Latest Updates
-
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026
కరోనా టైమ్ లోనూ ఇలా ప్రపోజ్ చేస్తే మీకు కచ్చితంగా విజయం దక్కుతుందట...!
కోవిద్-19 కారణంగా చాలా మంది జంటలు బయటకు వెళ్లలేకపోతున్నారు. అయితే తనకు కాబోయే భాగస్వామికి తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 18 లక్షల మందికి పైగా ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు లక్ష మందికి పైగా చనిపోయారు. మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ మూడో స్టేజీలోకి వచ్చిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
అందుకే భారతదేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. ఇప్పటికీ ఇంటికి పరిమితమైన వారు మరో రెండు వారాలు దీన్ని అనుభవించాల్సిందే. వీటన్నింటి సంగతి పక్కనబెడితే కోవిద్-19 కారణంగా చాలా మంది జంటలు బయటకు వెళ్లలేకపోతున్నారు. అయితే తనకు కాబోయే భాగస్వామికి తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈఫిల్ టవర్ చిత్రం..
కరోనా వైరస్ కారణంగా చాలా మంది తమ భాగస్వామితో కలిసి గడుపుదామన్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. అయితే ప్యారిస్ కు చెందిన ఓ వ్యక్తి ఈఫిల్ టవర్ మరియు ఆర్క్ డి ట్రియోంఫేలను ఇటుక గోడపై గీసిన తర్వాత, తన స్నేహితురా ఎరికా డిఫెండాల్ ను తన ఇంట్లో తయారు చేసిన సిటీ ఆఫ్ లవ్ కు తీసుకెళ్లాడు. ‘‘ప్యారిస్ లో నా జీవిత ప్రేమకు నేనే సమాధానం‘‘ అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇది అందరినీ ఆకర్షించింది.

విహారయాత్రకు వెళ్దామనుకుంటే..
ఫొటోగ్రాఫర్ మేరీబెత్ రాజోట్టే మరియు ఆమె ప్రియులు తమ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో చివరికి పార్కులో పిక్నిక్ కు మాత్రమే వెళ్దామనుకున్నారు. పిజ్జా మరియు షాంపైన్ మీద, రజొట్టే ప్రియుడు ఆమెను ఒక వినూత్న ప్రతిపాదనతో ఆశ్చర్యపరిచాడు. ‘‘బాగా గాలి వీచేది మరియు అది గడ్డకట్టేది. కానీ తన ప్రియుడికి తనకు ఎప్పుడు సర్ ప్రైజ్ ఇవ్వాలో తెలుసు‘ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో టైటిల్ పెట్టింది. అంతే కాదు తన జీవితాంతం అతనితో గడిపేందుకు చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నా అని చెప్పింది.

జూమ్ లో బూమ్ బూమ్..
కరోనా వైరస్ నేపథ్యంలో డెలవేర్లో నిర్భందలో ఉండిపోయాడు.అయితే తను కుటుంబ సభ్యుల ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. తన ప్రియురాలిని, స్నేహితులను, కుటుంబసభ్యులను జూమ్ కాల్ లో చేరమని ఆహ్వానించాడు. ‘‘ప్రపంచ గందరగోళ మధ్య నా జీవితంలో మాయా క్షణాల్లో ఒక కొత్త సంబంధం కోసం ఒక మార్గాన్ని కనుగొన్నా‘ అని తన ప్రతిపాదన గురించి ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘మీ ఇల్ల నుండి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. లాక్ డౌన్ ముగిసిన వెంటనే నేను నిన్ను కౌగిలించుకుని ఉత్సాహంగా నీతో కలిసి నవ్వుతూ జీవిస్తా‘ అని తెలిపాడు.

కరోనా బాటిల్ తో నిశ్చితార్థం..
జార్జియాలోని సవన్నాకు చెందిన ఎమిలీ పై, ఆమె చేతిలోని కరోనా బాటిల్ నిశ్చితార్థం జరుపుకుంది. దీనికి సంబంధించి ఆమె ఇలా అన్నారు. ‘‘అబ్బాయిలూ దయచేసి మీ కరోనా నవీకరణలను కొన్ని ప్రెట్టీ, ఫేరింగ్, ఎక్సైటింగ్ న్యూస్ తో నేను మీకు అంతరాయం కలిగిస్తున్నాను‘‘ అని తన ఇన్ స్టాగ్రామ్ లో రాసింది.

ఒక మోకాలిపై...
ఫ్రాన్సిస్కా హారిస్ మరియు మాక్సిమిలియానో ఆడమ్ వెనిస్ బీచ్ వద్ద హాలిడేను ఆనందంగా ఆస్వాదించాలనుకున్నారట. అయితే బీచ్ లు మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా మరచిపోయారట. దీనంతటికి ఆడమే ప్రపోజ్ చేసేందుకు ప్లాన్ చేశాడట. అందుకోసం వీరు బీచ్ పెట్రోలింగ్ ద్వారా ముందుగానే అనుమతి తీసుకున్నారట. అప్పుడు ఆడమ్ వెంటనే ఒక మోకాలిపై తనను వివాహం చేసుకోమని కోరాడని, ‘‘నేను చాలా నిజాయితీగా మరియు పూర్తిగా ప్రణాళిక లేని ఎంగేజ్ మెంట్ పిక్ ను ప్రేమిస్తున్నాను, మా ప్రేమతో నిండి ఉంది‘‘ అని ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.



Click it and Unblock the Notifications