For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Independence Day 2020 : పంద్రాగస్టున ఫ్యామిలీతో సరదాగా ఈ పనులు చేయండి...

కరోనా కాలంలో స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలను కుటుంబంతో కలిసి ఎలా జరుపుకోవాలో తెలుసుకుందామా

|

మన దేశానికి స్వాతంత్య్రం కోసం సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించిన రోజునే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆంగ్లేయుల సామ్రాజ్యవాద సంకెళ్లు తెంచుకుని భరత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.

Independence Day : Activities for the Family during Covid-19

అయితే ఈ పంద్రాగస్టు(ఆగస్టు 15వ తేదీ)న ప్రతి ఏటా జరుపుకునే ఘనమైన వేడుకల్లా ఈ సారి జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే బడి, గుడి, కార్యాలయం నుండి చాలా వరకు మూతబడ్డాయి.

Independence Day : Activities for the Family during Covid-19

ఒకవేళ తెరిచినా కూడా అది తాత్కాలికంగా. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే మీరు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవచ్చు.

Independence Day : Activities for the Family during Covid-19

మన దేశంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అయిన ఆగస్టు 15న, త్రివర్ణ పతాకం రంగులో ఉండే బట్టలను వేసుకోండి. ఆ రోజంతా సరదాగా గడపండి. పంద్రాగస్టు రోజున మీరు, మీ కుటుంబసభ్యులు, పిల్లలతో పాటు ఏయే పనులు చేయాలో మేము ఒక జాబితా తయారు చేశాం.

Independence Day : Activities for the Family during Covid-19

అందులో మీరు చేయాల్సిన కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరాలున్నాయి. అందులో మీకు నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి...

Independence Day 2020 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...Independence Day 2020 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...

పిల్లలకు నేర్పించండి..

పిల్లలకు నేర్పించండి..

స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా మీ ఇంట్లోని చిన్నారులు మన భారతీయ జాతీయ పతాకాన్ని తయారు చేయడాన్ని నేర్పించండి. వారికి ఒక తెల్లని చార్ట్ ఇచ్చి అందులో ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లూ కలర్లు, మాత్రమే ఇవ్వండి. మూడు రంగుల జెండా మధ్యలో నీలి రంగులో అశోక చక్రాన్ని వేయించండి.

ప్రత్యేక కార్యక్రమాలను చూడటం..

ప్రత్యేక కార్యక్రమాలను చూడటం..

ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనల కారణంగా బయటకు వెళ్లడం కొంచెం రిస్కుతో కూడుకున్న పని కాబట్టి. మీరు ఈ పంద్రాగస్టున కుటుంబ సభ్యులతో కలిసి మీ టివిలో వచ్చే ప్రత్యేక కార్యక్రమాలు, కొత్త సినిమాలను చూస్తూ మీ కుటుంబంతో ఆనందంగా గడిపేయండి.

సైనికుల కవాతాను చూడండి..

సైనికుల కవాతాను చూడండి..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన దేశ రాజధాని ఢిల్లీలో, జమ్మూ, కాశ్మీర్ లో సైనికులు చేసే కవాతును చూపించండి. మన సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారి గురించి పిల్లలకు తెలియజేయండి. వారికి దేశభక్తి అంటే ముఖ్యమో వివరించండి. దీని వల్ల మీకు మీ పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.

Independence Day 2020: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోండి...Independence Day 2020: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోండి...

ప్రత్యేక వంటలు..

ప్రత్యేక వంటలు..

ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీ ఇంట్లో ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేయండి. ముఖ్యంగా ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేయండి. అలాగే, మీ భాగస్వామికి వంట చేయడంలో సహాయం చేయండి. మీకు వీలైతే జాతీయ జెండా ఉండే ఒక కేకును కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తే.. అద్భుతంగా ఉండొచ్చు.

ఆన్ లైనులో..

ఆన్ లైనులో..

ఇంతకుముందు భారతదేశ సమరయోధుల గౌరవార్థం మీ కుటుంబాన్ని బయటకు తీసుకెళ్లి నగరంలో ఉన్న అన్ని మ్యూజియంలను సందర్శించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, మీరు ఆన్ లైనులో మీకు నచ్చిన వాటిని చూసేయండి.. మీ కుటుంబసభ్యులకు కూడా వాటిని చూపండి. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతమంది అమరులయ్యారో.. ఎంత కష్టపడ్డారో.. ఎన్ని త్యాగాలు చేశారో అనే వివరాలు తెలియజేయండి..

దేశభక్తి పాటలు..

దేశభక్తి పాటలు..

ఈ పంద్రాగస్టున మీరు మీ కుటుంబ సభ్యులతో దేశ భక్తి పాటలను పాడండి.. మీ సంగీత ప్రియులైతే మీరే ఒక ట్యూన్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి పాడండి.

మన జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది ఎవరో తెలుసా...మన జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది ఎవరో తెలుసా...

టపాసుల మోత..

టపాసుల మోత..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీరు మీ కుటుంబంతో కలిసి, మరియు స్నేహితులతో కలిసి టపాసులను కాల్చి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవచ్చు. మీ కుటుంబంతో కలిసి మీ ఇంటి మేడపై అందరూ ఒక చోట చేరి జాతీయ జెండా ఎగురవేయండి. జాతీయ గీతం పాడి, ఆ తర్వాత టపాసులను కాల్చండి.

కొన్ని పోటీలు..

కొన్ని పోటీలు..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీ కుటుంబంలో ఉండే పిల్లలకు కొన్ని ప్రత్యేక పోటీలను నిర్వహించండి. వస్త్రధారణ పోటీలు, గెస్సింగ్ గేమ్, ఇతర ప్లే గేమ్స్ వంటి పోటీలను నిర్వహించండి. ‘ఉత్తమ వస్త్రాలంకరణ స్వాతంత్య్ర సమరయోధుడు' కోసం పోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులు అందజేయండి.

English summary

Independence Day : Activities for the Family during Covid-19

How many of you are looking at a quiet and simple Independence Day this year? This Independence Day, here are some of the activities for family bonding. Take a look at some of these activities we have lined up for you.
Desktop Bottom Promotion