For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Friendship Day 2020:టాలీవుడ్ లో మంచి మిత్రులెవరో తెలుసా...

|

ఈ విశ్వంలో విలువైనది.. బలమైనది.. అద్భుతమైనది ఏదైనా ఉందంటే అది స్నేహం. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనం బంధువులు, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లడం కన్నా మంచి స్నేహితుని దగ్గరికెళితే కచ్చితంగా సహాయం లభిస్తుందని చెబుతారు స్నేహితులు. అందుకే స్నేహానికన్నా మిన్న ఏదీ లేదని చెప్పాడో సినీ కవి. కష్టమైనా.. నష్టమైనా.. ఆనందమైనా.. సంతోషమైనా.. ఎప్పుడైనా.. మన వెంటే మన నీడలా.. మన్న వెన్నంటే ఉండేవాడే నిజమైన స్నేహితులు.

వీటన్నింటిని సంగతి పక్కనబెడితే స్నేహం అంటే సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఒక్కటే. మన టాలీవుడ్ హీరోలు ఎప్పటి నుండో మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారిలో కొందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.

ప్రతి ఏటా ఆగస్టు తొలి ఆదివారం నాడు జరుపుకునే స్నేహితుల దినోత్సవం నాడు వారు కచ్చితంగా కలిసి.. ఫ్రెండ్ షిప్ డే ని జరుపుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది ప్రముఖులకు ఉత్తమ స్నేహితులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ స్నేహితులను టచ్ చేసే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ షేర్ చేసుకోండి...

చిరు-నాగ్..

చిరు-నాగ్..

ఈ విశ్వంలో స్నేహానికి మించిన లోకం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అలా టాలీవుడ్ ప్రముఖులలో ఉత్తమ స్నేహితుల గురించి చర్చ మొదలైతే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి-అక్కినేని నాగార్జునలే.. వీరిద్దరూ ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. కానీ వీరిద్దరూ ఎప్పుడైనా సరే కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటారు. అంతేకాదు వీరిద్దరూ ఒకటే నెలలో జన్మించడం విశేషం. వీరి పుట్టినరోజుకు కూడా కేవలం ఒక వారం మాత్రమే గ్యాప్.

పవన్ కళ్యాణ్ - ఆలీ..

పవన్ కళ్యాణ్ - ఆలీ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కమిడియన్ ఆలీ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ సినిమాల్లో అడుగు పెట్టిన నాటి నుండి ఆలీతో వ్యక్తిగతంగా మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మాయమవుతాయని ఆశిద్దాం.

RRR ఫ్రెండ్స్...

RRR ఫ్రెండ్స్...

Ram-Ram Charan-Rajamouli(RRR) ఈ ముగ్గురి గురించి పరిచయం పెద్దగా అవసరం లేదు. అయితే వీరు కేవలం సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులే. అందుకే వీరంతా కలిసి వారి పేర్లు కలిసేలా సినిమాలో కూడా నటించారు. పలు సందర్భాల్లో వీరి మధ్య స్నేహ సంబంధాల గురించి స్వయంగా వారే చెప్పారు.

Friendship Day 2020: స్నేహితుడికి సలాం చెప్పే టైమొచ్చింది...!

డార్లింగ్ ప్రభాస్-గోపిచంద్..

డార్లింగ్ ప్రభాస్-గోపిచంద్..

డార్లింగ్ ప్రభాస్ టాలీవుడ్ లో చాలా మంది స్నేహితులు ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో గోపిచంద్ తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరూ మాత్రం సినిమాలో హిరో-విలన్ పాత్రలను పోషించారు.

త్రివిక్రమ్-సునీల్..

త్రివిక్రమ్-సునీల్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, కమిడియన్ కమ్ హీరో సునీల్ పశ్చిమ గోదావరి నుండి హైదరాబాద్ వరకు కొనసాగించిన ప్రస్థానాన్ని.. సినిమాల్లోకి రాక ముందు వారు పడ్డ కష్టాలను చాలా కామెడీగా చెబుతుంటారు. వీరిద్దరూ తామిద్దరూ ఒకే రూమ్ లో కలిసి చేసిన చిలిపి పనులను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడమే కాదు.. అందరితోనూ షేర్ చేసుకుంటారు.

రానా - రామ్ చరణ్..

రానా - రామ్ చరణ్..

బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానా.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ చిన్న నాటి నుండే మంచి స్నేహితులుగా ఉండేవారు. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక కూడా అదే రిలేషన్ కొనసాగిస్తున్నారు.

నాని-నరేష్..

నాని-నరేష్..

న్యాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే అల్లరి నరేష్ - నాని వ్యక్తిగతంగా మంచి రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తారు.

మహేష్ - సుమంత్..

మహేష్ - సుమంత్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సినిమాల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ తెలియని ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది సుమంత్. మహేష్ -సుమంత్ మధ్య స్నేహ బంధం చాలా గట్టిగా ఉంది.

రాజీవ్ - ఎన్టీఆర్..

రాజీవ్ - ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కు రాజమౌళి, రామ్ చరణ్ మాత్రమే కాదు రాజీవ్ కనకాల కూడా మంచి ఆప్తమిత్రుడే. ఎన్టీఆర్ ఎలక్షన్ల సమయంలో ప్రమాదానికి గురై కష్టాల్లో ఉన్నప్పుడు రాజీవ్ తనకు అండగా ఉన్నాడు.

English summary

Friendship Day 2020: Actors Who Are Dearest Friends In Tollywood

Here we talking about freindship day 2020:actors who are dearest friends in tollywood. Read on.
Story first published: Saturday, August 1, 2020, 16:21 [IST]