For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రత్యేకతలుంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే...!

|

అమ్మాయిలు మరియు అబ్బాయిలకు ఇద్దరి మనసుల్లోనూ చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ గురించి తమ ఫీలింగ్సును వ్యక్తపరచడంలో అమ్మాయిలు చాలా ముందు ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం తమ ఫీలింగ్స్ ను అమ్మాయిల లాగా ప్రేమ విషయంలోనే కాదు చాలా విషయాల్లో తమ ఫీలింగ్స్ ను బయటపెట్టలేరు.

అంత మాత్రాన వారు తక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం మాత్రం కాదండోయ్.. ఇలాంటి సమయాల్లోనే చాలా మంది అమ్మాయిల్లో అబ్బాయిల పట్ల అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి.

తాను ఇంతగా ప్రేమిస్తున్నా.. నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమించట్లేదు అనుకుంటూ ఉంటారు. అయితే మీ బాయ్ ఫ్రెండ్ తమ భావాలను బయట పెట్టకపోయినా సరే మీపై అపారమైన ప్రేమ ఉందని మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యమో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి...

ఎంత గొడవ పడితే.. అంత ప్రేమంట...! అప్పుడే ఆ బంధం గట్టిగా బలపడుతుందట...!

ప్రేమ విషయంలో..

ప్రేమ విషయంలో..

నిజమైన ప్రేమలో ఉన్న వారు ఎల్లప్పుడూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. అయితే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎంత ప్రేమించినప్పటికీ.. మీకు గౌరవం ఇవ్వకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూపితే, అది నిజమైన ప్రేమ కాదని మీరు గుర్తించాలి. ఎందుకంటే నిజమైన ప్రేమలో ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అంతేకాదు తను మిమ్మల్ని చూసే చూపూలో కూడా మీరంటే ప్రేమ, గౌరవం కనిపిస్తుంటాయి.

మీ రక్షణ కోసం..

మీ రక్షణ కోసం..

ప్రేమ, అనుమానం అనేవి రెండూ ఒకే దగ్గర ఎప్పటికీ ఉండలేవు. ఉండవు కూడా. మీ బాయ్ ఫ్రెండ్ కి మీపై ప్రేమ ఉంటే.. తనకి మీపై అనుమానం అనేది అస్సలు ఉండదు. అలాంటి వారు మీ అనుమతి లేనిదే మీ వస్తువులను అస్సలు చెక్ చేయరు. అంతేకాదు మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నా అర్థం చేసుకుంటారు. మీ మనసులో తనకే స్థానం ఉంటుందని వారు భావిస్తారు. అయితే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు కూడా మీ రక్షణ కోసమే మీకు ఫోన్ చేసి అడుగుతారు. అయితే అందులో అనుమానం ఏ మాత్రం కనబడదు.

ఎవరైనా మీకు సైట్ కొడితే..

ఎవరైనా మీకు సైట్ కొడితే..

ప్రేమలో అనే అసహ్యం.. అసూయ కూడా ఒక భాగమే. మిమ్మల్ని ఎవరైనా అదే పనిగా చూస్తున్నా.. మీకు సైట్ కొట్టాలని ప్రయత్నించినా.. తను కాస్త అసూయగా ఫీలవడం లేదా అసహ్యించుకోవడం వంటి వాటిని మీరు గుర్తించొచ్చు. ఈ ఫీలింగ్సు అన్నింటినీ తను బయటకు చెప్పకపోయినా ఇది కూడా ప్రేమలో ఒక భాగమే.

వాలెంటైన్స్ డే స్పెషల్ : ఈ చారిత్రక ప్రేమల గురించి ప్రతి ప్రేమికుడు తెలుసుకోవాలి...

అందరూ స్నేహితులే..

అందరూ స్నేహితులే..

మీరు స్నేహితులకు ఇచ్చే ప్రాధాన్యతను తను గుర్తిస్తాడు. అందుకే తను కూడా వారితో కలిసి పోవడానికి వీలైనంత త్వరగా ప్రయత్నిస్తాడు అంతేకాదు వారితో కలిసి బర్త్ డే పార్టీలు, ఇతర ప్రత్యేకమైన రోజులను గుర్తుంచుకుని వారిని ఆశ్చర్యపరిచేందుకు మీకు తప్పకుండా సహాయం చేస్తారు.

బాధను దూరం చేస్తాడు..

బాధను దూరం చేస్తాడు..

మీకు నెలసరి వచ్చిన సమయంలో మీరు ఎంతటి బాధను అనుభవిస్తారో అందరికీ తెలిసిందే. అయితే పీరియడ్స్ సమయంలో మీరు ఎంతో చిరాకుగా కూడా ఉంటారు. అలాంటి సమయంలో మనలాంటి వాళ్లు మంచి హగ్ ఇస్తే చాలు. ఇలాంటి వాటిని అన్నీ మరచిపోవచ్చు. అలాంటి పని చేసేందుకు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఈ సమయంలో మీకు ఇష్టమైన ఆహారం అందించేందుకు రెడీగా ఉంటాడు.

మీకు సహాయం..

మీకు సహాయం..

మీ కెరీర్ కు సంబంధించి మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. మీకు నచ్చిన రంగంలో మీరు అనుకున్నట్టు రాణించడానికి.. తన వంతు సహాయం చేస్తాడు. మీకు నచ్చనివి తనకు నచ్చకపోయినా సరే మీకు సహాయం చేస్తాడు.

ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మీ మాటను జవదాటాడు..

మీ మాటను జవదాటాడు..

సాధారణంగా అబ్బాయిలు మాట వినడంలో పెద్దగా శ్రద్ధ చూపరు.మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు తను ఫోన్ చూడడమో.. లేదా ఏదైనా గేమ్ ఆడటమో వంటివి చేస్తూ.. లేదా టివి చూడటమో చేస్తుంటే అలాంటి వారు నిజమైన ప్రేమికులు కాదని గుర్తించండి. మీ కళ్లలోకి చూస్తూ.. మీ మాటలను విని దానికి తన అభిప్రాయాన్ని చెబితే తను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నట్టే అర్థం.

మీ భవిష్యత్తు గురించి..

మీ భవిష్యత్తు గురించి..

మీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే, పెళ్లయ్యాక ఇద్దరి భవిష్యత్తు గురించి మీలాగే తను కూడా ఎన్నో ఊహించుకుంటూ ఉంటాడు. అయితే తను భవిష్యత్తులో నేను అలా ఉంటాను.. నేను అది చేస్తాను.. నేను ఇది చేస్తాను.. అనే దానికి బదులు మనం అలా చేద్దాం.. ఇలా చేద్దాం.. అని అంటే తను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నట్టే అని అర్థం.

చిన్న చిన్న గొడవలు..

చిన్న చిన్న గొడవలు..

చాలా మంది ప్రేమికులు చిన్న చిన్న గొడవలకే బ్రేకప్ చెప్పుకోవడం ప్రస్తుతం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్యన ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే.. తిరిగి తామిద్దరూ కలిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు. అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే మీ గొడవలు కొద్ది క్షణాల్లో సద్దుమణిగిపోతాయి.

‘ఐ అవ్ యు‘ చెప్పకపోయినా..

‘ఐ అవ్ యు‘ చెప్పకపోయినా..

తను మాటిమాటికీ ‘ఐ లవ్ యు‘ చెప్పకపోయినా.. మీపై ప్రేమ ఉన్నట్టే అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఒకవేళ ఐ లవ్ యు చెప్పాడంటే తనకు మీ మీద ఉన్న ప్రేమ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు.

English summary

Signs your Boy friend Really loves you

అమ్మాయిలు మరియు అబ్బాయిలకు ఇద్దరి మనసుల్లోనూ చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ గురించి తమ ఫీలింగ్సును వ్యక్తపరచడంలో అమ్మాయిలు చాలా ముందు ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం తమ ఫీలింగ్స్ ను అమ్మాయిల లాగా ప్రేమ విషయంలోనే కాదు చాలా విషయాల్లో తమ ఫీలింగ్స్ ను బయటపెట్టలేరు. అంత మాత్రాన వారు తక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం మాత్రం కాదండోయ్.. ఇలాంటి సమయాల్లోనే చాలా మంది అమ్మాయిల్లో అబ్బాయిల పట్ల అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. తాను ఇంతగా ప్రేమిస్తున్నా.. నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమించట్లేదు అనుకుంటూ ఉంటారు. అయితే మీ బాయ్ ఫ్రెండ్ తమ భావాలను బయట పెట్టకపోయినా సరే మీపై అపారమైన ప్రేమ ఉందని మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యమో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి...