Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సంబంధం విసుగు పుడుతోందా? తిరిగి ఉత్సాహం రావాలంటే ఇలా చేయండి
పెళ్లైన కొత్తలో ఉన్న ఆసక్తి క్రమంగా పోతోందా, రిలేషన్‌షిప్ బోర్ కొడుతోందా, అయితే తిరిగి గాడిలో పడటానికి, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఈ చిట్కాలు పాటించండి.
ఇటీవలి కాలంలో దంపతుల మధ్య ఓపిక ఉండట్లేదు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, చిన్న చిన్న గొడవలకే విడిపోవాలని నిర్ణయించుకోవడం జరుగుతోంది. సంబంధంలోని అసలు మాధుర్యాన్ని అనుభవించకముందే చాలా మంది విడిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడిపోవడం చూస్తూనే ఉన్నాం. కొత్త వ్యక్తులో జీవితాన్ని పంచుకోవడం అంటే అంత సులభంగా ఏమీ ఉండదు. సంబంధం మొదట్లో జీవిత భాగస్వామి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే కొద్దీ బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత క్రమంగా బోర్ కొడుతుంది. ఈ బోరింగ్ స్టేజ్‌ను దాటగలిగితే సంబంధంలోని అసలైన మాధుర్యం తెలుస్తుందని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.

పెళ్లైన కొత్తలో ఉన్న ఆసక్తి క్రమంగా పోతోందా, రిలేషన్‌షిప్ బోర్ కొడుతోందా, అయితే తిరిగి గాడిలో పడటానికి, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఈ చిట్కాలు పాటించండి.

1. భాగస్వామి సంతోషాన్ని పరిగణించాలి
దాంపత్యంలో ఇద్దరి సంతోషం, ఇష్టాలు, కష్టాలు అన్నింటిని అంగీకరించే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. చాలా జంటల మధ్య ఇష్టం-కష్టం తోనే గొడవలు మొదలవుతాయి. పెళ్లి అయ్యేంత వరకు నా ఇష్టాలు, నా కోరికలు అనుకునే గడిపి ఉంటారు. పెళ్లయ్యాక మా ఇష్టాలు, మా కోరికలు అంటూ ఆలోచించగలగాలి.
మీ ఇష్టాలే కాకుండా మీ భాగస్వామికి ఏం ఇష్టమో తెలుసుకోవాలి. వారికి ఇష్టమైన వస్తువులను సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వండి. వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లండి, రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైనవి ఆర్డర్ చేయండి, ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. సాన్నిహిత్యం పెరుగుతుంది.

2. సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి
చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం, కోప్పడటం మానుకోవాలి. ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి రాగానే చిరాకు ముఖంతో, అరుస్తూ వారిని పలకరిస్తే ఉన్న మూడ్ పోతుది. ఉద్యోగంలో, వ్యాపారంలో ఎన్ని కష్టాలు, ఒత్తిడి ఉన్నా ఇంటికి వచ్చాక వాటిని పక్కన పెట్టాలని గుర్తుంచుకోండి.
అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ఏకాంతంగా బయటకు వెళ్లండి. పార్కు, ఈవినింగ్ వాక్, కలిసి జిమ్‌కు వెళ్లడం లాంటి పనుల వల్ల బాండింగ్ పెరుగుతుంది. ఏకాంతంగా మాట్లాడుకునే వీలుంటుంది. ఫ్రెండ్స్, బంధువుల శుభకార్యాలకు కలిసి వెళ్లి, కలిసి రండి.

3. బ్యాచిలర్ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా ఏమీ ఉండదు
పెళ్లి చేసుకోగానే ఇక ఫ్రీడం పోయిందని, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయలేవని, భర్త చెప్పినట్లుగా భార్య, భార్య చెప్పినట్లుగా భర్త వినాల్సిందేనని చాలా మంది చెబుతుంటారు. కానీ కొత్త బంధం మొదట్లో కొత్త కొత్తగా, కొన్ని విషయాల్లో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. వాటిని నెగటివ్‌గా చూడటం కంటే కొత్త బంధం అన్న తర్వాత ఇలాంటివి ఉంటాయన్న నిజాన్ని అంగీకరించండి.
మీకో జీవిత భాగస్వామి దొరికిందని, మంచి చెడూ, కష్టం సుఖం, ఇష్టాయిష్టాలు అన్నీ పంచుకునేందుకు ఒక భాగస్వామి దొరికారని గుర్తించుకోండి.

4. రాజీ వైఖరితో ఉండండి
ఏ సంబంధం అయినా ప్రేమ, నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ గొడవ పడుతూనే ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది. పెళ్లంటే పెద్దయ్యాక జరిగే కార్యక్రమం అని అందరికీ తెలుసు కాబట్టి పిల్లల్లా చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకునే వైఖరి విడిచిపెట్టండి.
మెచ్యూర్‌గా ఆలోచిస్తే చాలా గొడవలు జరగనే జరగవు. జీవిత భాగస్వామి నిర్ణయాలను గౌరవించాలి. ఏ నిర్ణయం అయినా ఇద్దరూ కలిసి తీసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కొన్ని గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటిని ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

5. సహాయం తీసుకోండి
గొడవ జరిగింది, పరిష్కరించుకునే వీలు లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు అనుకున్నప్పడు ఫ్రెండ్స్, బంధువుల సాయం తీసుకోవడానికి వెనకాడవద్దు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించకపోతే రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సాయం తీసుకోండి.
అసలు సమస్య ఏమిటో వారికి వివరించండి. ఎక్కడ గొడవ జరుగుతుందో అర్థమయ్యేలా చెప్పండి. వారు మీకు కచ్చితంగా ఓ పరిష్కారం చూపిస్తారు.



Click it and Unblock the Notifications