For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సమయంలో రాఖీ కట్టించుకునే వారి కోసమే ఈ బహుమతులు...

|

ఆగస్టు 3వ తేదీన రాఖీ పండుగ వచ్చేస్తోంది. అయితే ఈ పండుగ రాకముందే.. కరోనా అన్ లాక్ 3.0 కాకముందే పండగ సందడి మొదలైంది. తమ సోదరుడి కోసం స్వయంగా రాఖీలు చేసేవారు కొందరైతే..

తమ సోదరులకు నచ్చిన రాఖీలను ఎంపిక చేయడానికి షాపులన్నీ తిరిగే వారు మరికొందరు.. అయితే ఇంకా కొందరు ఆన్ లైన్ షాపింగులు, ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

తమ సోదరులకు రాఖీ కట్టేందుకు చాలా మంది ప్రత్యేకంగా పళ్లెం(థాలీ)ని సిద్ధం చేసుకుంటారు. దీని కోసం రంగులు, చమ్కీలు ఉపయోగిస్తారు. అంతేకాదు తన సోదరుడి కోసం ప్రత్యేక తీపి వంటకాలను తయారు చేస్తారు.

ఇలాంటి తతంగమంతా పండుగ రావడానికంటే ముందే జరిగిపోతాయి. పండగ రోజు ఉదయాన్నే సోదరీమణులు స్నానం చేసి.. పూజలు ముగించుకుని.. అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టడానికి ప్లేటులో కుంకుమ, అక్షింతలు, మిఠాయిలన్నీ సిద్ధం చేసుకుంటారు.

ఈ సమయంలో రాఖీ పండుగ రోజున తన చెల్లి లేదా అక్కకు నచ్చే విధంగా బహుమతి కొనడమంటే.. ఈ కరోనా సమయంలో మాటలు కాదు. వాస్తవం చెప్పాలంటే వారిని మెప్పించే బహుమతులను కొనడమంటే.. ఓ పెద్ద టాస్క్ లాంటిదే. ఏం కొనాలా అని ఆలోచిస్తూ ఉండగానే.. సమయం అలా గడిచిపోతుంది. అయితే మేం చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా మీరు వారికి నచ్చే బహుమతిని కొనొచ్చు. అవి ఏంటో ఇప్పుడే చూసేయ్యండి మరి...

Raksha Bandhan 2020 : రాఖీ పౌర్ణమి వెనుక అన్ని కథలు ఉన్నాయా?

ఇష్టపడేవి మాత్రమే..

ఇష్టపడేవి మాత్రమే..

ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపరూ తీసుకోండి.. మీ సోదరికి ఏమి ఇష్టమో.. ఏమి ఇష్టం లేదో ఒక లిస్ట్ రాసుకోండి. మీరిద్దరూ చిన్నప్పటి కలిసి పెరిగారు కాబట్టి దీనిపై మీకు కచ్చితంగా ఓ అవగాహన ఉంటుంది. దీని కోసం మీరు మరీ ఎక్కువ శోధించాల్సిన అవసరం లేదు. అలా మీరు రాసిన వాటిలో ఆమె ఎక్కువగా ఇష్టపడే వాటిలో మీకు ఏది బాగుంటుంది అనిపిస్తే.. దాన్ని బహుమతిగా ఇచ్చేయండి.

దీని ముందు అన్నీ దిగదుడుపే..

దీని ముందు అన్నీ దిగదుడుపే..

మీరు మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇచ్చినా... వారికి వ్యక్తిగతంగా నచ్చేవి ఇస్తే.. అది వారికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీ ఇద్దరి అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. మీ దగ్గర ఉన్న ఫొటో కలెక్షన్స్ లో మీ సోదరికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫొటోలతో పర్సనల్ గిఫ్ట్ ను స్వయంగా తయారు చేయండి లేదా తయారు చేయించి ఇవ్వండి.

నచ్చిన ప్రదేశానికి..

నచ్చిన ప్రదేశానికి..

ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. తాము ఎప్పటినుండో అక్కడికి వెళ్లాలని భావిస్తుంటారు. వాటి గురించి అప్పుడప్పుడు మీతో మాట్లాడతారు కూడా. అది వారి కలగా కూడా చెబుతుంటారు. కాబట్టి మీరు అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

గాజులు, కొత్త దుస్తులు..

గాజులు, కొత్త దుస్తులు..

మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తమ అక్కా లేదా చెల్లి రాఖీ కట్టగానే ఆమెకు బహుమతిగా మన సంప్రదాయం ప్రకారం సాధారణంగా గాజులు, కొత్త దుస్తులు వంటివి ఇస్తూ ఉంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా కొంచెం కొత్తగా.. ఆమె ఇష్టానికి తగినట్టు.. ఆమెనే కోరుకోమని చెబితే బాగుంటుంది. ఇంకా రాఖీ పండుగకు కొంత సమయం ఉంది కాబట్టి.. ఈ లోగా గిఫ్ట్ కొనేయ్యండి లేదా ప్రత్యేకంగా ఏదైనా జ్యువెలరీ తయారు చేయించి ఇవ్వండి.

మేకప్ బాక్స్..

మేకప్ బాక్స్..

మీ అక్కా లేదా చెల్లెలికి మేకప్ వేసుకోవడం అంటే ఇష్టంగా ఉంటే.. మీరు ఆమెకు మేకప్ బాక్స్ ను బహుమతిని ఇవ్వొచ్చు.

స్మార్ట్ వాచ్

స్మార్ట్ వాచ్

ప్రస్తుతం అంతా స్మార్ట్ ప్రపంచం కాబట్టి.. చాలా మంది స్మార్ట్ వస్తువులపై ఆధారపడుతున్నారు. మీ అక్కా లేదా చెల్లెలికి స్మార్ట్ వాచ్ ను బహుమతిగా అందించండి. ఇది తనకు కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే దీన్ని చూసిన ప్రతిసారీ ఆమెకు మీపై మరింత ప్రేమ పెరుగుతుంది.

English summary

Raksha Bandhan Gifts for Sister

Here we talking about raksha bandhan gifts for sister. Read on
Desktop Bottom Promotion