For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేట్ మొదటి రోజునే ముద్దు పెట్టాను? ఎంత వరకు సమంజసమో అర్ధం కావడం లేదు.

డేట్ మొదటి రోజునే ముద్దు పెట్టాను? ఎంత వరకు సమంజసమో అర్ధం కావడం లేదు.

|

మీరు మీ ప్రియమైన వారితో డేట్ కోసం సిద్దపడుతున్నారు. మీకోసం మంచి సాయంత్రం ఎదురుచూస్తూ ఉంది. మనసులోని భావాలను తెలియజేయడానికి అద్భుత సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మీ ఆలోచనలన్నీ కలలుగా మిగిలిపోతాయేమో అని మీ అభిప్రాయం. మీతో డేట్ ఆ వ్యక్తికి ఇదే తొలిసారి కావొచ్చు. కానీ, చివరన ఒక సున్నితమైన ముద్దుతో రోజుని ముగించాలన్న ఆలోచన రావడం సహజం. అవునా ?

చివరికి అన్నిటికీ సిద్దపడ్డారు, మీ మనసులో అనేక ఆసక్తి కలిగించే ప్రశ్నలు కూడా తలంపుకు వస్తున్నాయి. మరియు మీ మనస్సు అనేక విషయాల గురించి మిమ్మల్ని అడుగుతోంది కూడా.

I Kissed On The First Date. I Dont Know If Thats OK?

మీ మనసున తోచిన ఈ ప్రశ్నలన్నింటిలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నగా మీరు భావించింది ఏంటి? "డేట్ మొదటి రోజే ముద్దు పెట్టవచ్చా?" అంతేగా.

విశ్లేషించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు వ్యక్తుల భిన్న ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి ముద్దు అనేది పెద్ద విషయం కాదని కూడా మీరు అనుకోవచ్చు, కానీ ఎలా ఆరంభించాలి అనేది కూడా ప్రశ్నే ఇక్కడ. ఇది మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది.

ముద్దు ఎందుకు అనివార్యం? కారణాలు చూద్దాం.

1. తీవ్రమైన లైంగిక ఉత్సుకత

1. తీవ్రమైన లైంగిక ఉత్సుకత

లైంగిక ఉత్సుకత అనేది ఖచ్చితంగా మీ ఇద్దరి మద్య సంబంధాన్ని మరింత పెంచుతుంది. ఒకవేళ ఇద్దరి మనస్సులో ఒకరి మీద ఒకరికి సాదరాభిమానం ఉన్నట్లయితే, ముద్దు అనేది చాలా చిన్న విషయమే అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఈ ముద్దుకు కారణం మీ ఇద్దరూ ఒకరికై ఒకరు ఏర్పరచుకున్న అనియంత్రిత భావాలే ప్రధాన కారణం. తద్వారా మీ డేట్ మొదటి రోజునుండే మీ మద్య సంబంధం మరింత గట్టి పడుతుంది.

2. మీ మరియు మీ డేట్ మధ్య పరస్పర ఆకర్షణ:

2. మీ మరియు మీ డేట్ మధ్య పరస్పర ఆకర్షణ:

మీ ఇద్దరి మద్య మానసిక సంబంధం మరింత గట్టిపడేలా చేసే ముద్దు, క్రమంగా భావాలను, ఆలోచనలను అలవాట్లను ఒకరికొకరు పూర్తిగా అర్ధం చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఒక్క ముద్దు అనేక ప్రశ్నలను తునాతునకలు చేసేస్తుంది కూడా. ఆ ముద్దులోనే ప్రేమ, ఆప్యాయతా, నమ్మకం బయటపడుతాయి. అంతేకాకుండా వ్యక్తి మీద సదరు అభిప్రాయం కలగడానికి కూడా ప్రధాన కారణం అవుతుంది.

3. పర్ఫెక్ట్ డేట్

3. పర్ఫెక్ట్ డేట్

డేట్ మరియు మీ భాగస్వామి సరైనవిగా మీరు భావిస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా మీరు ముద్దుకు సిద్దపడుతారు. ఈ ముద్దు ఇద్దరి మద్య ఆకర్షణకు, తద్వారా ఒక మానసిక అవినాభావ సంబంధానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి అని మరవకండి. బీచ్ మరియు డంపింగ్ యార్డ్ నకు ఖచ్చితంగా తేడా ఉంటుంది కదా. ముద్దు పెట్టాలన్న మీనిర్ణయంతో పాటు పరిసరాలు సహకరించకపోతే, మనసులో పదిలంగా గుర్తుండాల్సిన డేట్, గుర్తొస్తే కలవరపడేలా చేస్తుంది.

4. వన్ టైమ్ మీట్

4. వన్ టైమ్ మీట్

మీరు మీ డేట్ ని కలుసుకున్నారు, కాని ఇద్దరి మద్య కెమిస్ట్రీ లేదు. మీ డేట్ ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీకు తోచింది మరియు ప్రతి అంశమూ ఖచ్చితంగా ఉంది. కానీ మీ మరియు మీ భాగస్వామి మధ్య ఉండాల్సిన సున్నితమైన కెమిస్ట్రీ లేదు. ఈసందర్భంలో, ఒక చిన్న ముద్దు మీ మద్య కెమిస్ట్రీని ఖచ్చితంగా పెంచుతుంది. ఇటువంటి సందర్భాలలో ముద్దు అనివార్యమే మరి.

5. మీరు మీ డేట్ ని ఇదివరకే ఇష్టపడ్డారు:

5. మీరు మీ డేట్ ని ఇదివరకే ఇష్టపడ్డారు:

ఇది వరకే మీరు ప్రేమించిన వ్యక్తే మీ డేట్ గా ఉంటే, మీ ఆలోచనలను ఆపడం ఎవరితరమూ కాదు. ఖచ్చితంగా ముద్దు అక్కడ ప్రధాన అంశమే అవుతుంది. ఇది సహజo మరియు మీ డేట్ ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తొందరపాటు తగదు. పరిస్థితులకు అనుగుణంగా, ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను ఉద్దేశంగా ఉంచుకునే ముద్దుకు ఉపక్రమించవలసి ఉంటుంది.

6. మీరు మీ డేట్ యొక్క 'జెంటిల్మన్' నేచర్ తెలుసుకోవాలని కోరుకుంటున్నారా

6. మీరు మీ డేట్ యొక్క 'జెంటిల్మన్' నేచర్ తెలుసుకోవాలని కోరుకుంటున్నారా

మీ డేట్ యొక్క స్వభావం తెలుసుకోవటానికి, లేదా అర్ధం చేసుకోడానికి ముద్దు ఎంతగానో సహాయపడుతుంది. ఒక్కోసారి ముద్దు కొన్ని ఇతర ఆలోచనలకు కూడా దారి తీస్తుంది. కానీ ఇక్కడ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి, మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దులను దాటరన్న నమ్మకం మీ మనస్సులో ఉండాలి. లేని పక్షాన మీ బంధం శాశ్వతంగా వీగిపోయే అవకాశాలు లేకపోలేదు.

ముద్దుకు సునిసితత్వం జోడించాలి, ఉద్రేకం ఒక్కోసారి మీ భాగస్వామిని అసౌకర్యానికి గురిచేయవచ్చు. ఒకవేళ ఇద్దరి ఆలోచనల సరళి ఒకేలా ఉంటే సమస్య లేదు కానీ, భిన్న దృవాల ఆలోచనల్లో పొరపాటు నిర్ణయాలు సంబంధాలపై పెను ప్రభావాలనే చూపుతాయి.

7. మీ డేట్ మీ పట్ల ఎటువంటి ఆలోచనలను కలిగి ఉందో తెలుసుకోండి.

7. మీ డేట్ మీ పట్ల ఎటువంటి ఆలోచనలను కలిగి ఉందో తెలుసుకోండి.

మీరు మొదటి సారిగా మీ డేట్ ను ముద్దుపెట్టుకున్నప్పుడు, మీ మరియు మీ డేట్ మధ్య ఉండే భావోద్వేగ ప్రవాహాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీ అంతఃహృదయంతో ఒక ప్రేమను, ఆప్యాయతను ఆశించి ముద్దు పెట్టుకోడానికి, యాంత్రిక ధోరణిలో ముద్దు పెట్టుకోడానికి, లైంగిక సంబంధాన్ని ఆశించి ముద్దు పెట్టుకోడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఈ ముద్దే ఆ వ్యక్తితో సంబంధం కొనసాగించాలా లేదా అన్న ఆలోచనను ఖచ్చితంగా ఇవ్వగలదు కూడా.

8. మీరు ఒక ఆధునిక మహిళగా ఉండి కట్టుబాట్ల పట్ల

8. మీరు ఒక ఆధునిక మహిళగా ఉండి కట్టుబాట్ల పట్ల

ఒక వ్యక్తిగత అభిప్రాయాలను కలిగి ఉన్న ఎడల, మీ నిర్ణయాలు మీరే తీసుకునే స్వేచ్చను కూడా కలిగి ఉంటారు. ఇతరుల ఆలోచనలు అభిప్రాయాల కన్నా, మీ మనస్సాక్షి లేదా అంతరాత్మ మాటలకే ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు కూడా.

మానసిక సన్నద్దతతో, మీ అంగీకారంతో మాత్రమే ముద్దుకు అంగీకరించడం లేదా పూనుకోవడం చేయాలి కానీ, ఒకరి ప్రోద్భలంతో లేదా బెదిరింపులకు లొంగే మనస్థితి మీకు ఉండకూడదు అని మర్చిపోకండి. అవకాశవాదుల ప్రపంచంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా ఉండాలన్న ప్రధాన సూత్రాన్ని విస్మరించవద్దు. ముద్దు మీ మద్య మానసిక సంబంధాన్ని పెంచేలా ఉండాలి కానీ, ఆత్మ న్యూనతతో భాధపడేలా కాదు.

9. మీరు ప్రామిస్ చేయడానికే ముద్దు పెట్టారు

9. మీరు ప్రామిస్ చేయడానికే ముద్దు పెట్టారు

మొదటి డేట్ లో ఇచ్చే ముద్దు, వారిద్దరి మద్య సాన్నిహిత్యాన్ని పెంచడమే కాకుండా, వారి సంబంధం మరింత కాలం కొనసాగుతుందన్న వాగ్దానం కూడా చేస్తుంది. మొదటి డేట్ లోనే ముద్దుకు సిద్దమవడానికి ఇది ప్రధాన కారణం.

ఇందులో ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒకేవిధంగా ఉంటాయని లేదు, చివరికి ఏది ఏమైనా పరిస్థితులకు అనుగుణంగానే నడవాల్సి వస్తుంది.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి ఇటువంటి అనేక విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

I Kissed On The First Date. I Don't Know If That's OK?

I Kissed On The First Date. I Don't Know If That's OK,You went out for a date. You and your date just had a great evening. Your date held the door for you and you said something insightful about fiction, and you both agreed that human minds are the biggest fiction. It was your first date with the person and en the end
Story first published:Tuesday, June 19, 2018, 17:49 [IST]
Desktop Bottom Promotion