For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీపై ప్రేమను పెంచే మూడు మార్గాలు

మీపై ప్రేమను పెంచే మూడు మార్గాలు

By Sateesh Devalla
|

స్త్రీ,పురుషుల మధ్య అనుబంధాన్ని పెంచేది ఏదో తెలుసా..? ప్రేమ. అవును, భార్యాభర్తలు కావచ్చు, సహజీవనం చేస్తున్న వారు కావచ్చు లేదంటే ప్రేమికులు కావచ్చు, వారి మధ్య బంధం చిరకాలం నిలిచి ఉండాలంటే కావల్సింది ప్రేమ తప్ప మరేదీ కాదు. మీ బంధానికి బీటలు వారుతున్నట్లు మీకు అనిపిస్తే, దాన్ని నిలుపుకోవడం ఎలా అని చాలామంది హైరానా పడుతుంటారు. దీనికోసం పెద్దపెద్ద పనులేమీ చేయక్కర్లేదు, ప్రేమతో కూడిన చిన్నపాటి పనులే మీ బంధాన్ని మళ్లీ పటిష్టం చేస్తాయన్న సంగతిని మీరు తెలుసుకోవాలి.

ఓ జంటకు తమ లోకమంతా ప్రేమే నిండి ఉంటుంది. మీరు చూపించే చిన్న చిన్న ప్రేమ సంకేతాలే, మీ భాగస్వామిపై మీకున్న అభిప్రాయాలను, ప్రేమను తెలియజేస్తుంటాయి. అంతేకాదు, వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. ప్రేమను వ్యక్తం చేసే ఈ చిన్న సంకేతమే మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను చాటి చెబుతుంది. మీ భాగస్వామిలో ఏదైనా అనుమానం లేదా అభద్రతాభావం ఉండి ఉంటే దాన్ని ఈ ప్రేమ సంకేతమే పటాపంచలు చేసేస్తుంది.

WHY SMALL GESTURES OF LOVE CAN SAVE A RELATIONSHIP?

ప్రేమతో కూడిన చిరు కార్యాలు మీకు, మీ భాగస్వామి మధ్య ఉన్న ప్రేమపై విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రేమను వదులుకోవడం, ఓ బంధాన్ని తెంపుకోవడం చాలా చిన్నపనే కానీ, బంధాన్ని కొనసాగించడం, ఆ బంధాన్ని నిలుపుకోవడం మాత్రం చాలా కష్టమైన పని. ఆ బంధం పటిష్టంగా ఉండాలంటే భాగస్వాములిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉండాలి.

ఈ ప్రేమను వ్యక్తం చేసే సంకేతాలేంటి?

మీరు లేదా మీ భాగస్వామి గానీ ప్రేమను వ్యక్తం చేస్తూ చేసే ఏ పనైనా ఈ ప్రేమ సంకేతం కిందకే వస్తుంది. ఉదాహరణకు, మీకు మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ రాసే లేఖలు, మీ భాగస్వామి మదిలో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. మీరు మీ భాగస్వామికి ఇష్టమైన వంటకాన్ని వండడం లేదా తనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లి కొద్ది సేపు గడపడం లాంటివీ ప్రేమను వ్యక్తం చేసే సంకేతాలే.

ప్రేమ సంకేతాలు ఎల్లప్పుడూ మీ భాగస్వామికి మీ ప్రేమను గుర్తు చేస్తాయి. ఇవి వారిలో మీపై ఆరాధానను మళ్లీ పెంచుతాయి. కలిసి పని చేయడం మరియు పంచుకోవడంలో ఉండే ఆనందమే ఈ ప్రేమ సంకేతాల గొప్పదనం. దీని కోసం మీరు పడే శ్రమకు తగ్గ ఫలితం దక్కడమే కాదు, మీ బంధానికి బీటలు వారకుండానూ చేస్తుంది. ఈ ప్రేమ సంకేతాలు మాటల ద్వారా గానీ, శారీరకంగా గానీ లేదా సందేశాల రూపంలో గానీ ఉండొచ్చు. ఈ సంకేతాలు మిమ్మల్ని ప్రేమించేలా చేయడంతో పాటు, మరో హృదయాన్ని మీకు దగ్గర చేస్తాయి అంతేకాదు మీరెప్పుడూ నవ్వుతూ ఉండేలా చేస్తాయి.

WHY SMALL GESTURES OF LOVE CAN SAVE A RELATIONSHIP?

ఈ చిన్న ప్రేమ సంకేతాలు బంధాన్ని ఎలా కాపాడగలుగుతాయి?

1. అవి ప్రేమకు సాక్ష్యాలు

మీరు మీ భాగస్వామిపై వ్యక్తం చేసే ప్రేమ సంకేతాలు వాటి పట్ల మీకున్న ప్రేమను చాటి చెబుతాయి. ఓ బంధంలో ఓ వ్యక్తి ఉండాలంటే వారికి తన భాగస్వామికి తన పట్ల ప్రేమ ఉందనిపించాలి. ఒక వేళ ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లైతే, ప్రేమను వ్యక్తం చేసే చిన్నపాటి సంకేతాలే, మీ బంధాన్ని రక్షించుకోవడానికి మేలైన మార్గాలు.

WHY SMALL GESTURES OF LOVE CAN SAVE A RELATIONSHIP?

2. మీరు ఆ వ్యక్తిని విశ్వసించడం మొదలుపెడతారు

మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తూ ఉండి, మీ మధ్య బంధం తెగిపోయే పరిస్థితుల్లోనూ దాన్ని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లైతే, మీరు ఆ వ్యక్తిని విశ్వసించడం మొదలుపెడతారు. ఈ చిన్నపాటి ప్రేమ సంకేతమే భాగస్వామిలో మళ్లీ నమ్మకాన్ని పెంచి ఆ బంధం తెగిపోకుండా కాపాడగలుగుతుంది. ప్రతీ మనిషీ తమను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు, దాన్ని మీరు ఇచ్చినప్పుడు మీరు వారి విశ్వాసాన్ని ప్రతిఫలంగా పొందగలుగుతారు.

WHY SMALL GESTURES OF LOVE CAN SAVE A RELATIONSHIP?

3. ఆందోళనను దూరం చేయడంలో దోహదపడతాయి

మీ భాగస్వామి ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటే, మీరు వీలైనన్ని ఎక్కువ ప్రేమ సంకేతాలను వ్యక్తం చేస్తే వారు మీకు మరింత దగ్గరవుతారు. దీనికి కారణం ఏమింటంటే ఆందోళనలో ఉన్న వ్యక్తి, తమ మనసుల్లో ఉన్న ఆలోచనల్లోనే బంధీ అయిపోతారు, వాటిలోనే మునిగిపోయి మీ ప్రేమను గుర్తించలేకపోతారు.

అభద్రత, అపనమ్మకం కూడా మనస్సులోకి దూరి భాగస్వామిని ప్రేమించకుండా చేస్తాయి. చిన్నపాటి ప్రేమ సంకేతాలు అతడు/ఆమెలో ఉన్న ఈ ఆందోళనను తొలగించి మీపై మళ్లీ ప్రేమ చిగురించేలా చేస్తాయి.

ఆందోళనతో బాధపడుతున్న భాగస్వామికి మరింత ప్రేమ అవసరం. మీరు మీ భాగస్వామి మరింత సౌకర్యంగా ఉండేందుకు మీ ప్రేమను అందించాల్సి ఉంటుంది. ఆందోళనతో ఉన్న మీ భాగస్వామికి మీరు మీ ప్రేమను వ్యక్తం చేసే సంకేతాలు లేఖలు, సందేశాలు, గతంలో మీరిద్దరూ సంతోషంగా దిగిన ఫోటోలతో కూడిన ఫ్రేమ్స్‌, వారిని బయటకు తీసుకెళ్లడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి.

ఈ మూడు కూడా ఒక బంధం తెగిపోకుండా నిలబెట్టగలగడానికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన ప్రేమ సంకేతాలు. మీ భాగస్వామి నుంచి మీరు ఆశించిన ప్రేమను పొందలేకపోతున్నట్లైతే, ఈ సంకేతాలను వ్యక్తం చేసి మళ్లీ ప్రేమను గెలుచుకోండి.

ఈ ఆర్టికల్‌ మీకు నచ్చినట్లైతే, కింద ఉన్న కామెంట్‌ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

English summary

WHY SMALL GESTURES OF LOVE CAN SAVE A RELATIONSHIP?

Small gestures of love often come with packages of reassurance for the love you and your partner share. It is easy to let go of the love and end a relationship once you and your partner are not happy anymore. But staying behind and saving the relationship is the most difficult task and in order to do it, all you got to do is provide each other with gestures of love.
Story first published:Saturday, July 14, 2018, 15:28 [IST]
Desktop Bottom Promotion