For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలను బట్టి మీ బంధం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు...!

|

మనం పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్క వ్యక్తితోనూ మనకు ఏదో ఒక బంధం అంటూ ఏర్పడుతుంది. అది స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏదైనా కావొచ్చు. అయితే ఇలా ఏర్పడే బంధాల్లో అనేక రకాలు ఉంటాయి. అయితే మనకు పరిచయమయ్యే ప్రతి వ్యక్తితో ప్రాధాన్యాన్ని బట్టి వారితో ఉండే బంధం మారుతూ ఉంటుంది.

అయితే చాలా బంధాల్లో ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని కోరుకుంటారు. అయితే ప్రతి బంధంలో ఇలాంటివి కావాలంటే.. కొంచెం కష్టంగా ఉంటుంది. బయటి ప్రపంచానికి సంతోషంగా మరియు విజయవంతంగా అనిపించే సంబంధం వాస్తవానికి దానిని మార్చడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతి సంబంధంలో రాజీలు, సర్దుబాట్లు మరియు త్యాగాలు ఉంటాయి.

ఇవన్నీ ఉంటేనే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయిన ప్రేమ బంధం చివరి వరకు ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ప్రతి ఒక్క సంబంధాన్ని పరీక్షించడం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం ప్రియుడు, ప్రియురాలు లేదా భార్యభర్తలిద్దరూ కలిసి జీవించాల్సిన అవసరం లేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మీ బంధం గురించి మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే... లేదంటే చాలా మిస్సవుతారు.. ఆ విషయాలేంటో ఇప్పుడే చూసెయ్యండి.

పెళ్లైన తర్వాత ప్రియుడు/ప్రియురాలు కనిపిస్తే... మీ రియాక్షన్ ఇదేనా?పెళ్లైన తర్వాత ప్రియుడు/ప్రియురాలు కనిపిస్తే... మీ రియాక్షన్ ఇదేనా?

మీ పార్ట్ నర్ ప్రవర్తన..

మీ పార్ట్ నర్ ప్రవర్తన..

ఏ ఇద్దరు వ్యక్తులైనా డేటింగ్ ప్రారంభించినప్పుడు, వారు ఒంటరిగా ఉన్న బడుగలో తమను తాము చుట్టుముట్టినట్టు భావించే అవకాశం ఉంటుంది. ఇది ఒకదానికొకటి పరిమిత పరిధిని కలిగిస్తుంది. కాబట్టి మీ పార్ట్ నర్ మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఓ కంట కనిపెట్టండి. వారు స్నేహితులతో బయట ఎలా ఉంటున్నారు మరియు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరిస్తారో ఇప్పుడు తెలుసుకోండి.

ఆ విషయాల్లో స్పష్టతగా ఉండండి..

ఆ విషయాల్లో స్పష్టతగా ఉండండి..

మీ భాగస్వామితో భవిష్యత్తు బంధం మరింత బలంగా ఉండాలంటే.. మీరు రిలేషన్ షిప్ విషయంలో విలువలు, నమ్మకాలు మరియు అంచనాల గురించి సంభాషణలు ప్రారంభంలోనే చేయాలి. వారి మాటల్ని బట్టి మీరిద్దరూ కలిసి ఉండేందుకు వాస్తవ జీవితంలో అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ భవిష్యత్తు గురించి మీకు మరింత లోతుగా తెలుసుకునే అవకాశం దొరుకుతుందది. మీ భాగస్వామి జీవితం ఏ దిశలో వెళ్తుందో కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

వివిధ రకాల వ్యక్తులతో..

వివిధ రకాల వ్యక్తులతో..

మీ ఇద్దరి బంధంలో సాన్నిహిత్యం పెరగాలంటే.. మీరిద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి. అంతేకాదు బాగా అర్థం చేసుకోవాలి. మీరు వ్యక్తిగతంగా ఊహించని విషయాలేంటి మరియు మీరు ఎంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అనే విషయాలు మీ భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీకు సహాయకారిగా ఉంటుంది. దీని వల్ల మీకు కొత్త రకాల అనుభవాలకు అవకాశం లభిస్తుంది. ఇందుకోసం మీరు వివిధ రకాల ఆలోచనలు ఉన్న వారితో మాట్లాడాలి.

<strong>ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!</strong></p><p>ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!

కలిసి జర్నీ చేయండి..

కలిసి జర్నీ చేయండి..

మీరు జీవితాంతం కలిసి ఉండాలనే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి వారితో కలిసి ఏదైనా కొత్త ప్రాంతానికి జర్నీ చేయండి. కొత్త వ్యక్తులు మరియు కొత్త ప్రదేశాల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మీకు జర్నీ బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలిసి వెళ్లేటప్పుడు అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుని సిద్ధం కండి. అప్పుడే మీరు ఒక టీమ్ గా కలిసి ఎలా పనిచేస్తారో తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

ఇక చివరగా మీ పెళ్లికి ముందు కొన్ని విషయాల గురించి పూర్తిగా అధ్యయనం చేయండి. దీని వల్ల మీకు కొన్ని ముఖ్యమైన విషయాలతో విలువైన చర్యలు కూడా జరుగుతాయి. అప్పుడే మీ ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలున్నా.. అభిప్రాయ భేదాలున్న సులభంగా గుర్తించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు వాటి వల్ల మీ సంబంధం మరింత బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉంది.

తాత్కాలిక బంధాలు..

తాత్కాలిక బంధాలు..

కొందరు వ్యక్తులు తమ బంధాన్ని ఎప్పుడూ స్నేహితులుగానే చెబుతారు. కానీ ఒకరినొకరు వారికే తెలియకుండా ఇంప్రెస్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమ రిలేషన్ గురించి ఇద్దరి మధ్య ఎలాంటి హద్దులు లేవని తెలిసినప్పటికీ అవతలి వ్యక్తి నుండి తమకు నచ్చింది పొందాలని ఆరాట పడుతూ ఉంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఇలాంటి బంధాలు కేవలం తాత్కాలికంగానే మిగిలిపోతాయి.

English summary

Ways To Test Your Relationship Without Moving in Together in Telugu

Here are the ways to test your relationship without moving in together in Telugu. Take a look
Story first published: Monday, June 14, 2021, 15:51 [IST]