Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
లవ్ సెట్ అయిందా.. వీటి గురించి తెలుసుకున్నాకే రిలేషన్‌షిప్‌లోకి దిగండి!
లవ్ సెట్ అయి రిలేషన్ షిప్ లోకి దిగాలనుకుంటే ఈ ఐదు విషయాల గురించి కచ్చితంగా తెలుకోవాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒకప్పుడు పెళ్లి తర్వాతే ప్రేమ, రిలేషన్ షిప్, అన్నీ. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ పేరుతో పెళ్లి కాకుండానే భార్యాభర్తల్లా కలిసి మెలిసి ఉంటున్నారు. ఎవరైనా సరే లవ్ సెట్ అయి రిలేషన్ షిప్ లోకి దిగాలనుకుంటే ఈ ఐదు విషయాల గురించి కచ్చితంగా తెలుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. జీవితంలో అన్నిటికంటే పెద్ద నిర్ణయం జీవిత భాగస్వామిని ఎన్నుకోవడమే.

అందులో ఏమాత్రం పొరపాటు చేసినా జీవితమంతా దుంఖంతో నిండిపోతుంది. చెడు రిలేషన్ ల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సో బీ కేర్ ఫుల్.

1. నియంత్రణ
చాలా మందికి తమ భాగస్వామితో తమతో మాత్రమే ఎక్కువగా మాట్లాడాలని, తిరగాలని.. అందరికంటే ఎక్కువ ప్రయారిటీ తమకే ఇవ్వాలని కోరుకుంటారు. పొసెసివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే భాగస్వామి అన్ని పనుల్లో జోక్యం చేసుకోవాలనుకుంటారు. పొసెసివ్ గా ఉండటం రిలేషన్ లో మంచిదే అయినప్పటికీ... విపరీతమైన పొసెసివ్ చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్లతో జీవితాన్ని గడపడం చాలా కష్టం. ముందులో ఇది మీకు బాగానే అనిపించినా... రానూ రానూ మిమ్మల్ని ఎవరితో మాట్లాడనీయకపోవడం, స్నేహితులతో కలవనీయక పోవడం, చివరకు కుటుంబ సభ్యులపై కూడా మిమ్మల్ని ప్రేమ చూపించనీయకపోవడం చేస్తారు. కాబట్టి ఇలాంటి వారితో రిలేషన్ కంటే సింగిల్ గా ఉండటమే బెటర్.

2. ఎప్పుడూ అబద్ధాలు
ఏ రిలేషన్ షిప్ లో అయినా సరే ఇద్దరి మధ్యా ఉండాల్సింది నమ్మకం. బయటు వాళ్లకు అబద్ధాలు చెప్పినా పర్లేదు కానీ భాగస్వామితో అబద్ధాలు చెబితే లేనిపోని అనర్థాలు వస్తుంటాయి. ఒక తప్పును కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్పారంటే.. దాని కోసం వందల సంఖ్యలో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్ధాలతో మీ భాగస్వాములను ఎప్పుడూ సంతోషంగా ఉంచలేరు. అయితే మీ భాగస్వామి చిన్న చిన్న అబద్ధాలు చెబుతున్నా సరే తీరు మార్చుకోమని చెప్పండి. అయినా వినకపోతే అలాంటి వారితో రిలేషన్ ను వదులుకోండి. లేదంటే అన్నీ అయ్యాక మిమ్మల్ని వదిలేసిపోతారు ఇలాంటి వాళ్లు.

3. నీచమైన వ్యక్తులకు దూరంగా ఉండాలి..!
తనతో పాటు మీ ఆసక్తి, కెరయర్, అభిరుచులను కూడా గౌరవించేవాడైతనే మీకు విలువ ఉంటుంది. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి మీ ఇష్టాలు, అయిష్టాల గురించి ఏమాత్రం పట్టించుకోడు. అలాంటి వ్యక్తులు ప్రాణాంతకం. మీ కంటే మంచి భాగస్వామి, డబ్బున్న వాళ్లు వస్తే మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు. అలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

4. భవిష్యత్తు గురించి ఆలోచించని వారికి..!
భవిష్యత్తు గురించి ఆలోచించని వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పటి నుంచే భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పటి సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అనుకునే వాళ్లకు చాలా దూరంగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆలోచించని వాడు, భోరసా లేనివాడు బంధానికి సరికాదు.

5. అవసరమైనప్పుడల్లా అందుబాటులో..!
మీరు మెంటల్ గా, ఫిజికల్ గా బాగాలేనప్పుడు మీకు అందుబాటులో ఉండాలి. నిజమైన భాగస్వామి ఎప్పుడు తన పార్టనర్ కి ఏం కాకూడదని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మీకు సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండి, మీరు అడిగితే కుదరలేదని చెప్పే వాళ్లకు మీరు దూరంగా ఉండడం మంచిది. రిలేషన్ షిప్ మొదట్లోనే ఇలా ఉంటే.. ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



Click it and Unblock the Notifications
