For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి’

|

భార్యభర్తల మధ్య సంబంధం పాలు నీళ్లలా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం అనేది అత్యంత అవసరం.

ఇది ఉంటేనే ఆలుమగల జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కపుల్స్ మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పాటు రొమాన్స్ కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే జంటలు కలయికలో పాల్గొంటారో అప్పుడే వారి బంధం మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఆ విషయంలో ఇరువురిలో ఏ ఒక్కరూ సహకరించకపోయినా అంతే సంగతలు.. పచ్చని సంసారంలో సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. అందుకే ఆలుమగలిద్దరూ అన్ని విషయాల్లో కోఆపరేట్ చేసుకోవాలి. విభేదాలు వచ్చినా.. అభిప్రాయ భేదాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకానీ అనునిత్యం అనుమానించడం వంటివి చేయకూడదు. ఒకవేళ పార్ట్నర్ పై అనుమానం పెరిగితే రిలేషన్ షిప్ కట్ అయ్యే ప్రమాదం ఉంది.

మరోవైపు అనుమానమే పెనుభూతంగా మారి మరొకరి వైపు చూపు పోతుంది.. అంతేకాదు వారితో మోజు పెరిగిపోయి.. డైవర్ట్ అయ్యే అవకాశమూ ఉంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ కపుల్ కు పెళ్లి తర్వాత పెద్ద సమస్య వచ్చి పడింది. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత తన భార్యకు ప్రెగ్నెన్సీ అని తేలింది. అయితే తను ఇంతవరకు కలయికలో పాల్గొనలేదు. కానీ తను గర్భవతి అయ్యింది. ఇప్పుడు తానేం చేయాలి.. వేరొక వ్యక్తి బిడ్డకు నేను తండ్రిగా మారాలా? ఇప్పుడు తానేం చేయాలి? తన భాగస్వామిని ఎలా నమ్మాలి.. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని.. తనకు సరైన పరిష్కారం చెప్పగలరని నిపుణులను సంప్రదించాడు ఓ భర్త. తన సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది.. నిపుణులు తనకు ఎలాంటి సూచనలు చేశారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సెక్స్ గురించి గూగుల్ లో ఎక్కువ మంది ఏం వెతుకుతున్నారో తెలుసా...

సాన్నిహిత్యం లేదు..

సాన్నిహిత్యం లేదు..

‘‘నా పేరు నాగరాజు(పేరు మార్చాం). నేను సాఫ్ట్ వేర్ గా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను. నాకు ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగిన నాటి నుండి నేను నా భార్యతో రొమాన్స్ లో పాల్గొనలేదు. అంతేకాదు తను నాతో సన్నిహితంగా లేదు. పెళ్లైన కొత్తలో ఇలానే ఉంటుందనుకుని సర్దుకుపోయాను.

షాకింగ్ మ్యాటర్..

షాకింగ్ మ్యాటర్..

కానీ ఇటీవలే నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. తనకు ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకెళ్తే.. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్లు చెప్పారు. అంతే ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే తనతో ఇంతవరకు ఒక్కసారి కూడా కలయికలో పాల్గొనలేదు. కాబట్టి తన కడుపులో పెరిగేది నా బిడ్డ అయ్యే ఛాన్సే లేదు.

ఇతరుల బిడ్డకు..

ఇతరుల బిడ్డకు..

ఇప్పుడు నా భార్య ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడంతో తనపై నమ్మకం పూర్తిగా పోయింది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు సరైన సలహను ఇచ్చి తగిన పరిష్కారం చూపగలరు' అని తన బాధను నిపుణుల వద్ద చెప్పుకున్నాడు. తనకు నిపుణులు ఏం సమాధానం ఏం చెప్పారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు సెక్స్ జీవితంలో హ్యాపీగా గడుపుతున్నారా లేదా?

నిజాయితీగా పోరాడండి..

నిజాయితీగా పోరాడండి..

మీ భార్య గర్భవతి కావడంలో మీ ప్రమేయం నిజంగా లేదని మీరు భావిస్తే, మీరు ఈ విషయంలో నిజాయితీగా పోరాడొచ్చు. తన కడుపులో బిడ్డకు మీరు తండ్రి కాదు కాబట్టి ఫలితం గురించి మీరు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు. మీరు మీ మనసులో ఏం అనుకుంటున్నారో ఆ విషయాలను మీ భార్యతో నిర్మోహమాటంగా చెప్పండి.

క్షమించండి..

క్షమించండి..

తను ఇతరులతో కలిసి కలయికలో పాల్గొని కడుపు తెచ్చుకుందని మీరు భావిస్తే తనను క్షమించండి. ఒకవేళ తన బిడ్డకు తండ్రిగా ఉండాలని, మిమ్మల్ని ప్రాధేయపడితే నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోండి. ఇలాంటి సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి.

మరో ఛాన్స్..

మరో ఛాన్స్..

తను ఏం చేసినా మీ పార్ట్నర్ కాబట్టి తనకు మీరు మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. ఎందుకంటే తప్పులు చేయడం మానవుని సహజ లక్షణం. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అయితే తను గతంలో ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని మిమ్మల్ని మోసం చేసిందని భావిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనను క్షమించొద్దు.

రిలేషన్ ను కట్ చేసుకోండి..

రిలేషన్ ను కట్ చేసుకోండి..

మీ భార్యతో ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా రిలేషన్ న్ కట్ చేసుకోండి. ఇలాంటి వారిని క్షమిస్తే మోసం చేయడం తనకు అలవాటుగా మారిపోతుంది. అంతేకాదు తను ఇతరుల జీవితాలను, కుటుంబాలను నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

English summary

Relationship Tips : "My Partner is Pregnant by another man's Baby"

Here we are talking about the Relationship Tips:"My partner is pregnant by another man's baby". Read on
Story first published: Wednesday, May 18, 2022, 15:48 [IST]
Desktop Bottom Promotion