Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
Love Signs:మీరు ప్రేమలో పడ్డారని తెలిపే ప్రధాన సంకేతాలేంటో చూసెయ్యండి...!
నిపుణుల ప్రకారం, ఇలాంటి లక్షణాలు మీలో కనబడితే మీరు ప్రేమలో పడినట్టే. అవేంటో మీరే చూసెయ్యండి.
మనలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక బంధం అంటూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది స్నేహం, ప్రేమ, వివాహం, ఇతర బంధాలేవైనా కావొచ్చు. అయితే ఇలా ఏర్పడే బంధాల్లో ప్రేమ బంధానికి ప్రత్యేకత, ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

ఇదిలా ఉండగా.. మీ మనసుకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు మీ కళ్లలో మీకు తెలియకుండా వెయ్యి బల్బుల వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు గాల్లో తేలిపోతున్నట్టు.. మీ హార్ట్ కు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక తొలి ప్రేమ అయితే మరీ ప్రత్యేకం. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మీరిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరనే భావన కలుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మీరిద్దరే కొత్త లోకంగా మారిపోతారు. ఈ సందర్భంగా మీరు ప్రేమలో పడినట్టు తెలిపే ప్రధాన సంకేతాలేంటి? మీరు ప్రేమలో పడితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఇదంతా హార్మోన్ల వల్ల మార్పు వల్ల జరుగుతుందా? నిపుణులు ప్రేమ గురించి చెబుతున్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

లోకన్నే గెలిచనట్టు..
ప్రేమలో పడినప్పుడు ప్రేమికుల కోసం రాత్రి వేళలో ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కారణంగా వీడియో కాల్స్ మరియు వాట్సాప్ కాల్స్ ఇతరవాటిని వాడుతున్నారు. అంతటితో ఆగకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం వంటివి చేస్తూ.. ఈ లోకాన్నే గెలిచేసినంత భావన కలుగుతుంది.

అందంపై శ్రద్ధ..
మీరు ప్రేమలో పడితే.. మీకు తెలియకుండానే అప్పటిదాకా పెద్దగా పట్టించుకోని అందంపై అదే పనిగా ఫోకస్ పెడతారు. ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడటం చేస్తారు. ప్రేమలో పడిన క్షణం నుంచి హెయిర్ స్టైల్, మేకప్, డ్రస్సింగ్ స్టైల్ ఇంకా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంకేతాల వల్ల మీరు ప్రేమలో ఉన్నారని చెప్పొచ్చు.

తన గురించే కలలు..
లైఫ్ లో ఒక్కసారైనా లవ్ లో పడాలని.. తమ పార్ట్ నర్ తో ఎంజాయ్ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ కలల్ని కొందరు నిజం చేసుకుంటారు. తొలిసారిగా ప్రేమలో పడ్డవారు.. ఎంత బిజీగా ఉన్నా అన్నింటినీ పక్కనబెట్టి తమ ప్రేమ కోసం పార్ట్ నర్ కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. మీరు వారితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మీ కష్టాలు, సుఖాలను షేర్ చేసుకునేందుకు మీకో ముఖ్యమైన వ్యక్తి దొరికినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు ప్రేమలో పడినట్టే.

వినూత్న ఆలోచనలు..
సాధారణంగా ప్రేమకు వయసు లేదని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రేమలో ఉన్నవారి మనసు మాత్రం చాలా యంగ్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేమలో పడిన వ్యక్తులు ఎల్లప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారట. అంతేకాదు విభిన్నమైన పనులు చేసి తమ పార్ట్నర్ ను సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తారట. ప్రతి క్షణం కొత్తదనంగా ఫీలవుతారట.

పార్ట్నర్ కు నచ్చేలా..
మీరిద్దరూ ప్రేమ బంధంలో ఉంటే.. ఒకరి కోసం మరొకరు పుట్టారేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్నర్ కు నచ్చేలా ఉండేందుకు మిమ్మల్ని మీరు మార్చుకోవడంతో పాటు, వారిలో ఉన్న లోపాలు, బలహీనతలను సైతం అంగీకరించి ఎల్లప్పుడూ వారికి అండగా నిలిచే ప్రయత్నం చేసినా... ఇలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే.. మీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టే. అంతేకాదు ఒకరినొకరు ఎక్కువగా ఇంప్రెస్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు.

అవే ఆలోచనలు..
మీరు నిజంగా ప్రేమలో పడితే.. ఎల్లప్పుడూ మీ భాగస్వామి గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీ ప్రేమను ఆస్వాదించడమే కాక.. వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో మీ ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తమ ప్రేమ బంధానికి, తమ సంతోషానికి గుర్తుగా ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కడున్నా తమదే కొత్త లోకం అనే లక్షణాలు కనిపిస్తే మీరు నిజంగా ప్రేమలో పడినట్టే..



Click it and Unblock the Notifications