Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘నా ప్రేయసికి ప్రేమ విషయం చెప్పేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను‘
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాక్స్ వెల్ తన ప్రేమ విషయం తన ప్రేయసికి చెప్పేందుకు చాలా భయపడ్డాడట.
ప్రేమ అంటేనే వయసులో ఉండే ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని పులకింత మొదలవుతుంది. అయితే సినీ, స్పోర్ట్స్ స్టార్లలో చాలా మంది తమ ప్రేమను చాలా సులభంగా గెలుచుకుంటారు. ఎందుకంటే వారికి ఒకసారి స్టార్ డమ్ వచ్చిన తర్వాత వారు ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన పెడితే వెంటనే ఒకే సమాధానం వినిపిస్తుంది.

అయితే నేటి యువతకు ప్రేమ విషయంలో వాట్సాప్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ప్రేమ ప్రతిపాదనల విషయంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనం ఇటీవలే ఫేస్ బుక్ ప్రేమ మరియు టిక్ టాక్ పెళ్లిళ్లను కూడా గురించి విని ఉంటాం లేదా కనీసం చూసి ఉంటాం. అయితే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఇప్పటి ఆధునిక యుగంలో కూడా తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అని ఆలోచిస్తూ తెగ కంగారు పడేవాడంట.
అయితే నేటి యువతకు ప్రేమ విషయంలో వాట్సాప్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ప్రేమ ప్రతిపాదనల విషయంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనం ఇటీవలే ఫేస్ బుక్ ప్రేమ మరియు టిక్ టాక్ పెళ్లిళ్లను కూడా గురించి విని ఉంటాం లేదా కనీసం చూసి ఉంటాం. అయితే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఇప్పటి ఆధునిక యుగంలో కూడా తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అని ఆలోచిస్తూ తెగ కంగారు పడేవాడంట.

తన స్నేహితురాలైన వినీకి తన ప్రేమను ఎలా చెప్పాలా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడంట. అయితే తన ప్రేమ విషయం చెప్పేందుకు మాక్స్ వెల్ నాలుగు ప్లానులు వేసుకున్నాడట. అందులో చివరి ప్లాన్ లో సక్సెస్ సాధించానని తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఇప్పటితరం వారు..
ప్రస్తుత తరం వారిలో చాలా మంది తమకు నచ్చిన అమ్మాయి కనిపించగానే.. వారి వెంట పడి మరీ తమ మనసులోని మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు తమ ప్రియుడు/ప్రేయసికి తమ మనసులో ఉన్న ప్రేమ విషయం గురించి చెప్పకుండా తమ మనసులోనే దాచి పెట్టుకుంటున్నారు.

ప్రపోజ్ చేస్తే..
అయితే కొందరు మాత్రం తాము తమ స్నేహితులకు ప్రేమ ప్రతిపాదన పెట్టినప్పుడు వారు ఎక్కడ నో అంటారో అని, అంతేకాదు దాని వల్ల తమ ఫ్రెండ్ షిప్ ఎక్కడ కట్ అవుతుందో అని, ,చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు.

మాక్స్ వెల్ కు కూడా..
మైదానంలో బంతిని అవలీలగా స్టాండ్స్ లోకి పంపే మాక్స్ వెల్ కి కూడా తన ప్రేమ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైందట. తన స్నేహితురాలు తనకు నో చెబితే తాను ఏ మాత్రం తట్టుకోలేనని మనసులో తెగ కంగారు పడేవాడట. తన ప్రియురాలికి తన ప్రేమ విషయాన్ని ఎలా వ్యక్తపరచాలని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడట.

తాజాగా సోషల్ మీడియాలో..
అయితే తన ప్రేమ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మనం ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంత సులభం కాదన్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురయ్యానో అంత కంటే ఎక్కువగా తన ప్రేయసి వినీకి ప్రేమ ప్రపోజల్ చేసేటప్పుడు కంగారు పడ్డాడట. ఓ సమయంలో తను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే వరల్డ్ కప్ ఫైనల్ ఆడటమే సులభమని అనిపించిందట.

ఎంతో మంచి స్నేహం..
ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. నేను గతంలో మానసిక ఒత్తిడిలో ఉన్న సమయంలో వినీ తనకు ఎంతగానో అండగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. నేను నా కంటే తనకే బాగా తెలుసని, అందుకనే వినీని తన భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నట్లు చెప్పాడు.

నాలుగు ప్లానులు
అయితే తన స్నేహితురాలైన వినీకి తన ప్రేమ విషయం చెప్పేందుకు నాలుగు ప్లానులు వేసుకున్నాడట. కానీ మూడుసార్లు తన ప్రేమను వ్యక్తపరచడంలో విఫలమయ్యాడట.

మొదటి ప్లానులో..
మొదటి ప్లానులో భాగంగా తనను ఓ పార్కుతు తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాడట. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్దవాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు మొరగడం వంటివి తనను ఇబ్బందికి గురి చేశాయట. దీంతో అక్కడ తన ప్లానును మార్చుకున్నాడట.

రెండో ప్లానులో..
తొలి ప్లాను విఫలమవ్వడంతో రెండో ప్లానులో తన ప్రేయసిని లంచ్ కు తీసుకెళ్లి అప్పటికే తాను వెంట తెచ్చుకున్న రింగ్ ను తన చేతికి తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నాడట. కానీ అక్కడ తన టీమ్ ప్లేయర్స్ ను చూసి అక్కడ వెనుకడగు వేశాడట.

మూడో ప్లానులో..
మూడోసారి రెడ్ కలర్ రోజెస్ మధ్య ఆమెను తీసుకెళ్లి తన ప్రేమ విషయం చెబుదామని అనుకున్నాడట. ఆరోజు మళ్లీ ఆమెను పార్కుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అది కూడా కుదరలేదట.

చివరగా..
ఇక నాలుగోసారి ధైర్యం చేసి మళ్లీ తన ప్రేయసిని పార్కుకు రమ్మని చెప్పాడట. ఆమె వచ్చిన వెంటనే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమె వేలికి తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడట. అయితే ఆ సమయంలో తన గుండె వందరెట్లు వేగంగా కొట్టుకుందట. తన చేతులు కూడా వణికిపోయాయట. అయితే తను ఓకే చెప్పడంతో తన ఊపిరి తిరిగొచ్చిన పని అయిందట. ఆ మధుర క్షణాలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తన ప్రపోజ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అయితే గతనెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
All Images Credit to : Image Curtosy



Click it and Unblock the Notifications