంటారు. అయితే, వన్ సైడ్ లవ్ లో ప్రేమ నెరవేరే ప్రసక్తే ఉండదు. దీని వలన తలెత్తే బాధ స్థిరత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది.

వన్ సైడ్ లవ్ కి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

వన్ సైడ్ లవ్ కి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

ఈ కఠినమైన నిజాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ మీరు చదువుతున్నారంటే మీరు కూడా ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారై ఉండవచ్చు. కొన్ని సార్లు, ప్రేమను బలవంతంగా పొందలేము. ప్రేమ భావన దానంతట అదే మొలకెత్తుతుంది. ఈ భావన అనివార్యమైనది. మీరు ఒక వ్యక్తితో ఎక్కువ సమయం గడిపేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి మీరొక అభిప్రాయానికి వచ్చి తీరతారు. గతానికి చెందిన అనుభవాల దృష్ట్యా ఒక వ్యక్తి ఒక విషయంపై అభిప్రాయం ఏర్పరచుకోవడం జరుగుతుంది. సాధించవలసిన లక్ష్యాలు, తప్పులు, ప్రేమ లోతులు పై గతానుభవాల ప్రభావం ఉంటుంది. ఆలా మీకు తెలియకుండానే ప్రేమలో అనుకోకుండా పడిపోవడం జరుగుతుంది. ప్రేమ భావన మిమ్మల్ని చుట్టుముడుతుంది. అయితే, ప్రేమ ప్రేమను కోరుకుంటుంది. ఇది సహజం. వన్ సైడ్ లవ్ విషయంలో ప్రేమను తిరిగి పొందటం అసాధ్యం. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, సంతోషం ఆవిరైపోతుంది, వేదన పెరుగుతుంది. ఇలా ప్రేమ అనేది వేదనను పెంచుతుంది.

వన్ సైడ్ లవ్ ఎందుకు బాధిస్తుంది?

వన్ సైడ్ లవ్ ఎందుకు బాధిస్తుంది?

1. ప్రేమను తిరిగి పొందలేరు

మీరెవరినైనా ప్రేమించినప్పుడు వారి నుంచి మీరు అదే ప్రేమను ఆశిస్తారు. అయితే, వన్ సైడ్ లవ్ విషయంలో ఇది జరగటం అసాధ్యం. దాంతో, మనస్సు విరుగుతుంది. ప్రేమలో పడమని బలవంతం పెట్టలేము. ప్రేమ అనే భావన సహజంగా కలగాలి. అందువలన, ఎదుటి వ్యక్తిలో మొలకెత్తని ప్రేమ భావన మరింత వేదనను కలిగిస్తుంది. వారు ఎప్పటికైనా తిరిగి ప్రేమిస్తారని ఆశిస్తాము. చివరికి, వారి నుంచి ప్రేమను పొందటం అసాధ్యమని తెలుసుకుంటాము.

2. స్వాభిమానం అణగారిపోతుంది:

2. స్వాభిమానం అణగారిపోతుంది:

మానవులకు స్వాభిమానం సహజంగా ఎక్కువ. ప్రేమించడం ద్వారా తిరిగి ప్రేమను పొందవచ్చని భావిస్తారు. అయితే, ప్రేమను పొందటంలో విఫలమైనప్పుడు తమ విలువ తగ్గిపోయినట్లు భావిస్తారు. స్వీయ గౌరవం పోయిందని భావిస్తారు. తమతో ప్రేమలో పడనందుకు ఎదుటి వ్యక్తిని నిందించటం ప్రారంభిస్తారు. యుగాలుగా, ప్రేమ మీద ఉన్న అభిప్రాయం అనేక మార్పులకు గురవుతూ వస్తోంది. ప్రస్తుత సినేరియాలో ప్రేమతో పాటూ సెల్ఫ్ వర్త్ అనేది సమాన హోదాను కలిగి ఉంటోంది. ప్రేమ ఉన్న చోట సెల్ఫ్ వర్త్ ఉండి తీరాలి. ఏదైనా ఒకటి మిస్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్, చిరాకు, బాధ వంటి భావనలు విజృంభిస్తాయి. వీటిని మేనేజ్ చేయడం కష్టతరం అవుతుంది.

ఈ రెండు కారణాల వలన వన్ సైడ్ లవ్ అనేది విపరీతంగా బాధకు గురిచేస్తుంది. ప్రేమను తిరిగి పొందలేని నిస్సహాయత అనేది మానసికంగా వేదనను కలిగిస్తుంది. ప్రేమను తిరిగి పొందాలని భావించడం సహజమే. ఆ ప్రేమ అందదని తెలిసినప్పుడు జీవితంలో ముందుకు వెళ్లడం మానకూడదు. ప్రేమ శాంతిని కోరుకుంటుంది. ప్రేమను పొందలేనప్పుడు ఆ ప్రేమను మనసుకు సంతోషాన్నిచ్చే ఇతర పనులపై మళ్లించాలి. ఎవరికైనా సహాయం చేయడం ద్వారా అలాగే ప్రేమ అందని అనాధ పిల్లలకు అవసరమైన వస్తువులను అందించడం ద్వారా ప్రేమలోని బాధను మళ్లించాలి. ప్రేమ తిరిగి దక్కకపోవడం ద్వారా మీ ప్రేమకు సరిపడేంత ప్రేమ ఎదుటివ్యక్తిలో లేదని అర్థం చేసుకుని మీ ప్రేమను పదిలంగా కాపాడుకోవాలి. ఒక వ్యక్తికే పరిమితం చేసి మానసికంగా ఇబ్బందికి గురయ్యే బదులు, సమాజ సేవలో పాల్గొని ప్రేమ గాయం నయమయ్యేల్లా ప్రయత్నించాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.

విఫలమైన ప్రేమకు కన్నీటి వీడ్కోలు కాదు స్నేహపూర్వక వీడ్కోలు పలకాలి. అంతటి, గుండె ధైర్యం కలిగి ఉండాలి.

English summary

GOODBYE TO THE LOVE THAT NEVER HAPPENED TO BE MINE

Have you ever had the feeling of being in love with someone where the other person doesn't reciprocate the same kind of feelings? Oh! You must have. We all have faced it. Goodbye to the love that never happened to be mine is all about the one-sided love and how it affects the beauty of love in our mind.
Story first published:Monday, July 16, 2018, 14:43 [IST]
Desktop Bottom Promotion