For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రమ్యకు పెళ్లయ్యింది.. బాబు ఉన్నాడు.. అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా - #mystory182

రమ్యకు పెళ్లయినా.. బాబు ఉన్నా.. నేను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. తెలుగు ప్రేమ కథలు, రొమాంటిక్ స్టోరీలు. " నాకు ఒక బాబు ఉన్నాడు.. జనాలంతా మన గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటారో తెలుసా "

|

తను చాలా రోజుల తర్వాత నాకు కలిసింది. ఆమెను చూడగానే నాకు నా జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. తన రూపం నేను బీటెక్ లో చూసినట్లుగానే ఉంది. నేను బీటెక్ లో జాయిన్ అయినప్పుడు నాకు పరిచయం అయిన మొదటి అమ్మాయి రమ్య.

నా కళ్లూ తనను చూస్తూ

నా కళ్లూ తనను చూస్తూ

వెల్ కమ్ పార్టీలో తాను పాడిన పాట నాకు ఇప్పటికీ గుర్తు.

ఆ రోజు అందరి కళ్లతో పాటు నా కళ్లూ తనను చూస్తూ ఉండిపోయాయి. తను కాస్త నల్లగా ఉన్నా చాలా అందంగా నవ్వు ముఖంతో ఉంటుంది. అందుకే తను నాకు తొలి చూపులోనే నచ్చింది.

కాలేజీకీ మొదటే వచ్చేది

కాలేజీకీ మొదటే వచ్చేది

తను రోజూ కాలేజీకీ మొదటే వచ్చేది. నేను కూడా చాలా ఉదయాన్నే కాలేజీకి వెళ్లేవాణ్ని. దాంతో నాకు తనతో ఈజీగా పరిచయం పెరిగిపోయింది. కొన్ని రోజుల్లోనే మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం.

నా బైక్ పైనే

నా బైక్ పైనే

కొన్ని రోజుల తర్వాత రోజూ కాలేజీకి నా బైక్ పైనే రావడం మొదలుపెట్టింది. మొదట నా బైక్ ఎక్కేందుకు తను ఒప్పుకునేది కాదు. తర్వాత మెల్లిగా నా బైక్ ఎక్కడం మొదలుపెట్టింది. మొదట్లో ఒన్ సైడ్ కూర్చొనేది. తర్వాత బైక్ నేను ఎలా కూర్చొంటానో తాను అలాగే కూర్చొని నన్ను నా షోల్డర్ పట్టుకునేది.

స్నేహం హద్దులు దాటింది

స్నేహం హద్దులు దాటింది

అలా మా మధ్య స్నేహం కాస్త హద్దులు దాటింది. ఇద్దరం ఫోన్లలో అన్ని విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. తనకు ఎంత మంది ప్రపోజ్ చేశారు.. తనని ఎంత మంది రిజెక్ట్ చేశారు ఇలా అన్ని విషయాలు తను నాకు చెప్పేది. దాంతో మా మధ్య దాపరికాలకు కూడా చోటు లేకుండా పోయింది.

మాటతీరు నాకు నచ్చింది

మాటతీరు నాకు నచ్చింది

తన ఒద్దిక తనం, మాటతీరు నాకు నచ్చాయి. ఒకసారి బైక్‌మీద వెళ్తూ పడిపోయాం. నాకు కాస్త దెబ్బలు తగిలాయి. తనకు తగల్లేదు. అప్పడు వెంటనే ఆటోలో నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించింది. నన్ను ఎంతో జాగ్రత్తగా వాళ్లింటికి తీసుకెళ్లింది. అప్పుడు తను నాపై చూపిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి

ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి

ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను. చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చాటింగ్ లతో బిజీగా ఉండేవాళ్లం. మళ్లీ ఉదయాన్నే లేచి కాలేజీకి వెళ్లేవాణ్ని. తనని చూడాలని, మాట్లాడాలని తెగ ఆరాటపడేవాణ్ని.

ఆల్రెడి పెళ్లి ఫిక్స్

ఆల్రెడి పెళ్లి ఫిక్స్

బీటెక్ ఫైనలియర్లో ఒక రోజు ప్రపోజ్ చేశాను. కానీ తను చెప్పిన మాటలు నన్ను బాధించాయి. నాకు ఆల్రెడి పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయినా మిమ్మల్ని నేను ఆ ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ చూడలేదు అంది. నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది.

ప్రేమిస్తే హ్యాండ్ ఇచ్చిందే

ప్రేమిస్తే హ్యాండ్ ఇచ్చిందే

ఇక ఆ రోజు నుంచి నేను తనతో మాట్లాడడం మానేశాను. రోజూ నాలో నేను కుమిలిపోయేవాణ్ని. బాధపడేవాణ్ని. అంతగా ప్రేమిస్తే హ్యాండ్ ఇచ్చిందే అనుకునేవాణ్ని. తర్వాత తను మాట్లాడటానికి ప్రయత్నించింది.. కానీ నేను మాట్లాడలేదు. జీవితంలో మళ్లీ నీతో మాట్లాడితే చెప్పుతో కొట్టు అని చాలా కర్కశంగా మాట్లాడాను.

రమ్య మళ్లీ కనిపించింది

రమ్య మళ్లీ కనిపించింది

నేను ఎంటెక్ పూర్తి చేశాను. తను బీటెక్ అయిపోగానే పెళ్లి చేసుకుంది. మా బ్యాచ్ వాళ్లంతా పెళ్లికి వెళ్లారు. నేను వెళ్లలేదు. నేను బెంగళూరులో జాబ్ లో జాయినయ్యాను.చాలా రోజుల తర్వాత నాకు రమ్య మళ్లీ కనిపించింది.

కళ లేదు

కళ లేదు

అదే రూపం. కానీ ముఖంలో కళ లేదు. అన్నీ మరిచిపోయి.. ఎలా ఉన్నావ్ రమ్య అని పలకరించాను. తనని చూడగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. నేను తన ముఖాన్నే చూస్తూ ఉండిపోయాను.

టీ స్టాల్ లో కూర్చొని

టీ స్టాల్ లో కూర్చొని

తర్వాత ఇద్దరం ఒక టీ స్టాల్ లో కూర్చొని మాట్లాడాం. తన భర్త పెళ్లైన కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంది. తనకు ఒక బాబు ఉన్నాడని చెప్పింది. తను జాబ్ చేస్తూ ఫ్యామిలీని రన్ చేస్తున్నానంది.

నువ్వు ఒకే అంటే

నువ్వు ఒకే అంటే

మరి నీ సంగతేంటి... పెళ్లి అయ్యింది.. ఎక్కడ మీ మిసెస్ అని అంది. తన గుండెల్లో ఉన్న బాధను కొద్దిగా కూడా బయటకు కనపడకుండా నాతో మాట్లాడింది. నేనూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఒకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అన్నాను.

పిచ్చా నీకు

పిచ్చా నీకు

ఏంటి పిచ్చా నీకు.. అలా మాట్లాడుతున్నావు అంది. బంగారంలాంటి అమ్మాయి నీకు దొరుకుతుంది అంది. అయినా నేను వినలేదు. బతిమలాడాను. తన ఇంటికి వెళ్లాను. ఫోన్‌ చేశాను. వాట్సాప్ లో చాలా మెసేజ్‌లు పెట్టాను. తను ఒప్పుకోలేదు.

నా అంతరాత్మ చెబుతోంది

నా అంతరాత్మ చెబుతోంది

" నాకు ఒక బాబు ఉన్నాడు.. జనాలంతా మన గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటారో తెలుసా " అంది. నాకు అవన్నీ అనవసరం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. నా ప్రకారం నేను ఏ తప్పు చేయడం లేదని నా అంతరాత్మ చెబుతోంది అన్నాను.

రమ్యకు పెళ్లయినా

రమ్యకు పెళ్లయినా

కానీ తను ఇప్పటికీ కూడా నా జీవితం గురించే ఆలోచిస్తుంది. అందుకే తను నచ్చింది. రమ్యకు పెళ్లయినా.. బాబు ఉన్నా.. నేను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా నిర్ణయం తప్పుకాదని నేను భావిస్తున్నా. మన బాగు గురించే ఆలోచించే వారితో ఎలా అయినా జీవితాంతం బతకొచ్చు అనేది నా అభిప్రాయం.

English summary

i loved her so much but i was afraid she might say no again

i loved her so much but i was afraid she might say no again
Story first published:Monday, June 4, 2018, 10:40 [IST]
Desktop Bottom Promotion