Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆట మా మధ్య బంధాన్ని పూర్తిగా మార్చేసింది... ఎలాగా?
నా బాయ్ ఫ్రెండ్‌తో 4ఏళ్లపాటు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత అతడి అలవాట్లు, ఇష్టాయిష్టాలు నాకు బాగా తెలిసిపోయాయి. చాలా సార్లు అతడి మనసును కూడా చదివేదాన్ని. ఒకసారి ఇద్దరం సరదాగా గడుపుతున్న సమయంలో ఎందుకో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని అడిగాను. కొంతసేపు తర్జనభర్జన జరిగాక చివరికి ఒప్పుకున్నాడు. ఆ ఆట ఆడేటప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపైన నా ఆలోచనతీరు మరింత మారింది. ఆటలో అతడు చెప్పిన నిజాయతీ సమాధానాలు విన్న నేను ఆశ్చర్యపోయాను.

1 నన్నెప్పుడైనా మోసం చేశావా?
ఆటను చాలా ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టాను. ఈ 4ఏళ్లలో నన్నెప్పుడైనా మోసం చేశావా? నా కళ్లలోకి సూటిగా చూసి ఒక చిరునవ్వు నవ్వి, ఎంతో విశ్వాసంతో లేదు అని సమాధానమిచ్చాడు. ఆ జవాబు చెప్పేందుకు అతడు పెద్దగా ఆలోచించలేదు. అతడు అబద్ధమాడలేదు అని ఇట్టే కనిపెట్టేయొచ్చు.

2. నాలో బాగా నచ్చేది, నచ్చనిది?
నా బాయ్‌ఫ్రెండ్ ఓపెన్ పర్సన్ కాదు. ఇదే సరైన సమయం అనుకుని ఈ ప్రశ్న వేశాను. అనుకున్నట్టుగానే అతడు ఏం అన్నాడంటే... ఇలాంటి గేమ్స్ పెట్టి ఇలాంటి క్వశ్చన్స్ వేయడం అంటే నాకు అస్సలు నచ్చదు అన్నాడు. నేను నవ్వి తర్వాతి జవాబు కోసం వేచిచూస్తున్నాను.

3. కారణాలు వెతుక్కుంటే ప్రేమ ఎలా అవుతుందన్నాడు?
రెండో సమాధానం అలా చెప్పాడు. దీంతో అతడి మీద నాకున్న ప్రేమ మరింత పెరిగింది. నన్ను ప్రేమించడానికి సరైన కారణం లేదన్నాడు. అదే మన సంబంధాన్ని మరింత అందంగా మలిచిందని చెప్పొచ్చు. ఏదైనా కారణంతో ప్రేమిస్తే అది కొన్నేళ్ల పాటు నిలుస్తుంది. ప్రేమ శాశ్వతం అన్నాడు. దానికి నేను పడిపోయాను. అతడు చెప్పిన వివరణ ఎలా ఉందంటే.. నీ అందం చూసి ప్రేమించానుకో, 5ఏళ్ల తర్వాత నీ పైన మోహం తగ్గిపోతుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీలోని లోపాలను ప్రేమిస్తున్నా అని అర్థం. అలా చెప్పగానే నా కళ్లలో నీళ్లు ఆగలేదు. గట్టిగా కౌగిలించేసుకున్నాను.

4. ఈ సారి డేర్
అతడి మూడ్‌ను లైట్ చేసేందుకు స్ట్రిప్ టీస్ చేయమని అడిగాడు. నా కోరికను వెంటనే అంగీకరించాడు. నేను పాడే పాటకు లయబద్దంగా డ్యాన్స్ చేస్తూ స్ట్రిప్ టీస్ చేశాడు. అంటే మెల్లగా డ్యాన్స్ చేస్తూ వేసుకున్న బట్టల్లో ఒక్కొక్కటి విప్పేశాడు. ఐతే వీడియోను రికార్డు చేయను అనే ఒక్క షరతుపై దీనికి అంగీకరించాడు.

5. మప భవిష్యత్ గురించి ...
మరో సీరియస్ ప్రశ్నను సంధించాను. దీనికి సమాధానాన్ని ఎప్పుడూ దాటవేసేవాడు. ఈ సారి నా సర్‌ప్రైజ్‌కు అతడు జవాబు చెప్పాడు. మా ఇద్దరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగాలని, పెళ్లి రోజు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, పెళ్లి సిమ్లాలోని హిల్ స్టేషన్‌లో జరగాలని చెపుతున్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. అంతే కాదు పెళ్లి తర్వాత హనీమూన్‌కు యూరప్ వెళ్లేందుకు అతడు డబ్బు దాచుకుంటున్నట్టు చెప్పడంతో మా గురించి అతడు ఇంతలా ఆలోచిస్తాడా అనిపించింది.

6. బాయ్స్ గ్రూప్ చాట్ చదువుతానన్నాను...
తర్వాత డేర్.. అతడి బాయ్స్ గ్రూప్ చాట్ చదువుతాను అన్నాను. అంతకుముందు అతడు తన స్నేహితులతో చేసే డర్టీ జోక్స్, వీడియోలు చూడనిచ్చేవాడు కాదు. మొత్తానికి అంగీకరించేసరికి ఇద్దరం కలిసి చదువుకున్నాం. మనసారా నవ్వుకున్నాం.
ఈ 40 నిమిషాల పాటు ఆడిన ఆట నా జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. నాకు సరైన తోడు దొరికాడని అనిపించింది.



Click it and Unblock the Notifications