For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈరోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారంటే ఆశ్చర్యమే...! వీరు అందరినీ హ్యాపీగా ఉంచుతారట...!

ఈ లక్షణాలు ఉండే వ్యక్తులు ఇతరులను సులభంగా సంతోషపరుస్తారట. అవేంటో చూసెయ్యండి.

|

మనలో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భావిస్తారు. అయితే కొందరు మాత్రమే తమతో పాటు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి.

Signs You Are A People Pleaser in Telugu

మనకు నచ్చినవి.. ఇంకొకరికి నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు. అందుకే మనుషుల మధ్య చాలా విషయాల పట్ల అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. మనస్పర్దలు పెంచుకుని దూరం అవుతూ ఉంటారు. అయితే ఎవ్వరూ కూడా తమ చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉండాలని.. చెడు వ్యక్తులు మన మధ్య ఉండాలని కోరుకోరు. కొన్నిసార్లు మాత్రం కొన్ని పరిస్థితుల కారణంగా మనం చెడు వాతావరణంలోకి వెళ్తు ఉంటాం.

Signs You Are A People Pleaser in Telugu

ఇలాంటివన్నీ జరగడానికి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే. మీరు ఔనన్నా కాదన్నా.. ఇది వాస్తవమే. వీటన్నింటిని సంగతి పక్కనబెడితే.. కొందరు వ్యక్తులకు లోతైన సమస్య నుండి ఈ అలవాట్లు పుడతాయి. ఈ కారణంగా వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు మరియు ఇతరులను సంతోషపరచేందుకు.. అందరూ సుఖంగా జీవించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లయిన వ్యక్తులనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు...పెళ్లయిన వ్యక్తులనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు...

ఎప్పటికీ విభేదించరు..

ఎప్పటికీ విభేదించరు..

తాను సంతోషంగా ఉంటూ.. ఇతరులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలనుకునే వ్యక్తి ఎప్పటికీ విభేదించరు. మీకు తనతో అభిప్రాయ భేదాలొచ్చినప్పటికీ, వారు మాత్రం మీరు చెప్పే దానితో అంగీకరిస్తూ ఉంటారు. అంతేకాదు శత్రువులు చెప్పిన విషయాలను కూడా ఏకీభవిస్తారు. ఎందుకంటే, చిన్న చిన్న విషయాలకు ఇతరులను కష్టపెట్డడం కరెక్ట్ కాదని భావిస్తారు.

పద్ధతిగా సారీ చెబుతారు..

పద్ధతిగా సారీ చెబుతారు..

మనలో చాలా మంది ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే సారీ లేదా క్షమించండి అనే మాటను చెబుతుంటారు. అయితే ఇతరులను సంతోషపెట్టాలనుకునే వారు ‘మన్నించండి' అని చాలా పద్ధతిగా చెబుతారంట. మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు తప్పు లేని సందర్భాల్లో వారు సారీ చెబితే దీన్ని చాలా అవమానంగా భావిస్తారట.

బాధ్యతగా ఉంటూ..

బాధ్యతగా ఉంటూ..

వీరు ఎక్కడ ఉన్నా.. ఎప్పుడున్నా.. ఎలాంటి సందర్భంలో అయినా.. వీరి చుట్టూ ఉండే వారి ఆనందం లేదా మానసిక స్థితి పరంగా మంచిగా అనుభూతి చెందేందుకు బాధ్యత వహిస్తారట. ఇలాంటి వ్యక్తులు ఇతరులను సంతోషపరచడంలో ఆనందాన్ని వెతుక్కుంటారట. అందుకే వీరు చాలా విషయాల్లో బాధ్యతగా ఉంటారట. కాబట్టి వీరి భావోద్వేగాలను ఎవ్వరూ నియంత్రించలేరట.

బరువు పెరిగితే.. బెడ్ రూమ్ లో భాగస్వామిని సుఖపెట్టలేమా?బరువు పెరిగితే.. బెడ్ రూమ్ లో భాగస్వామిని సుఖపెట్టలేమా?

వీరిని ఇష్టపడతారు..

వీరిని ఇష్టపడతారు..

ఇలాంటి లక్షణాలు ఉండే వ్యక్తులు తమతో పాటు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టేందుకు అన్ని బాధ్యతలను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తారు. దీని వల్ల వీరు ఒత్తిడిని మరచిపోతారట. అలా చేయడం వల్ల వీరికి ఎంతో భారం తగ్గిన అనుభూతి కలుగుతుందట.

పొగడ్తలు ఆశిస్తారు..

పొగడ్తలు ఆశిస్తారు..

వీరు ఇతరులకు నచ్చిన పనులు చేసినప్పుడు, వారిని సంతోషపెట్టినప్పుడు వారి నుండి ప్రశంసలు లేదా పొగడ్తలు కావాలని ఆశిస్తారట. ఎందుకంటే వీరు అందరినీ సంతోషపెట్టామా లేదా అనేది వారి మాటల్లోనే తెలుసుకోవాలనుకుంటారట. వీరికి ఇది అత్యంత ముఖ్యమైనది.

వివాదాలను పరిష్కరించడం..

వివాదాలను పరిష్కరించడం..

సాధారణంగా మన మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పటి నుండి మన మధ్య మాటలు తగ్గిపోతాయి. కానీ ఈ లక్షణాలు ఉండే వ్యక్తులు మాత్రం తమ చుట్టూ ఏదైనా గొడవ జరిగినా లేదా వివాదాలు జరిగినా వాటి పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తారట. ఇద్దరు వ్యక్తులను కలిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారట. ముఖ్యంగా ఇరు పక్షాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇద్దరు చెప్పే మాటలను పూర్తిగా విని.. ఒక పరిష్కారం కోసం ప్రయత్నిస్తారట.

English summary

Signs You Are A People Pleaser in Telugu

Here are the signs you are a people pleaser in Telugu. Have a look
Story first published:Saturday, October 2, 2021, 16:16 [IST]
Desktop Bottom Promotion