Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ లైఫ్ పార్ట్‌నర్ చీటికి మాటికి గొడవ పడుతున్నారా? అయితే ఇలా కూల్ చేయండి
దంపతుల మధ్య అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ఎక్కడ గొడవ మొదలుపెడుతున్నారు. కలహాలకు మూలం ఎక్కడుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరికితే ఆ గొడవలకు పరిష్కారం దొరుకుతుంది.
సంబంధంలో గొడవలు కామన్‌గా జరిగేవే. సాధారణమే కదా అని రోజూ గొడవలు జరిగితే ఇక ప్రశాంతత ఎలా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి దంపతులు పొట్లాటకు దిగుతుంటే ఇక సాన్నిహిత్యం ఎక్కడి నుండి వస్తుంది. దాంపత్య బంధంలో ఉన్న మాధుర్యం ఎలా తెలుస్తుంది. మీ భార్య లేదా భర్త చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టుకుంటుంటే ఎదుటివారి సహనం నశిస్తుంది. కాలక్రమేణా ఈ గొడవలు మీ బంధం యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. మరి ఈ గొడవలను ఆపడం ఎలా?

దంపతుల మధ్య అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ఎక్కడ గొడవ మొదలుపెడుతున్నారు. కలహాలకు మూలం ఎక్కడుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరికితే ఆ గొడవలకు పరిష్కారం దొరుకుతుంది.
అసలు దంపతుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి.. మీ పార్ట్‌నర్ తరచూ ఎందుకు గొడవ పెడుతుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కనెక్షన్ కోసం గొడవ పడటం
బంధంలో ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. వారికి ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. మీ ప్రయారిటీ తామే కావాలని మీ పార్ట్‌నర్ కోరుకుంటారు. అలాంటి సమయంలో వారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నొచ్చుకుంటారు. ఇలా ఒకటి రెండు సార్లు జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ పదే పదే ఇదే రిపీట్ అవుతుంటే మాత్రం గొడవలు మొదలవుతాయి.
భాగస్వాములు ఇద్దరూ ఒకరికొకరు ప్రాధాన్యం ఇచ్చుకోవడం తెలిసి ఉండాలి. వారు ఏదైనా అడుగుతున్నప్పుడు మీరు ఫోన్ చూస్తూ ఉన్నారనుకోండి, లేదా ఏదైనా సీరియస్ విషయం మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా సమాధానం ఇచ్చారనుకోండి గొడవలు మొదలవుతాయి.
మీ పార్ట్‌నర్‌కు మీరెంతో ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కానీ అది వారికి తెలిసేలా చేయాల్సిందే.

2. స్థాయి తక్కువ అనుకోవచ్చు
సన్నిహితంగా ఉండటం ఇష్టం లేక కూడా గొడవలు పడుతుంటారు కొందరు వ్యక్తులు. భాగస్వామితో ఉండాల్సిన సన్నిహిత సంబంధం వారికి నచ్చకపోవడం వల్ల కూడా ఘర్షణ పడుతుంటారు.
ఎంతకాలం ఉంటుందో తెలియని బంధంలో సన్నిహితంగా ఉండటం వారికి ఇష్టంలేక ఇలా తరచూ గొడవ పడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తనకు ఎదుటివారు ఎలా చూసినా సరిపోరన్న ఫీలింగ్ ఉండే వారు ఇలా తరచూ గొడవ పడుతుంటారు.

3. వారిదే పైచేయి ఉండాలని కోరుకోవడం
కొందరు మంచిని చూసి తట్టుకోలేరు. ప్రశాంత వాతావరణంలో ఇమడలేరు. వారికి గొడవలు, కలహాలు, మోసాలు ఉండాల్సిందే. అందుకే ఏ చిన్న విషయాన్ని అయినా వారు పెద్ద గొడవలా చేస్తుంటారు.
ఇది వారి మానసిక ప్రవర్తన వల్ల వస్తుంది. ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం చూసినా అందులో వారు తప్పులు వెతుకుతారు. ఇలాంటి వారితో సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తామదే పైచేయి ఉండాలని కోరుకుంటారు.

4. పెరిగిన తీరు వల్ల సమస్యలు
ఇంటి వాతావరణం పిల్లలపై, కుటుంబసభ్యులపై ఎక్కువగా ఉంటుంది. కొందరు వ్యక్తులు పెరిగిన వాతావరణంలో ఎప్పుడూ గొడవలు జరిగి ఉండొచ్చు.
అరుస్తూ, గొడవ పడుతూనే కమ్యూనికేట్ చేయాలని వారు చిన్నతనం నుండి నేర్చుకుని ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే చేస్తుంటారు.

5. కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడం అలవాటుగా మారడం
గొడవలు, కలహాలు, ఘర్షణ పెట్టుకుని పెట్టుకుని అది అలవాటుగా మారుతుంది. ఇలాంటి వారికి ప్రశాంతంగా ఉండటం నచ్చదు. చిన్న చిన్న కారణాలకు కూడా గొడవలు పెట్టుకుంటారు. ఏ కారణం లేకపోయినా కలహానికి దిగుతారు.



Click it and Unblock the Notifications