For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!

మీకు నచ్చిన రంగును బట్టి మీ పర్సనాలిటీ గురించి తెలుసుకోవచ్చట.

|

మనలో చాలా మంది కలర్ ఫుల్ లైఫ్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కలర్స్ ఉన్నాయి. అయితే ఎన్ని కలర్స్ ఉన్నప్పటికీ.. చాలా మందికి ఫేవరెట్ కలర్ అంటూ ఒకటుంటుంది.

Colour Psychology: Choose Your Favourite Colour and We Will Tell the Most Accurate Details About Your Personality

అందుకే వారు వేసుకునే దుస్తులు, కళ్లద్దాలు, బ్యాగులు, వాచ్, ఫోన్, వెహికల్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతిదీ తమకు నచ్చిన కలర్ కావాలని కోరుకుంటూ ఉంటారు.

Colour Psychology: Choose Your Favourite Colour and We Will Tell the Most Accurate Details About Your Personality

తమ ఫేవరెట్ కలర్ వస్తువు ఏదైనా కనబడితే చాలు ఎంత ధర అయినా గుడ్డిగా చెల్లించేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా కలర్ సైకాలజీ ప్రకారం.. మీ ఫేవరెట్ కలర్ ను బట్టి.. మీరెంటో సులభంగా తెలుసుకోవచ్చట. మీకు ఎలాంటి పర్సనాలిటీ ఉంటుంది.. మీరు ఎలా ప్రవర్తిస్తారనే చాలా విషయాలను సులభంగా చెప్పేయొచ్చట. అదెలాగో మీరే చూడండి...

Planets Retrograde :ఒకే రాశిలో శుక్రుడు, గురుడి సంచారం... ఈ రాశుల వారు జర భద్రం...!Planets Retrograde :ఒకే రాశిలో శుక్రుడు, గురుడి సంచారం... ఈ రాశుల వారు జర భద్రం...!

బ్లాక్ కలర్..

బ్లాక్ కలర్..

మనలో చాలా మందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఉండదు. హిందూ సంప్రదాయం ప్రకారం నలుపు రంగు శని గ్రహంగా పరిగణిస్తారు. అందుకే నలుపును చీకటితో లేదా చెడు ఫలితాలు, అశుభంతో పోలుస్తుంటారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. అది కేవలం వారి నమ్మకం మాత్రమే అంటున్నారు కొందరు. ఎందుకంటే ఇదే బ్లాక్ కలర్ ని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రస్ వేసుకోవడం.. అదే కలర్ కాంబినేషన్ వెహికల్ నడపడంతో పాటు ప్రతి పనిలోనూ బ్లాక్ కలర్ ఉండేలా చూసుకుంటారట. అయితే కలర్ సైకాలజీ ప్రకారం, బ్లాక్ కలర్ వాడే వారు ఎక్కువగా నిరాశలో ఉంటారట. అయితే ఇది అందరికీ కాదు.. కేవలం కొందరికేనట. కొందరికి బ్లాక్ కలర్ వల్ల బలం పెరుగుతుందట. ఈ రంగు వారికి అందాన్ని మరింత మెరుగుపరుస్తుందట. అంతేకాదు వీరిలో ఆ కార్యంపై ఎక్కువ ఆసక్తి ఉంటుందట. బ్లాక్ కలర్ వ్యక్తి యొక్క స్వతంత్ర స్వభావాన్ని తెలియజేయడానికి వినియోగిస్తారట.

వైట్ కలర్..

వైట్ కలర్..

సాధారణంగా వైట్ కలర్ ను శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే వైట్ కలర్ ను దైవత్వానికి, పుట్టుకకు, అమాయకత్వానికి ప్రతీకగా కూడా పరిగణిస్తారట. వైట్ కలర్ ఫేవరెట్ గా ఉండే వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారట. కానీ వీరు ప్రతి విషయాన్ని చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఏ నిర్ణయం తీసుకునేముందైనా తొందరపడకుండా, అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుని అడుగు ముందుకేస్తారట. అంతేకాదు వీరు చాలా డిసిప్లేన్ గా ఉంటారట.

బ్లూ కలర్..

బ్లూ కలర్..

ఈ కలర్ ను ఇష్టపడే వారు ఎల్లప్పుడూ ప్రశాంతతను కోరుకుంటారట. అందుకే బ్లూ కలర్ ఫేవరెట్ గా ఉండేవారు చాలా ప్రశాంతంగా ఉంటారట.

బ్రౌన్ కలర్..

బ్రౌన్ కలర్..

బ్రౌన్ కలర్ ను ఎక్కువగా ఇష్టపడే వారు ఏ విషయంలో చాలా నిలకడగా ఉంటారట. ఈ కలర్ మట్టి, సేంద్రీయాల గురించి సూచిస్తుందట. దీన్ని నేచర్ కు మరో ప్రత్యామ్నాయంగా భావిస్తారట.

ఆరెంజ్ కలర్..

ఆరెంజ్ కలర్..

ఈ కలర్ ను ఇష్టపడే వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారట. వీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారట. అంతేకాకుండా వీరు చాలా నిబద్ధతతో ఉండటానికి ప్రయత్నిస్తారట.

<strong>కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!</strong></p><p>కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!

గ్రీన్ కలర్..

గ్రీన్ కలర్..

ఈ రంగు నేచర్ కు ప్రతీక. గ్రీన్ కలర్ ఫేవరెట్ గా ఉండే వారిలో అసూయ, దురాశ అనేవి ఏ కోశాన కనబడవట. వీరు అందరితో చాలా సులభంగా కలిసిపోతారట.

పర్పుల్ కలర్..

పర్పుల్ కలర్..

ఈ కలర్ ని ఇష్టపడే వారు తక్కువ మంది ఉంటారట. అయితే ఈ కలర్ ని పూర్వకాలంలో రాజులు ఎక్కువగా ఇష్టపడేవారట. ఈ రంగు రాజరికానికి చిహ్నంగా భావించేవారట. అందరిలో తాము ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వారు ఈ కలర్ ని ఎక్కువగా ఇష్టపడతారట.

రెడ్ కలర్..

రెడ్ కలర్..

ఈ కలర్ ని ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉంటారట. అయితే ఈ కలర్ ను కొందరు ప్రతికూలంగా భావిస్తారట. దీన్ని హింసకు సంకేంతంగా చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. కలర్ సైకాలజీ ప్రకారం.. రెడ్ కలర్ ఫేవరెట్ గా ఉండే వారికి ప్రేమ, కోరికలు ఎక్కువగా ఉంటాయట. వీరు ఎక్కువ కాలం ప్రేమలో ఉంటారట. అంతేకాదు వీరు చాలా సందర్భాల్లో డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటారట. ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటారట. ఇది కోపానికి కూడా సంకేతం.

పురుషులకు ఈ లక్షణాలు ఉంటే, వారు తమ వివాహ జీవితంలో నరకాన్ని అనుభవిస్తున్నారని అర్థం ...!పురుషులకు ఈ లక్షణాలు ఉంటే, వారు తమ వివాహ జీవితంలో నరకాన్ని అనుభవిస్తున్నారని అర్థం ...!

పింక్ కలర్..

పింక్ కలర్..

ఈ కలర్ ని ఇష్టపడేవారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదట. ఈ రంగును ఇష్టపడే వారిలో అబ్బాయిలు కూడా ఉంటారట. కలర్ సైకాలజీ ప్రకారం.. ఈ రంగు ఆరోగ్యానికి ప్రతీక. ఈ రంగును ఇష్టపడే వారు చాలా రొమాంటిక్ గా ఉంటారట.

ఎల్లో కలర్..

ఎల్లో కలర్..

ఈ కలర్ ఫేవరెట్ గా ఉండేవారు ఎక్కువగా ఎల్లో కలర్ డ్రస్సులను వేసుకోవడానికి ఇష్టపడతారట. ఎందుకంటే ఇది నాలెడ్జ్ ను సూచిస్తుందని నమ్ముతారట. అందుకే హిందువులు శుభకార్యాలలో పసుపు రంగు ధరించాలని ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ రంగు ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. అంతేకాదు ఎల్లో కలర్ ఫేవరెట్ గా ఉండేవారు చాలా యాక్టివ్ గా ఉంటారు.

English summary

Colour Psychology: Choose Your Favourite Colour and We Will Tell the Most Accurate Details About Your Personality

Here we are talking about the colour psychology: Choose your favourite colour and we will tell the most accurate details about your personality. Have a look
Story first published:Monday, July 19, 2021, 16:08 [IST]
Desktop Bottom Promotion