For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Father’s Day 2020 : నాన్నపై తమ ప్రేమను ఎలా వ్యక్తం చేశారో చూడండి...

|

నాన్న అంటే ఒక నమ్మకం..

నాన్న అంటే ఒక ధైర్యం..

నాన్న అంటే అభయం..

నాన్న అంటే మమకారం..

నాన్న అంటే కొంచెం కోపం..

మొత్తానికి నాన్న అంటే విడదీయలేని బంధం..

మనకు జన్మనివ్వకపోయినా.. మనం పుట్టినప్పటి నుండి తన భుజాలపై జీవితాంతం మోసేవాడే నాన్న. మనకు ఏ కష్టం రాకుండా.. మనం ఎప్పటికీ హాయిగా, ఆనందంగా జీవించాలని కోరుకునే వాడు నాన్న.. మనం ఏడిస్తే తన కంట్లో నీళ్లు వస్తుంటాయి. కానీ అవి మనకు కనబడవు.

మీరు మీ తండ్రిపై ప్రేమ, ఆప్యాయత చూపకపోయినా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనడు. మీకు ఈ ప్రపంచమే వ్యతిరేకంగా మారినా.. తను మాత్రం ఆ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే మీకు అండగా నిలుస్తాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లలందరికీ తమ తండ్రే సూపర్ హీరో.. మొదటి హీరో కూడా. జూన్ 21వ తేదీ ఫాదర్స్ డే సందర్భంగా తమ జీవితంలో తండ్రి ఎంత ప్రత్యేకమో..నాన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఫాదర్ తో తమకు ఉన్న భావోద్వేగాలను బోల్డ్ స్కై ద్వారా వ్యక్తులు షేర్ చేసుకున్నారు.

Fathers' Day 2020 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

నాన్నే నా రోల్ మోడల్..

నాన్నే నా రోల్ మోడల్..

కన్నూర్ (కేరళ)కులోని తాలిపరంబాకు చెందిన సాండ్రా అజిత్, తన జీవితంలో తన తండ్రి ఎంత ముఖ్యమో చెప్పారు. ‘నా జీవితంలో తల్లి మరియు తండ్రికి ఇద్దరికి సమానమైన స్థానాన్ని ఇస్తాను. అయితే ఫాదర్స్ డే వచ్చేటప్పటికీ మాత్రం నాన్నకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నేను నాన్నతో పంచుకున్న ప్రత్యేకమైన సందర్భాలు, అద్భుతమైన సమయాలను గుర్తు చేసుకుంటాను.

నేను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా కిందపడి మోకాలు గీసుకుపోయింది. దీని కారణంగా నాకు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు మా నాన్న నేను కోలుకునే వరకు, నా బాధను తగ్గించడానికి నా పక్కనే ఉండేవాడు. నేను బాగా నిద్రపోతున్నాను అని కన్ఫార్మ్ చేసుకున్నాకే, అతను నిద్రపోయేవాడు.

ఇప్పుడు కూడా, నాకు నిద్ర పోవడంలో ఇబ్బంది ఉంటే, అతడు మేల్కొని ఉండటాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నాపై తను చూపే ప్రేమ మరియు సంరక్షణ నాకు ఎన్నో విషయాలను నేర్పింది. అందుకే నా రోల్ మోడల్, నా సూపర్ హీరో ఎప్పటికీ నాన్నే అవుతారు. నేను ఎప్పుడూ ఆయన గర్వించదగ్గ నాన్న అవుతారు' అని చెప్పింది.

సమస్యలను ఎలా ఎదుర్కోవాలో...

సమస్యలను ఎలా ఎదుర్కోవాలో...

తమిళనాడుకు చెందిన సౌబర్ని హాటి ఇలా అంటోంది. తన తండ్రే తనకు తొలి గురువు అని, అలాగే మంచి ప్రోత్సాహకుడు కూడా. ‘ప్రియమైన అప్పా జీవితంలో మీకు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, మీరు నమ్మకంతో వాటిని ఎదుర్కొనే తీరు నాకు బాగా నచ్చింది. అలాంటి వాటిని ఎలా అధిగమించాలో నేను నీ ద్వారా తెలుసుకున్నాను. మీరు నా జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. నేను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలని, నేను జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నారు. చివరికి నన్ను నేను ఎలా ప్రేమించాలో కూడా నాకు నేర్పించారు. అందుకే నేను నీకు ఇలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అప్పా' అని ఆమె అన్నారు.

నాన్నపై ఎప్పటికీ ప్రేమ తగ్గదు..

నాన్నపై ఎప్పటికీ ప్రేమ తగ్గదు..

కేరళ రాష్ట్రం కన్నూర్ తాలిపరంబాకు ప్రాంతానికి చెందిన సర్గా అజిత్ ఫాదర్స్ డే గురించి ఇలా అన్నారు. ‘‘మా నాన్న ఉదయాన్నే నాకు నిద్ర లేపితేనే, నాకు అప్పుడు అందమైన ఉదయం అనేది మొదలవుతుంది. అంతేకాదు ఆరోజంతా నాకు చాలా ప్రకాశవంతంగా మరియు చాలా రిలాక్స్ గా ఉంటుంది. అలాగే తను పని నుండి తిరిగొచ్చినప్పుడు నేను, నా సోదరి తను ఎంత కష్టపడి ఉంటాడో ఊహించుకుంటాం. అయితే మా తండ్రి మా కోసం ఎండ, వాన, గాలి అవేవీ లెక్కచేయకుండా మా కోసం ఎల్లప్పుడూ ఏదో ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొస్తాడు. అంతేకాదు మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అందుకే మాతో నాన్న ఉంటే మాకు వెయ్యేనుగుల బలం ఉన్నట్టు ఉంటుంది. నేను బతికున్నంత వరకు నాన్నపై ప్రేమ ఎప్పటికీ ఉంటుంది'' అని అంటోంది సర్గా.

Father's Day 2020 : ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

ఆల్ టైమ్ ఫేవరేట్..

ఆల్ టైమ్ ఫేవరేట్..

కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతానికి చెందిన వివేక్ వినోద్ తన తండ్రి గురించి ఇలా చెబుతున్నాడు. ‘‘నా తండ్రి తన జీవితంలో చిన్న చిన్న విషయాలకే ఆనందపడతాడు. అంతేకాదు తన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. అయితే డబ్బు అవసరం ఉంటుంది. కానీ అనవసరంగా డబ్బులను ఖర్చు చేయొద్దని చెబుతుంటాడు. అందుకే తనంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్.

మా నాన్న నాకు సమాజంలో ఎలా బతకాలో నెర్పించారు. నలుగురిలో ఎలా నడుచుకోవాలో చూపించారు. అతనికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అని వివేక్ వివరించాడు.

నీవు చూపిన ప్రేమకు..

నీవు చూపిన ప్రేమకు..

కన్నూరుకు చెందిన శిల్ప శివదాస్ తన తండ్రితో కలిసి గడిపిన మధురమైన క్షణాలను, కొన్ని విలువైన జ్ణాపకాలను పంచుకున్నారు.

‘‘తండ్రిగా ఉండటం చాలా కష్టం. ఆ స్థానంలో ఉండే ప్రతి ఒక్కరికీ పూర్తిగా బాధ్యత మరియు చాలా ఓపిక అనేది అవసరం. కానీ నా తండ్రి తన వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఉత్తమ ఫలితాన్ని ఇస్తారు. అందుకే నేను చాలా సరదాగా పెరిగాను. నాన్ను నీకు గుర్తుందా? నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను ఓడించావు. అప్పుడు నేను బాగా ఏడిచాను. అంతేకాదు అరుస్తూ పారిపోయాను కూడా. హా హా''

అలాగే నా ఫీలింగ్స్ రాయడంలో నేను గొప్పదాన్ని ఏమి కాదు. కానీ నేను ఏమి చేయాలనుకుంటున్నానంటే, నీవు నాపై చూపిన ప్రేమకు, నాకు నేర్పిన పాఠాలకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను. నేను నీలో భాగమే అని గుర్తించడం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే మీరంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తి. నేను అందుకే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను.

ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు...

English summary

Father’s Day 2020: Real-Life People Share The Importance Of Fathers In Their Lives

Father’s Day is an annual observance to express our gratitude for our fathers. Every year it is observed on the third Sunday in the month of June. Today we are here with some real-life stories of people and the bond they share with their fathers.
Story first published: Saturday, June 20, 2020, 9:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more