For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమించేటప్పుడు నాతో ఎంజాయ్ చేసినప్పుడు గుర్తు రానిది పెళ్లప్పుడు గుర్తొచ్చింది #mystory352

కొండారెడ్డి బురుజు ఎన్ని సార్లు ఎక్కామో తెలీదు. జగన్నాథగట్టుపై కూర్చొని ప్రకృతి అందాల్ని తను ఒడిలో అలా పడుకునిపోయేదాన్ని. ఆనంద్ థియేటర్ తో పాటు అన్ని థియేటర్స్ లో చూసిన సినిమానే ఎన్ని సార్లు చూశామో.

|

అమ్మాయిలు ప్రేమించి మోసం చేస్తారని అబ్బాయిలు అనుకుంటారు. సాధారణంగా అమ్మాయిలు ప్రేమించి వంచిస్తారని అబ్బాయిలనుకుంటారు. కానీ అబ్బాయిలు కూడా చాలా మంది దారుణంగా మోసం చేస్తారు. చిన్నచిన్న కారణాలు చెప్పి లవ్ జర్నీకి ఎండ్ కార్డ్ వేస్తారు.

వాళ్లు మాత్రం మరో అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకుని జాలీగా గడుపుతుంటారు. నా లైఫ్ లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కడున్నాడు. అతన్నే పెళ్లి చేసుకుంటానని చాలా కలలుగన్నాను. కానీ తను మాత్రం నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు.

ఏ కులం అని అడగలేదు

ఏ కులం అని అడగలేదు

ప్రేమించుకునేటప్పుడు నాది ఏ కులం అని అడగలేదు. కానీ పెళ్లి చేసుకోమంటే మాత్రం మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోరన్నాడు. మన కులాలు వేరు.. ఇంట్లో వాళ్లను ఎదురించి పెళ్లి చేసుకుంటే కనీసం నన్ను ఊర్లోకి కూడా అడుగుపెట్టనివ్వరని అమ్మాయిలా ఏడ్చాడు.

ఏడ్చే మగాడ్ని అస్సలు నమ్మకూడదు

ఏడ్చే మగాడ్ని అస్సలు నమ్మకూడదు

ఏడ్చే మగాడ్ని అస్సలు నమ్మకూడదు. కానీ నేను నమ్మాను. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను అని ఏడ్చినప్పుడు నేను నమ్మాను. చివరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారని ఏడ్చినప్పుడు నమ్మాను.

హ్యాపీగా ఉండేదాన్ని

హ్యాపీగా ఉండేదాన్ని

నా లైఫ్ లో అతని ప్రేమలో పడక ముందు వరకు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎప్పుడైతే అతని ప్రేమలో పడ్డానో నేను అతనికి అడిక్ట్ అయిపోయాను. అతను ఎలా చెబితే అలా చేసేలా మారిపోయాను. అతని కోసం చావడానికైనా సిద్ధం అనేలా తయారయ్యాను.

Most Read :నాన్న చనిపోయాక అమ్మ అతనితో కులికేది, ఎందుకలా చేశావంటే అంతా చెప్పేసింది #mystory349Most Read :నాన్న చనిపోయాక అమ్మ అతనితో కులికేది, ఎందుకలా చేశావంటే అంతా చెప్పేసింది #mystory349

అదో మైకం

అదో మైకం

ప్రేమలో పడ్డోళ్ల అంతా ఎందుకలా పిచ్చి వారిలా ప్రవర్తిస్తారో నాకు అప్పుడు తెలిసింది. అదో మైకం. ప్రేమించిన వారి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. ఎవరినైనా ఎదురించాలనిపిస్తుంది. కానీ చివరకు ప్రేమించిన వాడే హ్యాండ్ ఇస్తే ఆ ధైర్యం మొత్తం కూడా నీరుగారిపోతుంది.

చాలామంది తెలిసిన వారున్నారు

చాలామంది తెలిసిన వారున్నారు

అది 2014. అప్పుడు నేను కర్నూలులోని ఒక కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. నాది బీజెడ్సీ గ్రూప్. తనది బీఎస్సీ. తన ఫ్రెండ్స్ లో చాలా మంది నాకు తెలిసిన వారు ఉన్నారు. అలా అతనికి నేను పరిచయం అయ్యాను.

నా చూపులు మాత్రం

నా చూపులు మాత్రం

మాది మొత్తం ఒక బ్యాచ్ ఉండేది. అందరం కలిసి టీ తాగేందుకు వెళ్లేవాళ్లం. టీ స్టాల్ లో ప్రపంచంలోని ప్రతి విషయాన్ని మాట్లాడుకునేవాళ్లం. అందరూ మాటల్లో ఉంటే నా చూపులు ఒక అబ్బాయిపై ఉండేవి.

Most Read :అతను నన్ను వాడుకుని వదిలేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు చేశాడు అందుకే నమ్మాను #mystory350Most Read :అతను నన్ను వాడుకుని వదిలేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు చేశాడు అందుకే నమ్మాను #mystory350

త్వరగా అర్థం చేసుకున్నాడు

త్వరగా అర్థం చేసుకున్నాడు

మా గ్యాంగ్ లో తనే హ్యాండ్ సమ్ గా ఉంటాడు. నా చూపుల్లోని అర్థాన్ని తను త్వరగానే అర్థం చేసుకున్నాడు. ఇద్దరం మనస్సులోని మాటలను చెప్పుకున్నాం. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం.

మరో ప్రపంచం తెలీదు

మరో ప్రపంచం తెలీదు

తనతో ప్రేమలో పడ్డాక నాకు మరో ప్రపంచం అంటూ ఉండేది కాదు. ప్రతి క్షణం తన గురించే ఆలోచించేదాన్ని. రోజూ తనని చూస్తూ ఉంటే చాలు అనుకునేదాన్ని. తను నాతో పాటు జీవితాంతం ఉండాలని పరితపించేదాన్ని.

కళ్లు తెరిచి మూసేలోపు

కళ్లు తెరిచి మూసేలోపు

ఫైనలియర్ ఎలా అంత పాస్ట్ గా పూర్తయ్యిందో అస్సలు తెలియదు. కళ్లు తెరిచి మూసేలోపు ముగిసినట్లుగా డిగ్రీ పూర్తయ్యింది. రోజూ కాలేజీ అయిపోగానే తను తన బైక్ పై ఎక్కించుకుని సిటీ మొత్తం తిప్పేవాడు. చాలా ముచ్చట్లు చెప్పేవాడు.

Most Read :నా స్నేహితురాళ్లు రోజూ కుల్లుకోని చస్తారు, ఆ విషయాల్లో మరీ దారుణంగా ప్రవర్తిస్తారు #mystory348Most Read :నా స్నేహితురాళ్లు రోజూ కుల్లుకోని చస్తారు, ఆ విషయాల్లో మరీ దారుణంగా ప్రవర్తిస్తారు #mystory348

కొండారెడ్డి బురుజుపైకి..

కొండారెడ్డి బురుజుపైకి..

కొండారెడ్డి బురుజు ఎన్ని సార్లు ఎక్కామో తెలీదు. జగన్నాథగట్టుపై కూర్చొని ప్రకృతి అందాల్ని తను ఒడిలో అలా పడుకునిపోయేదాన్ని. ఆనంద్ థియేటర్ తో పాటు అన్ని థియేటర్స్ లో చూసిన సినిమానే ఎన్ని సార్లు చూశామో.

సాయంకాలం ఇసుకుతిన్నెలపై..

సాయంకాలం ఇసుకుతిన్నెలపై..

తుంగభద్ర తీరానా సాయంకాలం వేళల్లో ఇసుకతిన్నెలపై ఆడుకుంటూ గడిపేవాళ్లం. అలంపూర్ చౌరస్తా వరకు ఉండే ప్రతి డాభాలో చాయ్ ని టేస్ట్ చేసేవాళ్లం. అందుకే ఇప్పటికీ కర్నూలులోని ఏ గల్లీని నాకు తనే గుర్తొస్తాడు.

ఒప్పుకోరన్నాడు

ఒప్పుకోరన్నాడు

డిగ్రీ తర్వాత ఇద్దరం ఎంబీఏ చేశాం. ఎంబీఏలో కూడా నాతో బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనలియర్ లో మన ప్రేమ గురించి మీ ఇంట్లో వాళ్లకు చెప్పు అని పట్టుబట్టినప్పుడు నాపై రివర్స్ అయ్యాడు. మా ఇంట్లో వాళ్లకు మన ప్రేమ గురించి చెబితే వాళ్లు ఒప్పుకోరన్నాడు.

Most Read :తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు #mystory346Most Read :తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు #mystory346

ధైర్యం లేదన్నాడు

ధైర్యం లేదన్నాడు

సరే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందామంటే నాకంత ధైర్యం లేదన్నాడు. పెళ్లి చేసుకోమని ఎన్ని రోజులు అతని కాళ్లవేళ్లపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నాతో తిరిగినన్నీ రోజులు తిరిగి చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లాడు.

పెళ్లి చేసుకుందాం అంటే

పెళ్లి చేసుకుందాం అంటే

ప్రేమించేటప్పుడు నాతో తిరిగేటప్పుడు తనకు కులం, ఇంట్లోవాళ్లు, జాతకాలు ఇవన్నీ ఏవీ గుర్తురాలేదు. కానీ పెళ్లి చేసుకుందాం అనే సరికి అవన్నీ గుర్తొచ్చాయి. మనది ఒకటే కులం కాదు. జాతకాలు కలవలేదు.. మనమిద్దరం పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు పడతామంటూ అంటూ ఏవేవో కబుర్లు చెప్పి చల్లగా తప్పించుకున్నాడు.

అస్సలు ఆలోచించకుండా

అస్సలు ఆలోచించకుండా

అతన్నే సర్వంగా భావించి అతనిపైనే ఎన్నో ఆశలు పెంచుకున్న నా గురించి అస్సలు ఆలోచించకుడా అన్యాయం చేసి వెళ్లాడు. ఇలాంటి అబ్బాయిలను ఏం చెయ్యాలో మీరే చెప్పండి.

English summary

my boyfriend is unfaithful

my boyfriend is unfaithful
Desktop Bottom Promotion