For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాధతో చిరపుంజిలో చిందేశా.. క్రిష్ నువ్వే నా ప్రాణం అంటూ గట్టిగా హత్తుకుని ముద్దిచ్చింది- #mystory181

చిరపుంజిలో మేము ముందుగా మాక్టో వ్యాలీ వెళ్లాం. ఈ వ్యాలీకి వెళ్లేందుకు పచ్చని కొండల నడుమ నల్లటి తాచులా వెళ్లే సన్నటి రోడ్డుపై ప్రయాణిస్తుంటే కలిగే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం.

|

అందమైన పచ్చటి తివాచీ పరచినట్లుగా ఉండే చెట్లు.. ఆకాశంలో వెండి మబ్బులు, మధ్యమధ్యలో ఆ మబ్బుల చాటునుంచి బయటకు వచ్చే సూరీడు అబ్బా ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అక్కడ ఉంటాయి. చాలా ప్రత్యేకతలకు నెలవు చిరపుంజి. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న చిరపుంజి గురించి. అందుకే ఎప్పుడైనా నా జీవితంలో ఒక్కసారై చిరపుంజి వెళ్లాలనుకున్నాను.

అబ్బా రాధను మరిచిపోయా

అబ్బా రాధను మరిచిపోయా

మొదట నా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేశాను. అందరూ ఒకే మామ పోదాం అన్నారు. చివకు హ్యాండ్ ఇచ్చారు. ఎవరితో వెళ్దాం అని ఆలోచిస్తుంటే.. రాధ నుంచి ఫోన్ వచ్చింది. తను నా ఎంబీఏ క్లాస్ మేట్. అబ్బా రాధను మరిచిపోయాను కదా అని అనుకున్నాను.. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను. హేయ్.. రాధ వ్యాట్ హ్యాపెండ్ ఇన్నాళ్లకు ఫోన్ చేశావు అన్నాను.

చిరపుంజి వెళ్దామా

చిరపుంజి వెళ్దామా

ఏం లేదు క్రిష్ నాకు చాలా బోరుగా ఉంది. ఎటైనా వెళ్లాలనిపిస్తోంది అంది. అయితే మనం ఇద్దరం ఒక ట్రిప్ కు వెళ్దామా అన్నాను. చెప్పు.. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తానంది. రాధా చిరపుంజి వెళ్దామా అన్నాను. ఒకే అంది.

జర్నీ స్టార్ట్ చేశాం

జర్నీ స్టార్ట్ చేశాం

వెంటనే జర్నీ స్టార్ట్ చేశాం. మేఘాలయా రాష్ట్రంలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేదిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కిన సోహ్రా ఉరఫ్ చిరపుంజి అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం.

మొత్తానికి నేను, రాధా చిరపుంజికి వెళ్లాం.

ప్రకృతి అంతా తరలివచ్చి

ప్రకృతి అంతా తరలివచ్చి

ప్రకృతి అంతా తరలివచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయిందా అన్నట్లుగా అనిపించే చిరపుంజిలో ఎటు చూసినా పచ్చటి లోయలు, మధ్యలో జలపాతాలే. కొన్నిసార్లు మేఘాలతో సహజీవనం చేసే ఆ ప్రాంతాన్ని చూస్తే ఇక్కడి వారు ఎంత అదృష్టవంతులో కదా అనిపించేది.

ఈ సమయంలోనే చూడాలి

ఈ సమయంలోనే చూడాలి

ఏడాది పొడవునా చిరపుంజిలో వర్షాలు పడుతూనే ఉన్నా.. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో మాత్రం వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే చిరపుంజి అందాలను ఈ సమయంలోనే చూడాలి. సముద్ర మట్టానికి దాదాపు 1290 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో వానాకాలం మొత్తంమీదా దాదాపు పన్నెండువేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది.

మాక్టో వ్యాలీ

మాక్టో వ్యాలీ

చిరపుంజిలో మేము ముందుగా మాక్టో వ్యాలీ వెళ్లాం. ఈ వ్యాలీకి వెళ్లేందుకు పచ్చని కొండల నడుమ నల్లటి తాచులా వెళ్లే సన్నటి రోడ్డుపై ప్రయాణిస్తుంటే కలిగే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. స్వయంగా అనుభవించాల్సిందే. చిరపుంజిని అక్కడోళ్లంతా సోహ్రా అని పిలుస్తుంటారు. అంటే పండ్లు పండని ప్రాంతం అని అర్థం.

నాంగ్‌స్లావియా

నాంగ్‌స్లావియా

మాక్టో వ్యాలీ నుంచి సోహ్రా పట్టణంలోకి అడుగుపెట్టాలంటే, ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది. సోహ్రా పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండే "నాంగ్‌స్లావియా" అనే ప్రాంతంలో కాశీ లిపి పుట్టినట్లుగా చెబుతుంటారు. ఇక్కడి సూర్యోదయం పర్యాటకులకు మధురానుభూతులను కలుగజేస్తుంది.

మమ్మల్ని మేము మర్చిపోయి

మమ్మల్ని మేము మర్చిపోయి

వర్షం కురిసి చల్లగా ఉన్న వాతావరణంలో సూర్యుడి లేలేత కాంతి కిరణాలు మనసుకు చెప్పలేనంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఇక్కడ. నేను, రాధ కొండ శిఖరాల పైనుంచి లోయల్లోకి దూకుతున్న జలపాతాలను చూస్తూ మమ్మల్ని మేము మర్చిపోయి లీనమైపోయాం.

ముత్యాల్లాంటి వాన చినుకులొచ్చి

ముత్యాల్లాంటి వాన చినుకులొచ్చి

చేతికి అందే ఎత్తులో మేఘాలొచ్చి పలకరిస్తుంటే.. ఆ మరుక్షణమే ముత్యాల్లాంటి వాన చినుకులొచ్చి నన్ను, రాధను ముద్దాడుతుంటే.. అబ్బా మా ఇద్దరికీ భలే బాగా అనిపించిది. ఎప్పటి నుంచో నేను రాధ కు ప్రపోజ్ చేయాలని అనుకునేవాణ్ని.

బిగి కౌగిళ్లలో బంధించాను

బిగి కౌగిళ్లలో బంధించాను

ఆ క్షణం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాధకు ప్రపోజ్ చేశాను. తను నన్ను దగ్గరకు తీసుకుంది. నేను తనను నా బిగి కౌగిళ్లలో బంధించాను. గట్టిగా తన మెడపై ముద్దు పెట్టుకున్నా. అలా ప్రకృతి సాక్షిగా మా ప్రేమ పదిలంగా మారింది. క్రిష్ నువ్వే నా ప్రాణం అంటూ రాధ ఇచ్చిన ముద్దు నన్ను మైమరిపించింది.

నాహ్ కాలికాయ్

నాహ్ కాలికాయ్

ఇక చిరపుంజిలోని నాహ్ కాలికాయ్ అనే జలపాతం ప్రపంచంలో కెల్లా నాల్గవ ఎత్తైన జలపాతం. ఇది భలే ఉంటుంది. కమలాలు, ఫైనాపిల్ తోటలకు చిరపుంజీలో ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పండ్లు ఇక్కడ ఉన్నంత రుచిగా ఎక్కడా ఉండవు.

లైమ్‌స్టోన్ కేవ్స్

లైమ్‌స్టోన్ కేవ్స్

జలపాతాల హోరును, పర్వతశ్రేణులను, పచ్చని ప్రకృతిని తిలకిస్తూ సెల్ఫీలు దిగాం. చూసినంత సేపు చూసి అక్కడ నుంచి గుహల సందర్శనకు బయల్దేరాం. ‘లైమ్‌స్టోన్ కేవ్స్'గా పిలిచే సున్నపురాయి గుహలు చిరపుంజికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మొత్తం వందకుపైగా గుహలున్నాయి.

షిల్లాంగ్ లో జలపాతాలు

షిల్లాంగ్ లో జలపాతాలు

తర్వాత చిరపుంజికి దగ్గరలో ఉన్న షిల్లాంగ్‌ వెళ్లాం. షిల్లాంగ్ లో ఎటుచూసినా జలపాతాలు, పచ్చదనాన్ని కప్పుకున్న ఎతైన కొండశిఖరాలుంటాయి. షిల్లాంగ్ చూసేకొద్ది చూడాలనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ప్రాంతాలలో ఇది ఒకటి. షిల్లాంగ్ వెళ్లిన వారు డాన్ బాస్కో అనే ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి.

శిఖరం మీద నుంచి చూస్తే

శిఖరం మీద నుంచి చూస్తే

ఏడు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను చాటే విశేషాలన్నింటిని అక్కడ పొందుపరిచారు. ఆసియా ఖండం లోనే అతి పెద్ద సాంస్కృతిక మ్యూజియం ఇది. సముద్ర మట్టానికి 1965 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం మీద నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం ఎంతో అందంగా కనిపిస్తుంది. షిల్లాంగ్‌లో చూడదగ్గ మరో సుందర ప్రదేశం ఏనుగు జలపాతం. ఈ జలపాతానికి ఒక వైపు ఉన్నరాయి అచ్చం ఏనుగులా ఉండేదట.

ఎలిఫెంట్ హిల్స్

ఎలిఫెంట్ హిల్స్

జంతువులలో ఏనుగు ఎంత పెద్దదో జలపాతాలలో ఎలిఫెంట్ హిల్స్ అంత పెద్దవి . కొండ ఎడమభాగం ఏనుగు ఆకారంలో ఉండేదట. 1897లో భూకంపం రావడం వల్ల ఆ ఆకారం గల కొండ కొట్టుకుపోయిందట. అలాగే ఇక్క‘లేడీ హైదర్ పార్క్' తప్పక సందర్శించాల్సిన ఉద్యానవనం.

బటర్‌ఫ్లై మ్యూజియం

బటర్‌ఫ్లై మ్యూజియం

అక్కడ మరో విశేషమేమిటంటే చిన్నచిన్న జలపాతాలు అన్నీ కలసి ఒకే జలపాతంలా కనిపిస్తాయి. షిల్లాంగ్‌కి 2 కిలోమీటర్ల దూరంలో, ఎలిఫెంట్ గుహలకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో బటర్‌ఫ్లై మ్యూజియం ఉంది. షార్జా, దుబాయ్, ఒమన్, పొలస్కా, పనామా మొదలగు ప్రపంచంలో గల విభిన్న జాతుల రంగురంగుల సీతాకోక చిలుకలు ఇందులో ఉన్నాయి.

క్కసారైనా చూడాలి

క్కసారైనా చూడాలి

వాటిని చూసి నేను రాధ కూడా సీతాకోక చిలుకల్లా విహరించాం. చిరపుంజి, షిల్లాంగ్‌ జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఫ్రెండ్స్ తో లేదంటే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తే ఆ కిక్కే వేరబ్బా.

English summary

one of the best lifetime journey in shillong cherrapunjee

one of the best lifetime journey in shillong cherrapunjee
Story first published:Friday, June 1, 2018, 16:41 [IST]
Desktop Bottom Promotion