Valentine's Week 2023: ఈ చాక్లెట్లతో మీ ప్రేమను తియ్యని వేడుకలా జరుపుకోండి...

వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ డే ఎందుకంత పాపులర్ అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Valentine's Week 2023: వాలెంటైన్ వీక్ లో అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి. తొలి రెండు రోజుల్లో రోజ్ డే, ప్రపోజ్ డే గడిచాక.. ముచ్చటగా మూడో రోజు చాక్లెట్ డే వచ్చేసింది. కొత్తగా తమ ప్రియుడికి లేదా ప్రేయసికి ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని కన్ఫ్యూజన్లో ఉండేవారు చాక్లెట్ డేను సరైన సమయంగా వాడుకోవచ్చు.

Valentines Week 2022

ప్రతి సంవత్సరం వాలెంటైన్ వీక్ లో భాగంగా మూడో రోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. ఈరోజున రకరకాల చాక్లెట్లను ఇచ్చి తమ వారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారైతే తమ ప్రేయసి లేదా ప్రియుడికి ఇష్టమైన చాక్లెట్లను ఇచ్చి వారిని ఆనందపరుస్తారు.

Valentines Week : Why is Chocolate So Popular On Valentines Week

వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ డే రోజున ప్రియమైన వారితో సరదాగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు నోటిని తియ్యగా మార్చుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు.

Valentines Week 2022

కాబట్టి మీరు కూడా వారి చెప్పిన పద్ధతిని గుడ్డిగా ఫాలో అవ్వండి. ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ వీక్ సందర్భంగా మార్కెట్లో అనేక రకాల చాక్లెట్లు అందుబాటులోకి వస్తుంటాయి. వాటిలో డార్క్ చాక్లెట్లను సెలెక్ట్ చేసుకోండి.. మీ ప్రియమైన వారికి ఇచ్చేయండి. ఇంకా మీ లవర్ ఎలాంటి చాక్లెట్లంటే ఇష్టమో వాటి గురించి తెలుసుకోండి.

చాక్లెట్ డే చరిత్ర..

చాక్లెట్ డే చరిత్ర..

చరిత్రను పరిశీలిస్తే.. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా చాక్లెట్ డేకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతమాత్రన ఈరోజున సెలవు దినంగా పరిగణించరు. అయితే క్రైస్తవ సెయింట్లతో పాటు సెయింట్ వాలెంటైన్ ను గౌరవించే క్రైస్తవ విందుగా ఉద్భవించింది. విక్టోరియన్ కాలం నుండి, అట్లాంటిక్ ఖండం మరియు అమెరికాలో ప్రేమలో ఉన్న స్త్రీ, పురుషులు ఒకరినొకరు పంచుకునే బహుమతుల్లో చాక్లెట్లు ఎక్కువగా ఉండేవి. వాషింగ్టన్ డిసిలోని స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూషన్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం, 19వ శతాబ్దంలో ఒక బ్రిటీష్ కుటుంబం రిచర్డ్ క్యాడ్ బరీ మరింత రుచికరమైన డ్రింకింగ్ చాక్లెట్ తయారు చేయడానికి ఓ ప్రక్రియ కోసం వెతుకుతారు. అప్పుడు ‘చాక్లెట్లు తినడం' ఒక మనోహరమైన స్వీయ రూపకల్పన బాక్స్ లో ప్యాక్ చేసి ఇదే మా సమాధానం అని చెబుతారు.

‘‘మార్కెంటింగ్ ఎక్స్ పర్ట్, క్యాడ్ బరీ 1861లో హార్ట్ షేప్ బాక్సులపై మన్మథులు మరియు రోజ్ బడ్ లను ఉంచారు'' అప్పటి నుండి ‘‘ప్రేమ లేఖల వంటి మెమెంటోలను సేవ్ చేయడానికి ప్రజలు అందమైన చాక్లెట్లను ఉపయోగించడం ప్రారంభించారు''అని అధికారిక సైట్ వివరించింది. అంతేకాదు చాక్లెట్ మీ వాలెంటైన్ మరియు లవ్ బర్డ్స్ గిఫ్టు చాక్లెట్ పై ఎప్పటికీ అంతులేని ప్రేమను సూచిస్తుంది. దానిని వ్యక్తపరుస్తుంది. చాక్లెట్ అనేది నిస్సందేహం ప్రేమను పెంచే ఉత్తమ బహుమతులలో ఒకటి. ఎందుకంటే ఇవి మీ భాగస్వామిని బాగా సంతోష పరుస్తాయి.

సెమీ స్వీట్ చాక్లెట్..

సెమీ స్వీట్ చాక్లెట్..

ఇది ఒక రకమైన డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్లో కోకో కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. ఇది బిట్టర్ చాక్లెట్ల కన్నా చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి ఈ చాక్లెట్ డే సందర్భంగా మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి మీరు ఏ రకమైన చాక్లెట్ ఇవ్వాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి.

వెనీలా ఫ్లేవర్..

వెనీలా ఫ్లేవర్..

మనలో చాలా మందికి వెనీలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి అలాంటి ఫ్లేవర్ ఉండే చాక్లెట్లను మీ ప్రియమైన వారికి ఇస్తే చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా వైట్ చాక్లెట్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి కాస్త లైట్ గా పసుపు రంగును కూడా కలిగి ఉంటాయి.

డార్క్ చాక్లెట్..

డార్క్ చాక్లెట్..

రొమాన్స్ ను ఎక్కువగా ఇష్టపడే వారు డార్క్ చాక్లెట్ ను ఎక్కువగా తింటూ ఉంటారట. అంతేకాదు డార్క్ చాక్లెట్ అనేది మన వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుందట. అలాగే సైకాలజీ సమస్యల పరిష్కారానికి ఈ చాక్లెట్ ద్వారా ఉపశమనం లభిస్తుందట. వీటిలో కోకో ఎక్కువగా ఉన్నప్పటికీ.. పాల పదార్థాలు తక్కువగా ఉంటాయట.

చాక్లెట్ భావాలు..

చాక్లెట్ భావాలు..

‘‘చాక్లెట్ల ఎలాంటి ప్రశ్నలు ఎదురవ్వవు. ఇద్దరు మనుషులు, మనసుల మధ్య భావాలను మాత్రమే పంచుకుంటాయి. అందుకే నీ కోసం ఈ చాక్లెట్ ప్రియతమా'' ‘నువ్వు ఎవ్వరికీ అర్థం కావేమో.. కానీ నా జీవితానికి అర్థం మాత్రం నువ్వే.. నీ లోకమే.. నా లోకం.. నేను ఉన్నంత వరకు నిన్ను కనురెప్పలా కాపాడుకుంటా.. ఐ లవ్ యూ సో మచ్..' ‘హెల్దీగా ఉండాలంటే చాక్లెట్లు కావాలి. హ్యాపీ లైఫ్ కోసం ట్రూ లవ్ కావాలి కాబట్టి.. నా స్వీట్ హార్ట్ నీకు ఈరోజు తియ్యగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ' హ్యాపీ చాక్లెట్స్ డే.

FAQs
వాలెంటైన్ వీక్ డేలో భాగంగా చాక్లెట్ డే ఎప్పుడొస్తుంది?

ప్రతి సంవత్సరం వాలెంటైన్ వీక్ లో భాగంగా మూడో రోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డే జరుపుకుంటారు. ఇప్పటివరకు తమ ప్రేమను చెప్పనివారు చాక్లెట్ డే రోజున తియ్యని కబురు చెప్పేందుకు సిద్ధమవుతుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారు తియ్యని వేడుకలను జరుపుకుంటారు.

వాలెంటైన్ వీక్ డేలో భాగంగా చాక్లెట్ డే ఎప్పుడొస్తుంది?

ప్రతి సంవత్సరం వాలెంటైన్ వీక్ లో భాగంగా మూడో రోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డే జరుపుకుంటారు. ఇప్పటివరకు తమ ప్రేమను చెప్పనివారు చాక్లెట్ డే రోజున తియ్యని కబురు చెప్పేందుకు సిద్ధమవుతుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారు తియ్యని వేడుకలను జరుపుకుంటారు.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion