Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ పార్ట్‌నర్ మీ నుండి దూరం అవుతున్నారనడానికి సంకేతాలు
సంబంధంలో ఒకరు హ్యాపీగా ఉన్నారా, లేదా అసంతృప్తితో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటి ద్వారా మీ పార్ట్‌నర్ ఏమనుకుంటున్నారో అంచనా వేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవిత భాగస్వామి మనస్సు చదవడం అంత సులభమేమీ కాదు. సంబంధంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇద్దరం సంతోషంగానే ఉన్నాం కదా అని ఒకరు అనుకుంటుంటే.. మరికొరు మాత్రం ఆ సంబంధంలో అసహనాన్ని, అసంతృప్తిని అనుభవిస్తుండొచ్చు. అలాంటి సంబంధం నుండి ఎప్పుడెప్పుడు బయట పడదామా అనే ఆలోచనల్లో కూడా ఉండొచ్చు. అయితే ఒకరు మనసులో ఏమనుకుంటున్నారో కరెక్టుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ వారు చేసే కొన్ని పనులు వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పకనే చెబుతాయి. వాటి ద్వారా భాగస్వామి మనసులో ఏమనుకుంటున్నారో అంచనా వేయొచ్చు.

సంబంధంలో ఒకరు హ్యాపీగా ఉన్నారా, లేదా అసంతృప్తితో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటి ద్వారా మీ పార్ట్‌నర్ ఏమనుకుంటున్నారో అంచనా వేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వారు మీతో శారీరకంగా సన్నిహితంగా ఉండరు
ఒకప్పుడు మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండొచ్చు. ఆ సాన్నిహత్యం క్రమంగా తగ్గిపోతే, శృంగారం పాల్గొనడం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే జరుగుతుంటే మీ పార్ట్‌నర్ దేనికో సతమతం అవుతున్నారని అనుకోవచ్చు.
శారీరకంగా సన్నిహితంగా లేకపోవడానికి ఇద్దరు భాగస్వాములూ కారణం కావొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా.. సమస్య లేనిదే దంపతుల మధ్య దూరం పెరగదు. దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. దీంతో పాటు శృంగారం మరీ ఎక్కువైనా ఏదో సమస్య ఉన్నట్లేనని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శృంగారం ద్వారా దంపతుల మధ్య చాలా సమస్యలు తీరతాయని తెలిసిందే. ఇదే మీ భాగస్వామి ఆలోచిస్తూ దాంపత్యంలో శృంగారాన్ని ఎక్కువ చేసి ఉండొచ్చు. కాబట్టి లైంగిక జీవితంలో మార్పును గమనించినట్లయితే ఆ విషయం గురించి మీ భాగస్వామితో మాట్లాడుకోవడం ఉత్తమం.

2. స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతారు
ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ స్నేహితులతో సమయాన్ని గడుపుతుంటారు. ఇందులో ఫ్రెండ్స్‌తో గడిపే సమయం ఉన్నట్టుండి పెరిగితే మాత్రం ఏదో సమస్య ఉందని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
దంపతుల్లో ఎవరైనా ఇలా భాగస్వామితో సమయం గడపకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటే వారి భాగస్వామితో దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంకేతం మీకు కనిపించగానే పార్ట్‌నర్‌తో కాసేపు సమయం గడిపి అసలు సమస్య ఏమిటో వారినే అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం ముఖ్యం.

3. భవిష్యత్ ప్రణాళికల గురించి ఏమాత్రం మాట్లాడరు
దాంపత్య బంధంలో భవిష్యత్ గురించి ప్రణాళికలు ఉంటాయి. వచ్చే నెలలో ఏమేం చేయాలి, ఎప్పుడు కారు కొనాలి, ఎప్పుడు ఇల్లు కొనాలి ఇలాంటి దంపతుల మధ్య సర్వసాధారణంగా జరుగుతాయి. అయితే సంబంధంలో అసంతృప్తితో ఉన్న పార్ట్‌నర్ ఇలాంటి ప్రణాళికలకు దూరంగా ఉంటారు.
ఎప్పుడెప్పుడు ఆ బంధం నుండి విడిపోదామా అని ఆలోచించే వ్యక్తులు భవిష్యత్ గురించి ప్రణాళికలు వేయరు. మీ భాగస్వామి కూడా రేపు ఏం చేయాలి, వచ్చే నెల, ఏడాదిలో ఏమేం చేయాలనే ప్రణాళికలకు దూరంగా ఉంటే వారు మీతో సంబంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

4. మీ సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపకపోవడం
సంబంధంలోని సమస్యలపై పని చేయడానికి ఎవరైనా ఇష్టపడకపోతే, మీరు వారితో విడిపోవడానికి ఇది ఒక సంకేతంగా చూడవచ్చు. సంబంధం అనేది రెండు వ్యక్తులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. ఒకరు సమస్యతో బాధపడుతుంటే మరొకరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇద్దరూ కలిసి ఉన్న ఆ బంధం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
ఎడ్ల బండిలోని ఒక ఎద్దు కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతుంటా మరో ఎద్దు వేగంగా పరిగెత్తలేదు. బంధం కూడా అలాంటిదే. భాగస్వామికి సాయం చేయని వ్యక్తులు ఆ బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సంకేతం.



Click it and Unblock the Notifications