Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Love Horoscope:ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుదట...!
2022లో ఫిబ్రవరి నెలలో 12 రాశిచక్రాల వారికి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
February 2022 Monthly Love Horoscope: ఫిబ్రవరి మాసం అనగానే ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా.. హుషారుగా ఉంటారు. వాలెంటైన్స్ డే కంటే ముందే వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఏడు రోజుల్లో ఏడు రకాలుగా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటారు.

అయితే ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ పండగలాగే ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నెలలో చాలా మంది తమ మనసులోని వ్యక్తికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ ప్రేమ జీవితం హ్యాపీగా గడవాలని కోరుకుంటూ ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే చంద్రుని అనుగ్రహం ఉంటుందో వారి ప్రేమ జీవితం సంతోషంగా.. సాఫీగా పోతుందట. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో ప్రేమ జీవితంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వ్యక్తితో ఎంతో సంతోషంగా గడుపుతారు. అదే వివాహం చేసుకున్న వారి జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ పార్ట్నర్ మీ పనిలో మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది.

వృషభరాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లయిన వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమకు సంబంధించిన విషయాలతో పాటు వివాహ జీవితం గురించి కూడా చర్చ జరగొచ్చు. మీ రిలేషన్ షిప్ లో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితానికి ఈ నెల ఎంతో మంచిగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ భాగస్వామితో మీకు కలహాలు పెరిగే అవకాశం ఉంది.. అయితే మీరు మీ ప్రియురాలు లేదా ప్రియుడితో మాట్లాడేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం ఆనందంగా గడిపేందుకు అవకాశం దక్కొచ్చు. పెళ్లైన వారికి ఈ సమయం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ చెడు అలవాట్లను వదిలేయమని అడగొచ్చు.

కన్య రాశి..
ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో తమ పార్ట్నర్ తో కలిసి చాలా రొమాంటిక్ గా గడుపుతారు. మీరు కొత్తగా ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేస్తే.. మీకు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీకిష్టమైన వారితో కలిసి ఎక్కడికైనా హాయిగా బయటికెళ్లొచ్చు.

తుల రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మీ పార్ట్నర్ ద్వారా కొన్ని మంచి లాభాలను పొందొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీరు ఇప్పటికే ఎవరితో అయినా ప్రేమలో ఉంటే, మీ వైవాహిక జీవితంలో లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎవరికైనా ఈ కాలంలో ప్రేమ ప్రతిపాదనలు పంపితే మీకు సానుకూల సమాధానం వస్తుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ జీవితంలో మంచిగా ఉండదు. మీకిష్టమైన వ్యక్తులతో గొడవలు పెరగొచ్చు. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా దూరంగా ఉన్న జంటలు దగ్గరయ్యే అవకాశం ఉంది.

మకర రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వ్యక్తులకు గిఫ్టులిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మీ పార్ట్నర్ తో సాన్నిహిత్యంగా ఉంటే రిలేషన్ షిప్ మెరుగుపడుతుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ప్రేమ విషయంలో చాలా లక్కీగా ఉంటుందట. మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. మీ వివాహ జీవితంలో శుభ ఫలితాలు రావొచ్చు. మీ పార్ట్నర్ సహాయంతో మీరు కొన్ని విషయాల్లో లాభం పొందుతారు.

మీన రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రేమ విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీకు మీ పార్ట్నర్ నుండి ఫుల్ సపోర్ట్ వస్తుంది. మీ వివాహ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు.



Click it and Unblock the Notifications