పందిరి మంచంలో నవదంపతులూ అలా పడుకుని ఉండరు జీవితాంతం బస్సులోనే ఆమెతో ఉంటే చాలనుకున్నా #mystory192

ఆమె అందం చూసి నా కనురెప్పలు కొట్టుకోవడం ఆగిపోయాయి. సన్నగా పొడుగ్గా ఉంది తను. ముట్టుకుంటే కంది పోతుందా అనేటటువంటి చర్మం.. నీలిరంగు కళ్లు, లూజ్ హెయిర్.తెలుగు ప్రేమ కథలు,రొమాంటిక్ స్టోరీలు #mystory192

ఆమె అందం చూసి నా కనురెప్పలు కొట్టుకోవడం ఆగిపోయాయి. సన్నగా పొడుగ్గా ఉంది తను. ముట్టుకుంటే కంది పోతుందా అనేటటువంటి చర్మం.. నీలిరంగు కళ్లు, లూజ్ హెయిర్.. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే తన అందాన్ని అస్సలు వర్ణించలేం.

ఇక తను డ్రెస్‌ సెన్స్ కూడా చాలా ఫ్యాషన్ బుల్ గా ఉంది. లైట్ జీన్స్, పైన తెల్లటి పలుచని టాప్ అందులో నుంచి బయటకు కనపడేలా రెండు మూడు లో దుస్తులు ధరించింది. టాప్ పై మళ్లీ ఒక జాకెట్.. జీన్స్ కలర్ బూట్లు వేసుకుంది. సన్ గ్లాసెస్ చేతిలో పట్టుకున్న ఆమె అప్పడప్పుడు వాటిని తీసి తన టాప్ పై వేలాడాదీస్తుంటూ అబ్బా చూడలేక చచ్చిపోయా.

అందమైనరాశిని దగ్గరగా చూసినందుకు

అందమైనరాశిని దగ్గరగా చూసినందుకు

ఇంతటి అందమైనరాశిని ఒక్కసారైనా దగ్గరగా చూసినందుకు నా జీవితం ధన్యమైంది అనుకున్నాను. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాను. ఆ మధ్య వరుసగా మూడు రోజులు సెలవులుండడంతో మా సొంత ఊరికి బయల్దేరాను. బస్ కోసం వెయిట్ చేస్తూ ఎంజీబీస్ లో కూర్చొన్నా. అంతే నా ఎదురుగా ఉన్న ఆమె అందాన్ని చూస్తూ నా బస్ టైమింగ్స్ మరిచిపోయాను.

అందమైన మాయలో నుంచి తేరుకుని

అందమైన మాయలో నుంచి తేరుకుని

చివరకు ఆ అందమైన మాయలో నుంచి తేరుకుని టైమ్ చూసుకున్నా. ఎదురుగానే బస్ వచ్చి ఆగింది. తను కూడా లేచి బ్యాగ్ చేతపట్టుకుంది. నేను ఎక్కాల్సిన బస్సే తను కూడా ఎక్కింది. ఎక్కడ కూర్చొంటుందో చూద్దాం అనుకుంటూ నేను బస్ ఎక్కాను. కండెక్టర్ కు నా టికెట్ రిజర్వేషన్ వివరాలు, సీటు నంబర్ చెప్పి అక్కడికెళ్లి కూర్చొన్నాను.

గుండె ఆగినంత పనైంది

గుండె ఆగినంత పనైంది

పక్కకు తిరిగి చూస్తే నా దేవత మళ్లీ కనిపించింది. అంతే, ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. నాది విండో సీటు. నా పక్కన సీటు ఆమెదే. విష్‌ చేద్దామా అని అనుకున్నాను. కానీ ఆమె పట్టించుకోలేదు.

జీవితాంతం బస్సులో తన సీట్ పక్కనే

జీవితాంతం బస్సులో తన సీట్ పక్కనే

జీవితాంతం బస్సులో తన సీట్ పక్కనే నేను ఉంటే చాలు అనుకున్నాను. తను బ్యాగ్ లో నుంచి ఇయర్ ఫోన్స్ తీసుకుని సీట్ లో సెటిల్ అయిపోయింది. మీకు ఏ అభ్యంతరం లేకపోతే విండో సీట్ ఇస్తారా అంది. అడగడమే ఆలస్యం వెంటనే ఇచ్చేశాను.

నడుం దాకా బ్లాంకెట్‌ కప్పుకుని

నడుం దాకా బ్లాంకెట్‌ కప్పుకుని

చివరికి, విండో సైడ్ మిర్రర్ క్లోజ్ చేసి, సీట్‌ బ్యాక్‌ వీలైనంత వెనక్కి వంచి, నడుం దాకా బ్లాంకెట్‌ కప్పుకుని, కళ్లమీద స్లీపింగ్‌ మాస్క్‌ పెట్టుకుని, అటు తిరిగి పడుకుంది. ఈ సృష్టిలో అందమైన అమ్మాయి కన్నా అందమైనదేమీ లేదని నా నమ్మకం.

ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ

ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ

నా పక్కనున్న ఆ అందాల సుందరి నిద్రాలోకంలో విహరిస్తోంది.మధ్యలో ఒక డాబా దగ్గర బస్ ఆగింది. తనకు భోజనం కూడా వద్దు అన్నట్లుగా నిద్రపోయింది. కంపెనీలేక ఒంటరిగా భోజనం ముగించాను. మెలకువగా ఉంటే ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ నాలో నేనే చెప్పుకున్నాను. ఆమె గాఢ నిద్రలోనే ఉంది. భోజనం తర్వాత మళ్లీ బస్ ఎక్కాను. లైట్సాఫ్‌ చేశారు.

ఆమె బంగారు రంగు చర్మం మీద

ఆమె బంగారు రంగు చర్మం మీద

ఆ చీకట్లో బస్సులో ఏదో సినిమా వేశారు. కానీ, ప్రపంచమంతా నిండిన అంధకారంలో మేమిద్దరమే ఒంటరిగా మిగిలాం. గంటల తరబడి, అంగుళం అంగుళం ఆమె గురించి ఆలోచించాను. ధ్యానించాను. చలనం లేదు కలల నీడలు కదలాడుతున్నట్లుగా నుదిటిమీద ఏర్పడిన సన్నని రేఖలు తప్ప. ప్రశాంతమైన నీటి మీద తేలియాడుతున్న మేఘాల్లా ఉన్నాయవి. మెళ్లో సన్నని గొలుసుంది కానీ, ఆమె బంగారు రంగు చర్మం మీద అది కనిపించడమే లేదు.

పక్కపక్కనే పందిరి మంచంలో

పక్కపక్కనే పందిరి మంచంలో

చెవులకు రంధ్రాలు లేవు. గోళ్లు గులాబీ రంగులో ఉన్నాయి. ఎడమ చేతికో ఉంగరముంది. ఆమెకు ఇంకా ఇరవై ఏళ్లు కూడా దాటినట్లు లేవు కనుక ఇది పెళ్లి ఉంగరం కాదు. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అయివుంటుందని సమాధానం చెప్పుకున్నాను. మధ్యలో ఎన్నో స్టాప్స్ వచ్చిపోతున్నాయి. నేను కూడా సీటు పుష్‌ చేసి వెనక్కు వాలాను. పక్కపక్కనే పందిరి మంచంలో నవ దంపతులు కూడా అంత దగ్గరగా పడుకుని ఉండరు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆమె గొంతులాగే గంభీరంగా ఉన్నాయి. చర్మం కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్లే పరిమళం విరజిమ్ముతోంది. ఇదో వింత అనుభవం.

మెలకువ వచ్చింది

మెలకువ వచ్చింది

చాలా సేపు నిద్రపోయాను. తలనొప్పి పెరిగి మెలకువ వచ్చింది. బస్ కూడా ఆగింది. బాత్‌రూంకి వెళ్లి వచ్చాను. నా పక్కనున్న సుందరాంగి తన మెడ కింద టాప్ కు మధ్యలో పెట్టిన కళ్లద్దాలు సీట్ల మధ్య పడి ఉన్నాయి. ఎవరైనా తొక్కితే విరిగిపోక తప్పదు. వెంటనే వాటిని తీసి ఆమె ఒళ్లో వేశాను.

లేస్తేనే నా యవ్వనానికి సార్థకత

లేస్తేనే నా యవ్వనానికి సార్థకత

నా సుందరికి నిద్రాభంగం చేయడం అసాధ్యం. ఆమె భుజాలు విదిలించి లేపాలనే కోరికను అతి ప్రయత్నం మీద అణచుకున్నాను. తనకు కోపమొచ్చినా సరే. ప్రయాణంలోని ఈ చివరి గంటలోనైనా ఆమె కళ్లు తెరిస్తే బాగుండును. ఆమె లేస్తే తప్ప నాకు విముక్తి దొరకదు. ఆమె లేస్తేనే నా యవ్వనానికి సార్థకత.

గులాబీ తోటలో పడుకుని లేచినట్టు

గులాబీ తోటలో పడుకుని లేచినట్టు

ఇక చివరి స్టాప్ రాగానే ఆమె తనకుతానే దిగ్గున లేచింది. గులాబీ తోటలో పడుకుని లేచినట్టు ఇనుమడించిన అందంతో ఫ్రెష్‌గా కనిపించింది. అప్పుడు తెలిసింది. రాత్రంతా పక్కపక్కనే పడుకున్న దంపతులు తెల్లవారి గుడ్‌మార్నింగ్‌ చెప్పుకున్నట్లుగా, పక్క సీట్లలో ఉన్న బస్ ప్రయాణికులు ఏ అభివాదమూ చేసుకోరని. నాకేసైనా చూడలేదామె. స్లీపింగ్‌ మాస్క్‌ తొలగించగానే ఆమె కళ్లు మిలమిలా మెరిశాయి.

జుత్తు వదులు చేసుకోగానే

జుత్తు వదులు చేసుకోగానే

సీటు ముందుకు లాక్కుంది. బ్లాంకెట్‌ తొలగించింది. జుత్తు వదులు చేసుకోగానే మళ్లీ భుజాల మీదకి జారింది. కాస్మెటిక్స్‌ బాక్స్‌ ఒళ్లో పెట్టుకుని అవసరం లేని మేకప్‌ చేసుకుంది. బస్ లాస్ట్ స్టాప్ లో ఆగగానే ఒక్కసారంటే ఒక్కసారైనా నా వైపు చూడలేదు. మళ్లీ తన జాకెట్‌ వేసుకుని, నా కాళ్లు తొక్కుకుంటూ మొక్కుబడిగా ఇంగ్లిష్ లో సారీ అంటూ ముందుకెళ్లింది.

థ్యాంక్స్‌ కూడా చెప్పలేదు

థ్యాంక్స్‌ కూడా చెప్పలేదు

ఆమె సుఖ ప్రయాణానికి, సుఖనిద్రకు నేను చేసిన సహాయానికి థ్యాంక్స్‌ కూడా చెప్పలేదు. గుడ్‌బై కూడా చెప్పలేదు. అంతే మరి కాసేపటికి విజయవాడ అనే జనారణ్యంలో అదృశ్యమైపోయింది. మళ్లీ ఆ దేవత కనపడలేదు. జీవితాంతం అదే బస్సులో తన పక్క సీటులోనే నేను కూర్చొనే అవకాశం వచ్చి ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది.

Desktop Bottom Promotion