For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Love: మీది నిజమైన ప్రేమనో.. కాదో.. ఎలా తెలుసుకోవాలంటే..

ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన లవ్వేనా తెలుసుకోవడం ఎలా. మీది అసలు నిజమైన ప్రేమేనా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

|

Love: మనిషి భావోద్వేగ జీవి. ప్రేమ కోసం తల్లడిల్లుతాడు. ప్రేమించాలని, ప్రేమించబడాలని కోరుకుంటాడు. కొంత మంది అమ్మాయిని లేదా అబ్బాయిని చూడగానే ప్రేమలో పడిపోతారు. సినిమాల్లో చూస్తుంటాం కదా.. అలాంటి లవ్ అన్నమాట. ఎలాగోలా అమ్మాయిలు అయితే అబ్బాయిని, అబ్బాయిలు అయితే అమ్మాయిని ప్రేమలోకి లాగుతారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటారు. కొన్ని రోజులు అయ్యాక అసలు సినిమా మొదలు అవుతుంది. ఒకరంటే ఒకరికి బోర్ కొడుతుంది. ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా అబ్బా.. ఇప్పుడు రిప్లై ఇవ్వాలా, ఇప్పుడు మాట్లాడాలా అని అనుకుంటారు.

How to identify whether your love is true or not

అలాంటి సమయంలో ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన లవ్వేనా అనే అనుమానం వస్తుంది. మరి నిజమైన ప్రేమను తెలుసుకోవడం ఎలా. అయితే ఇది పూర్తిగా చదవండి. మీది అసలు నిజమైన ప్రేమేనా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. మీ సంబంధం సురక్షితమేనా?

1. మీ సంబంధం సురక్షితమేనా?

మీరు మీ భాగస్వామి లేదా లవర్ తో ఉన్నప్పుడు సురక్షితమైన సంబంధంలో ఉన్నాం అనే ఫీలింగ్ మీలో ఉందా.. హాయిగా, ప్రశాంతంగా, సెఫ్టీగా అనిపిస్తుందా.. లేదంటే భయం, ఆందోళన, గాబర, ఒత్తిడి ఎదుర్కొంటున్నారా.. వీటికి సరైన సమాధానం మీ దగ్గర ఉంటే మీ సంబంధం సురక్షితమైనదో కాదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే తెలుసుకోవచ్చు. ఎవరితో ఉన్నప్పుడు మీరు చాలా ప్రశాంతంగా, కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారో.. ఆ బంధం ఎల్లకాలం అలాగే ఉంటుందని మీకు అనిపిస్తుందో అదే నిజమైన బంధం.

2. సంబంధం పరిపూర్ణంగా అనిపిస్తుందా?

2. సంబంధం పరిపూర్ణంగా అనిపిస్తుందా?

బంధంలో ఇద్దరు ఒకే ఇష్టాయిష్టాలు, లక్ష్యాలు, అభిప్రాయాలు కలిసి ఉండాలి. సంబంధంలో ఒకరికొకకరు లేకుండా జీవించడం సాధ్యం కాదు. జీవిత సాఫల్యాన్ని భాగస్వామి నుండి అనుభవించడం చాలా ముఖ్యం.

3. మీకు నిజంగా జీవిత భాగస్వామి అవసరమా?

3. మీకు నిజంగా జీవిత భాగస్వామి అవసరమా?

ఎంచుకున్న భాగస్వామి గురించి పదే పదే సందేహాలు తలెత్తుతాయి. ఈ సంబంధంలో నిజంగా కొనసాగాలా.. అలాంటి అవసరం ఉందా.. అనే ప్రశ్నలు మీకు వస్తుంటే అది కచ్చితంగా మంచి సంకేతం కాదని గుర్తించాలి.

4. మీ సంబంధం అర్థవంతంగా ఉందా?

4. మీ సంబంధం అర్థవంతంగా ఉందా?

సంబంధంలోకి అడుగు పెట్టిన తర్వాత దానిని ముందుకు తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదట్లో ఎలా ఉన్నారో.. కొన్ని రోజులు గడిచాకా కూడా అలాగే ఉంటే ఆ సంబంధానికి అర్థం ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ సంబంధానికి అర్థం ఉంటుంది. ప్రేమ జీవితానికి లక్ష్యాన్ని ఇస్తుందని గుర్తుంచుకోవాలి. అలాంటి బలమైన కారణం కనిపించకపోతే, అలాంటి ప్రేమ కూడా బలంగా లేదని గ్రహించాలి.

5. మీ సంబంధం అనుకూలంగానే ఉందా?

5. మీ సంబంధం అనుకూలంగానే ఉందా?

సంబంధంలో భాగస్వాముల మధ్య పరస్పర అంగీకారం లేకపోతే తరచూ గొడవలు, వివాదాలు జరుగుతుంటాయి. తీపిగా ఉండాల్సిన బంధం కాస్త చేదుగా మారుతుంది. ఒకరికొకరు అనుకూలత, సామరస్యం, ప్రతిస్పందించే లక్షణాలు లేకపోతే అలాంటి ప్రేమలో అర్థం లేదు.

6. గర్వం మరియు అసూయ

6. గర్వం మరియు అసూయ

మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్థిస్తారన్నది నిజమైన ప్రేమను తెలుపుతుంది. మీరు ఇతరులతో పరిహాసము చేయునప్పుడు లేదా మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నప్పడు లేదా ఆపోజిట్ జెండ్ విషయాలను మాట్లాడుతున్నప్పుడు అతను కనుక అసూయ పడకుంటే మీరు అదృష్టవంతులే. అతనితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం వల్ల గర్వపడుతున్నట్లు తెలిస్తే అది ఒక నిజమైన ప్రేమకు సంకేతమనే చెప్పవచ్చు.

7. నేను - మనం

7. నేను - మనం

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నేను అనేపద వాడుకంటూ ఉండదు . ప్రతి ఒక్కటీ ఇద్దరితో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్క నిర్ణయం ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు చేయగలిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా నేను అనే పదానికి దూరంగా ఉన్నట్లే. మనం అనే సంకేతంలో మీరు ఉన్నట్లైతే మీరు మంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లే...

8. ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకూడదు

8. ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకూడదు

చాలా మంది వారు ఇచ్చిన మాటను గురించి బాధపడరు. అసలు గుర్తే ఉండదు. మాట ఇచ్చే స్తారు, తర్వాత వాటిని చాలా సులభంగా మర్చి పోతుంటారు.ఇద్దరిలో ఏఒక్కరు ప్రామిస్ చేసినా అది నిలబెట్టుకొనే విధంగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నట్లైతే మీరు నిజమైన ప్రేమలో ఉన్నట్లే . ప్రామిస్ తీర్చగలిగినట్లైతే హ్యాపిలైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఈ ఒక్క నమ్మకం మీద ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. అందుకే మాటను నిలబెట్టుకోవడం చాలా కీలకం.

English summary

How to identify whether your love is true or not

read on to know How to identify whether your love is true or not
Desktop Bottom Promotion