For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి మగాళ్లతో జాగ్రత్త సుమా...! లేదంటే మీ జీవితంలో నరకమే...!

|

సాధారణంగా అమ్మాయిలు ఎవరినైనా నిజాయితీగా ప్రేమిస్తే.. వారిపై అపారమైన నమ్మకం, విశ్వాసం పెంచుకుంటారు. వారు తమను జీవితంలో ఎప్పటికీ మోసం చేయరని.. జీవితాంతం తమతో కలిసి ఉంటారని భావిస్తారు. అందరమ్మాయిలకు ఇలాగే జరిగితే ఎంతో బాగుంటుంది.

కానీ కొందరికే ఇది సాధ్యపడుతుంది. చాలా మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ లేదా ప్రేమికుడి చేతిలో మోసపోతుంటారు. అయితే ఇలాంటి మగాళ్లను మనం గుర్తించలేమా? ముందే అప్రమత్తంగా ఉండి టాక్సిక్ రిలేషన్ నుండి బయటికి రాలేమా అంటే.. కచ్చితంగా రావొచ్చు. అందుకోసం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి... ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!

ఇతరులను ఇష్టపడటం..

ఇతరులను ఇష్టపడటం..

మీరు తన పక్కన ఉన్నప్పటికీ.. అస్తమానం ఇతర అమ్మాయిల వైపే చూడటం.. ఇతరులనే ఇష్టపడటం వంటివి చేసే అబ్బాయిల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సాధారణమైన విషయంగా పరిగణించొద్దు. ఎందుకంటే ఇలాంటి విషయాలను మీరు లైట్ తీసుకుంటే.. వారు ఇతరులతో ఇంకో రిలేషన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి త్వరలోనే మీ భాగస్వామి మీ మనసుని బాధపెట్టే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లో ఒకరు.. ఇంటర్నెట్లో మరొకరు..

ఇంట్లో ఒకరు.. ఇంటర్నెట్లో మరొకరు..

ఇప్పట్లో ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. దీని వల్ల ఎందరో వ్యక్తులు కలుస్తున్నారు. విడిపోతున్నారు. అయితే మీ భాగస్వామి ఇంటర్నెట్లో ఇంకొకరిని ఇష్టపడుతున్నారని, మీరు గుర్తించినా వారు దాన్ని సర్దిచెప్పుకునేందుకు సవాలక్ష కారణాలను సిద్ధంగా ఉంచుకుంటారు. అయితే వారితో ఆ రిలేషన్ కొనసాగిస్తూనే మీతోనూ సన్నిహితంగా మెలుగుతారు. ఎందుకంటే మీతో సంబంధం వదులుకోవడాన్ని వారు ఇష్టపడరు. ఇలాంటి సమయంలో ఇంటర్నెట్లో ఎలా ఉంటున్నాడు.. ఇంట్లో ఎలా ఉంటున్నాడనే విషయాలను మీరు పరిశీలించాలి.

నలుగురిలో చులకనగా..

నలుగురిలో చులకనగా..

మీరు మీ ప్రియుడితో కలిసి, ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు, వారు ప్రతి చిన్న విషయానికి మీపైనే డిపెండ్ అవుతారు. నలుగురిలో మిమ్మల్ని చులకనగా చూడటమే కాదు.. ప్రతి ఒక్క పని మీకే చెబుతూ ఉంటారు. నలుగురిలో మీకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అబ్బాయిలతో మీరు రిలేషన్ కొనసాగిస్తే.. మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండాలి.

మీ పార్ట్ నర్ పై ప్రేమ పెరుగుతూ పోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

పర్సనల్ మ్యాటర్స్..

పర్సనల్ మ్యాటర్స్..

సాధారణంగా తమ పార్ట్ నర్ ఏమి చేస్తున్నాడు.. ఇంటర్నెట్లో ఏమేమి అన్వేషిస్తున్నాడు అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని భావిస్తారు. అయితే అదంతా సరదాగానే భావిస్తారు. ఈ నేపథ్యంలో భాగస్వామి ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి సమయంలో కొందరు మగాళ్లు తమ పార్ట్ నర్ ఫోన్ ముట్టుకుంటే చాలు తెగ కోప్పడిపోతారు. తమ పర్సనల్ మ్యాటర్స్ ఎక్కడ తెలుస్తాయోనని ఇకపై అలా చేయకని ఆర్డర్లు వేస్తుంటారు. అలాంటి మగాళ్ల నుండి మీరు ఎంత జాగ్రత్తగా అంత మంచిది.

ముచ్చట్లు తగ్గిస్తారు..

ముచ్చట్లు తగ్గిస్తారు..

మిమ్మల్ని కలిసిన కొత్తలో మిమ్మల్ని మురిపించే ముచ్చట్లు మస్తుగా పెట్టిన మీ బాయ్ ఫ్రెండ్.. క్రమంగా మీతో మాట్లాడేందుకు ఆసక్తి చూపరు. ఏదన్నా అంటే బిజీగా ఉన్నా అని ప్రతిసారీ చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మొదట్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంతో కొంత సమయం కేటాయిచుకుని.. మీతో మాట్లాడేవారు.. అకస్మాత్తుగా మీతో ముచ్చట్లు ఆపేసినా, తగ్గించినా ఇలాంటి వారి విషయాలపై మీరు ఆలోచించాల్సిందే.

లోపాలను వెతకడం..

లోపాలను వెతకడం..

మీరు తనతో కలిసి జీవించే సమయంలో ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా.. అందులో లోపాలను వెతకడం.. మీ తప్పు ఏమి లేకపోయినా.. అందుకు మిమ్మల్నే బాధ్యులను చేసి.. నిందించడం.. అక్కడితో ఆగకుండా క్షమాపణలు చెప్పమని కోరడం వంటివి చేస్తుంటే.. అలాంటి వారికి మీరు బ్రేకప్ చెప్పేందుకు మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఓపిక చాలా తక్కువగా ఉంటుంది.

తన కోసం మారాలని..

తన కోసం మారాలని..

మీ భాగస్వామి ప్రతి విషయంలో మీ కంటే గొప్పవారిగా.. తెలివైనవారిగా.. అందమైన వారిగా ఊహించడం.. తన కోసం మీరు అన్ని అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేయడం.. తనకు మాత్రమే గొప్ప అలవాట్లు ఉన్నాయని చెప్పుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటే.. అలాంటి అబ్బాయిల స్నేహానికి, ప్రేమ బంధానికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్లతో జీవితాలు పంచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

English summary

Types of Toxic Men to Avoid in Telugu

Check out the types of toxic men you should avoid. Read on.
Story first published: Thursday, April 8, 2021, 17:58 [IST]