Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశుల వారికి ప్రేమలో అంత ఈజీ కాదు... మీ రాశి కూడా ఉందేమో చూడండి...
ఈ రాశుల వారు ప్రేమలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ప్రేమ అనేది యవ్వనంలో ఉన్న వారికి ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమలో ఉన్న వారి మనసు ఎప్పటికీ గాలిలో తేలుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ అనే రెండక్షరాలకు చాలా పవర్ ఉంది.

'లవ్ అట్ ఫస్ట్ సైట్' గురించి మీరు ఇది వరకే వినే ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తిని చూసిన వెంటనే ప్రేమలో పడటం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మందికి ఒకరిని ఇష్టపడటం మరియు వెంటనే వివాహం చేసుకోవడం అనేది చాలా సులభంగా జరిగిపోతూ ఉంటుంది.

ఇదంతా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారి గ్రహాలు, నక్షత్రాలను బట్టే జరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రేమలో పడాలనే ఆలోచన కొన్ని ప్రశ్నలు మరియు సందేహాలతో మొదలవుతుంది.

అయితే చాలా మంది వ్యక్తులు ప్రేమ యొక్క అద్భుతమైన కథలను అస్సలు నమ్మరు. వారి అతివిశ్వాసం.. వారి భారీ అంచనాలు వారిని ప్రేమలో పడటానికి కష్టతరంగా మారుస్తుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ద్వాదశ రాశుల వారిలో ఏయే రాశుల వారు ప్రేమలో పడటం కష్టంగా ఉంటుంది. అసలు ప్రేమ విషయంలో ఎందుకు కఠినంగా ఉంటారు? వీరి వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి...

మేష రాశి..
ఈ రాశి చక్రానికి చెందిన వ్యక్తులు చాలా మొండి పట్టుదల గలవారు. వీరు చాలా విషయాల్లో అసూయపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి అత్యాశ ఎక్కువగానే ఉంటుంది. మేష రాశి మగవారు మరియు ఆడవారు తమ కోరికలన్నీ ఒకే సమయంలో నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు, వీరి అదుపులో ఉండే భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. వీరు విశ్వసనీయంగా ఉన్నప్పటికీ, సరసాలాడుట, వీరు నియంత్రించలేని విషయం. ఇది వారి భాగస్వాములకు అసౌకర్యంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు వారు చాలా విషయాల్లో డేరింగ్ గా ఉంటారు. వీరు ఇలాంటి వ్యక్తిత్వం వల్ల కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాగే తొందరపాటు మరియు నిశ్చయమైన ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే వీరు అత్యంత నమ్మకంగా ఉంటారు. అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే సహించలేరు. లేదా క్షమించలేరు. వీరి నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే, వాటిని ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేరు. ఇలాంటి విభిన్న కారణాల వల్ల వీరికి ప్రేమ విషయంలో కష్టంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా పూర్తి స్వేచ్ఛగా ప్రేమిస్తారు. అయితే తమ స్వేచ్ఛను పరిమితం చేయగల ఎలాంటి విషయాన్ని అయినా, పరిస్థితిని అయినా వారు ఇష్టపడరు. అదే విధంగా వీరు సులభంగా విసుగు చెందుతారు. విసుగు నుండి సంబంధాన్ని ముగించే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వీరి జీవితంలో ప్రతిసారీ ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తారు.

తుల రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా అస్పష్టంగా ఉంటారు. వీరు ప్రేమ, ఆకర్షణ అనే విషయాలు స్పష్టం కాకముందే తమ ప్రేమ విషయాలను బయట పెట్టేస్తారు.
అయితే వీరు సరైన అవగాహన లేకపోవడం కారణంగా, వీరి ప్రవర్తన ఆధారంగా చాలా మంది వీరి ప్రేమ నిజమైంది కాదని భావిస్తారు. అందుకే ప్రేమ విషయంలో చాలా కష్టంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications
