For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక సంబంధం లేకుండా భాగస్వామితో సన్నిహితంగా ఎలా ఉండవచ్చు?

లైంగిక సంబంధం లేకుండా భాగస్వామితో సన్నిహితంగా ఎలా ఉండవచ్చు?

|

ఈ 21 వ శతాబ్దంలో ఒక సంబంధం నిలబడాలంటే లైంగిక సంబంధం కలిగి ఉండాలన్న భావన అనేకుల్లో పాతుకునిపోయి ఉంది. ఇది నిజంగా అత్యంత భాదాకరమైన విషయం. కానీ, భాగస్వాములు తరచుగా భౌతిక సాన్నిహిత్యం కన్నా మానసిక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. నిజంగా మీ మనసులో మీ భాగస్వామి పట్ల అచంచలమైన ప్రేమే ఉంటే లైంగిక సాన్నిహిత్యం పెద్దగా అవసరం లేకుండానే సంతోషంగా గడపవచ్చు.

అవును, మీ భాగస్వామి ప్రేమను అనుభూతి చెందడానికి ధైర్యo, రక్షణ, సాన్నిహిత్యంగా మెలగడం మొదలైన టన్నుల కొద్దీ అంశాలు ప్రధాన పాత్రను పోషించగలవు. కేవలం లైంగిక సంబంధమే పరమావధిగా మరియు ప్రేమకు అర్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే, ఏదో ఒకరోజు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇప్పటికీ అనేకులు ప్రేమలో ఉన్నా కూడా, లైంగిక సంబంధాన్ని పెళ్లి తర్వాతే కొనసాగించాలి అన్న దృఢనిశ్చయoతో ఉన్నారు. అలాగని వారి మద్య ప్రేమ లేనట్లు కాదు. రాబోవు పరిస్థితులకు, సామాజిక కట్టుబాట్లకు, కుటుంబ పెద్దలకు, వ్యక్తిత్వ విలువలకు గౌరవమిచ్చి ప్రేమ అంటే శారీరికంగానే కాదు మానసికంగా కూడా సాన్నిహిత్యాన్ని కలిగి ఉండవచ్చు అని నిరూపిస్తున్నారు.

HOW CAN YOU BE INTIMATE WITH YOUR PARTNER WITHOUT SEX

మంచి సంబంధం అనేది నిజాయితీ, ప్రేమ, అవగాహన మరియు మానసిక సాన్నిహిత్యం అనే ప్రధాన అంశాలతో నిండి ఉంటుంది. అంతే కానీ కేవలం లైంగిక సంబంధం కాదు.

లైంగిక సంబంధం లేకుండా ప్రేమను, సాన్నిహిత్యాన్ని కొనసాగించేందుకు, ఈ క్రింది పద్దతులను అనుసరించవచ్చు.

పరస్పర అభినందనలు :

పరస్పర అభినందనలు :

అవును, ఏ సంబందానికైనా ప్రశంసలు అనేవి మాస్టర్ కీ. ప్రపంచం మొత్తం మీకు లేదా మీ భాగస్వామికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా మిమ్మల్ని హేయభావంతో చూస్తున్నా, మీలో ఒకరంటే ఒకరికి కనీస నమ్మకం, గౌరవం ఉండాలి. ఒకరినొకరు తీసుకున్న నిర్ణయాల పరంగా అభినందిoచుకోవాలి. నిద్ర లేచిన వెంటనే, ఎదో ఒకరీతిన మీ మనసులో మీ భాగస్వామి స్థానం ఏమిటో తెలియజేయవలసిన అవసరం ఉంది. నిద్రకు ముందు కూడా, వారు మీ మనసులోనే ఎప్పటికీ ఉంటారన్న భావన కలిగించేలా ప్రయత్నించండి. ఎప్పుడూ ఒకేలా ప్రేమను వ్యక్తపరచకుండా, సందర్భానుసారం వారి పట్ల మీరు ఎంత అభిమానం కలిగి ఉన్నారో తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ అలవాటు మీ మద్య ఉన్న సంబంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

ఆప్యాయతతో కూడిన ముద్దు :

ఆప్యాయతతో కూడిన ముద్దు :

లైంగిక సంబంధం లేకపోయినా, మీ భాగస్వామి ఒక మంచి ముద్దుకు అర్హత పొందిన వారే కదా ! ముద్దు వంటి యాదృచ్ఛిక భావాలు నిజంగా ప్రత్యేకమైనవిగా భావించబడతాయి. నడుస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా కూర్చొని ఉన్నప్పుడు, టీవీ లేదా సినిమాలను చూస్తున్నప్పుడు, బుగ్గ మీద, నుదిటి మీద లేదా చేతులపై యాదృచ్ఛికంగా ముద్దుపెట్టుకోవడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. మంచి ముద్దు మీరు భౌతిక సాన్నిహిత్యాన్ని దెబ్బతీయదు, బదులుగా వారికి ప్రత్యేక అనుభూతికి లోనుచేస్తుంది కూడా. మీరు ప్రేమతో ఇచ్చే ముద్దు, మీ మానసిక సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం :

ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం :

మీ భాగస్వామితో చేతులు పట్టుకోవడం కంటే మెరుగైన సంజ్ఞ ఉంటుందా? ఎక్కడైనా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారి చేతులను మీ చేతుల్లోనికి తీసుకొని నెమ్మదిగా మీ స్పర్శను అనుభూతి చెందేలా ప్రయత్నించండి. తద్వారా మీ భాగస్వామికి మీ పట్ల తెలియని ధైర్యం ఏర్పడుతుంది. హర్రర్ లేదా శృంగార భరిత చిత్రాలు చూసినప్పుడు వారి చేతులను పట్టుకోవాడం ద్వారా మీ ధైర్యాన్ని, మీ ప్రేమను తెలియజేసిన వారవుతారు. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద జంట చేతులు పట్టుకొని నడవడం చూశారా? మీకు ఎంత సంతోషంగా అనిపించిది చెప్పండి? ప్రేమలో పడిన మొదటిరోజుల్లో చేతులని పట్టుకుని నడిపించడం కాదు, దశాబ్దాలైనా, జీవిత చరమాంకంలో అయినా ఆ చేతిని విడువకూదదన్న సత్యాన్ని గ్రహించండి. అది స్పర్శని మాత్రమే కాదు ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది అని మరవొద్దు.

ఎల్లప్పుడూ కొత్త జంటగా ఉండండి:

ఎల్లప్పుడూ కొత్త జంటగా ఉండండి:

ఎప్పుడు కూడా మీ భాగస్వామి తనపట్ల ప్రేమను కోల్పోయినట్లు, క్షీణించినట్లు భావించనివ్వకండి. రోజులు మారినా ప్రేమ మారదు అన్న అనుభూతిని కలిగించడం మీ బాధ్యత. ఎల్లప్పుడూ పెళ్ళైన కొత్త జంటలా ఉండేలా ప్రయత్నించండి. తద్వారా సంతోషాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ మీ బంధం అవుతుంది. ప్రేమ యొక్క తాజాదనం భావోద్వేగ బందాలు, హాస్యచతురత, సంరక్షణ మరియు అవగాహన వంటి ప్రాధమిక అoశాలపైనే ఆధారపడి ఉంటుంది. మీ భాగస్వామితో తొలినాళ్ళలో మీరు చూపే ప్రేమను, జీవిత చరమాంకంలోకూడా ఉండేలా ప్రవర్తించాలి.

ఔటర్ కోర్స్:

ఔటర్ కోర్స్:

లైంగిక చర్యను ఇంటర్-కోర్స్ అంటారు. కానీ ఫోర్-ప్లే వంటి మిగిలిన బాహ్య శరీర సంబంధ చర్యలను ఔటర్ కోర్స్ గా అభివర్ణిస్తారు. కొన్ని సందర్భాలలో పరిస్థితులు లైంగిక చర్యలకు ఉసిగొల్పుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని అనేక మలుపులు తిప్పడం ప్రతిరోజూ టీవీలలో , పేపర్లలో చూస్తూనే ఉంటాం. కొందరైతే తెలీక తీసుకున్న సెల్ఫ్ పోర్నోగ్రఫీ సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తూ వ్యక్తి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంది. మరియు పెళ్ళికి ముందే తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మానసికంగా, సామాజికంగా అనేక సమస్యలను తీసుకొస్తుంది. సంబంధానికి పెళ్ళికి మధ్య సమయంలో డిప్రెషన్ కు లోనవుతున్న అనేక జంటలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మనకు తెలియనిది కాదు. కావున పరిస్థితులు లైంగిక సంబంధం పట్ల ఆసక్తిని రేపితే, ఫోర్- ప్లే వంటి చర్యలకు పూనుకోవడం ద్వారా పరిస్థితిని అధిగమించవచ్చు. తద్వారా భౌతిక సాన్నిహిత్యాన్ని కోల్పోకుండా, స్వావలoబన పొందుతారు.

గుండెనిండా భావాలను వ్యక్తపరచండి :

గుండెనిండా భావాలను వ్యక్తపరచండి :

ప్రేమ అంటే లైంగిక సాన్నిహిత్యం మరియు శారీరక ఆనందం మాత్రమే కాదు, అక్కడ మానసిక సంతోషం అనే మరో అంశం కూడా ఉంది. మీరు మీ హృదయం నిండుగా ఆనందాన్ని పొందలేకపోతే, ఆ సాన్నిహిత్యానికి అర్ధం ఉంటుందా? . మీ భాగస్వామితో మీ భావాలను, కుటుంబ విషయాలను మరియు భావోద్వేగాలను పంచుకోండి. ఎటువంటి సమస్యలున్నా, సంతోషాలున్నా వాటిని మీ భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ సాన్నిహిత్యం రెట్టింపు అవుతుంది. ఎటువంటి సమస్య అయినా, ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారానే సమస్య పరిష్కారమవుతుంది. దాపరికాలు మొదటికే చేటుని తెస్తాయి.

ఆప్యాయంగా అక్కున చేర్చుకోండి :

ఆప్యాయంగా అక్కున చేర్చుకోండి :

అబ్బాయైనా అమ్మాయైనా కౌగిలిని ఇష్టపడని ప్రేమికులుంటారా? చెప్పండి. ప్రేమను వ్యక్తపరచడంలో కౌగిలిని మించిన వరం మరొకటి లేదని ప్రేమికులకు తెలియనిది కాదు. మానసిక స్వావలంబన కోసం, చెడు కోరికలను తుదముట్టించడానికి, భావోద్వేగాలను రూపు మాపేందుకు, ప్రేమను వ్యక్తపరచుటకు, డిప్రెషన్ వంటి సమస్యలను సైతం అధిగమించగలిగే శక్తి ఈ కౌగిలికి ఉంది. ప్రేమలో లైంగిక సాన్నిహిత్యాన్ని కలిగి లేకున్నా, ముద్దు, కౌగిలి వంటివి మానసిక సాన్నిహిత్యాన్ని పెంచడంలో కీలకపాత్రను పోషించగలవు. ఆప్యాయంగా అక్కున చేర్చుకుని, నుదుటిపై ఇచ్చే ఒక చిన్న ముద్దుకు ఎన్ని కొట్లిచ్చినా తక్కువే. ప్రేమలో శరీరాన్ని మాత్రమే చూడడం అనేది అత్యంత హేయమైన చర్య. బంధాలు ఎక్కువకాలం కొనసాగాలంటే, పైన చెప్పిన ప్రతి అంశమూ ముఖ్యమే అని గుర్తుపెట్టుకోండి.

English summary

HOW CAN YOU BE INTIMATE WITH YOUR PARTNER WITHOUT SEX

Every relationship becomes sore and boring after some time, but sex should not be the only reason for keeping your relationship alive. Be it removing the boredom or be it why the relationship has become boring, you just have to love your partner enough to create the intimacy without sex. Read to know the reasons behind.
Story first published:Monday, May 21, 2018, 17:33 [IST]
Desktop Bottom Promotion