Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
లైఫ్ పార్ట్‌నర్‌పై ఫిర్యాదులు ఆపండి, చిన్న చిన్న చిట్కాలతో ఇలా సాన్నిహిత్యం పెంచుకోండి
లైఫ్ పార్ట్‌నర్‌పై తరచూ ఫిర్యాదులు చేయడం ఎలా ఆపాలి, చిన్న చిన్న చిట్కాలతో సాన్నిహిత్యం ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ వ్యక్తి పర్‌ఫెక్ట్ కాదు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని అంగీకరించాల్సిందే. దాంపత్య బంధంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామిని అన్ని రకాలుగా అంగీకరించాల్సిందే. సంబంధం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఏదైన విషయంపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కూడా చాలా సాధారణం. అయితే ప్రతి పనిలో అలాగే కంప్లైంట్ చేస్తుంటే మాత్రం అది సమస్యగా మారుతుంది. ప్రతి అంశంలోనూ తప్పులు వెతికి వాటి గురించి గుచ్చి గుచ్చి అడగటం వల్ల ఎదుటివారికి విసుగు వస్తుంది. అసంతృప్తి మొదలవుతుంది. అది సంబంధానికి చాలా హానికరం.

ప్రతి చిన్న విషయానికీ ఫిర్యాదు చేయడం ఎలా ఆపాలో తెలుసుకోవడం ముఖ్యం. కంప్లైంట్ చేయడం ఆపడమంటే మీ ఆందోళనలను చెప్పడం, అవసరాలను వ్యక్తపరచడం మానేయమని అర్థం కాదు. సమర్థవంతంగా, అర్థమయ్యే రీతిలో, క్లుప్తంగా, స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలిగితే చాలా సమస్యలు తొలగిపోతాయి.
లైఫ్ పార్ట్‌నర్‌పై తరచూ ఫిర్యాదులు చేయడం ఎలా ఆపాలి, చిన్న చిన్న చిట్కాలతో సాన్నిహిత్యం ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బి ప్రొడక్టివ్
తప్పులు గుర్తించడం, సమస్యలను వేలెత్తి చూపడం వల్ల అవి తొలగిపోవు. తప్పు జరిగితే మరోసారి ఆ తప్పు జరగకుండా ఎలా చూడాలి, సమస్య ఉంటే దాని పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాలి.
సమస్య అనేది లేనప్పుడు ఇంకా హైరానా పడాల్సిన అవసరం లేదు. తప్పు జరగనప్పుడు చింతించాల్సిన పని లేదు.

2. సలహా అడగాలి
ఎప్పుడూ ఫిర్యాదు చేయడం, సలహా అడగడం రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. దేని గురించైనా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు మీ కోపాన్ని పక్కన పెట్టాలి. ఏం జరిగింది, ఎలా జరిగిందో సావధానంగా తెలుసుకోవాలి. ఒకవేళ తప్పు జరిగితే అది మరొకసారి రిపీట్ కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి.
మీకు తెలియకపోతే మీ భాగస్వామిని సలహా అడగాలి. సమస్య ఉంటే దాని పరిష్కారాన్ని కనుక్కునేందుకు సాయం అడగాలి.

3. వినడం నేర్చుకోండి
ఏ సంబంధంలో అయినా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ భావాలను, భావోద్వేగాలను, ప్రేమను, కోపాన్ని సరిగ్గా తెలపగలగాలి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో క్లుప్తంగా, స్పష్టంగా చెప్పడం ఓ కళ. ఆ కళను మెల్లిగా అయినా నేర్చుకోవాల్సిందే.
ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. అవతలి వారి వర్షన్ ఏమిటో తెలుసుకోవాలంటే వినాల్సిందే.

4. ధ్యానం చేయండి
కొన్నిసార్లు మీరు చూసిన మరియు విన్న వాటి ఆధారంగా ఆలోచించడానికి సమయం, ప్రశాంతమైన మనసు కావాలి. అందుకోసం రోజూ ధ్యానం సాధన చేయండి. ఒత్తిడి లేదా కోపం ఉన్నప్పుడు ధ్యానం చాలా సహాయపడుతుంది.
కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని గ్రహించండి. కోపంలో అనే మాటల వల్ల బంధం బీటలు వారుతుంది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం చక్కగా పని చేస్తుంది.

5. క్షమించండి, క్షమాపణ అడగండి
ఎదుటి వ్యక్తి క్షమాపణ కోరినప్పుడు మీరు క్షమించగలగాలి. మీ తప్పు కానప్పుడు కూడా మీరు క్షమించమని అడగగలగాలి. మీరు మీ అహంకారం లేదా అహం కంటే సంబంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం. ఫిర్యాదు చేయడం మానేయమని ఎవరికైనా చెప్పడానికి ఇది కూడా సమర్థవంతమైన మార్గం.



Click it and Unblock the Notifications
