Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీ రాశి ప్రకారం.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...
మీ రాశి చక్రం ప్రకారం, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరవుతారో తెలుసుకోండి.
మనలో చాలా మంది ప్రతి ఒక్క విషయాన్నీ బెస్ట్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, బంధువులతో కూడా చెప్పుకోలేని కష్టసుఖాలు, సంతోషాలతో పాటు మనం ప్రతి చిన్న విషయాన్ని బెస్ట్ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉంటాం.

మనకు ఏదైనా కష్టం వస్తే మనం బంధువుల దగ్గరికి వెళ్లడం కన్నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికెళితే కచ్చితంగా సాయం దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే మన బెస్ట్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా వింటారు.

వారు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోయినా భరోసా ఇస్తారు. మనకు ఇవ్వాల్సినంత మద్దతు ఇస్తారు. ఇలాంటి ఆత్మీయ బంధం ఈ లోకంలో దేనికీ ఉండదు. ప్రతి ఒక్కరూ తమకు ఇలాంటి ఫ్రెండ్సే కావాలని కోరుకుంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు.
కానీ జ్యోతిష్యశాస్త్రం దీనికి సహాయపడుతుంది. గ్రహాల ఆధారంగా మీ రాశిని బట్టి మీరు ఎవరిని బెస్ట్ ఫ్రెండ్ గా ఎంపిక చేసుకుంటారో తెలుసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి...

మేష రాశి..
ఈ రాశి వారిలో కొన్ని గుణాలు, లక్షణాలు ఉండవని.. అవి ఎవరితో అయితే ఉంటాయో అలాంటి వారినే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎంపిక చేసుకుంటారు. వీరికి తుల రాశి వారు ఎక్కువగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరిద్దరూ కలిస్తే ఒకరి నుండి మరొకరు అనేక విషయాలను షేర్ చేసుకుంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా స్పాట్ లో నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే వీరికి కొంత ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎవరైతే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో.. అలాంటి వారే తమ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ గా కావాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా కన్య రాశి వారిని బెస్ట్ ఫ్రెండ్స్ గా చేసుకునే అవకాశం ఉంది.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ లాగే ఆలోచించే వారిని స్నేహితులుగా కావాలని కోరుకుంటారు. ఎందుకంటే అప్పుడే తాము ఉన్నత స్థాయికి చేరుకుంటామని భావిస్తారు. అందుకే వీరు ఎక్కువగా మేష రాశి వారితో స్నేహం చేస్తారు. వీరికి బెస్ట్ ఫ్రెండ్ గా అయ్యే అర్హత వారికి మాత్రమే ఉందని భావిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరు అందరితో కలిసి పార్టీల్లో పాల్గొనడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకే అలా అందరితో కలిసిపోయే వారిని బెస్ట్ ఫ్రెండ్స్ గా కావాలని కోరుకుంటారు. కాబట్టి వీరు వృశ్చిక రాశి వారితో ఎక్కువ స్నేహం చేస్తుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తారు. వీరు ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వారే తమ బెస్ట్ ఫ్రెండ్ గా కావాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా ధనస్సు రాశి వారిని బెస్ట్ ఫ్రెండ్ గా ఎంపిక చేసుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు. ఏదైనా పనిని మొదలుపెడితే.. అది పూర్తయ్యేవరకు అంత సులభంగా వదిలిపెట్టరు. దాని గురించి ఒకరితో ఒకరు పూర్తిగా చర్చించుకుంటారు. వీరు ఎక్కువగా వృశ్చిక రాశి వారిని బెస్ట్ ఫ్రెండ్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు.

తుల రాశి..
ఈ రాశి వారికి పొగడ్తలంటే చాలా ఇష్టం. వీరిని ఎవరైతే ఎక్కువగా మెచ్చుకుంటారో.. వారితోనే ఎక్కువగా స్నేహం చేయాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా వృషభరాశిని బెస్ట్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకుంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఫ్రెండ్ షిప్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే వీరితో మీన రాశి వారు ఎక్కువగా స్నేహం చేసేందుకు ఆసక్తి చూపుతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు చాలా మందితో కలిసి సరదాగా గడుపుతారు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వీరికి ఎవరైనా నచ్చితే వారిని ఆదర్శంగా తీసుకుంటారు. వీరు ఎక్కువగా మేష రాశి వారితో స్నేహం చేస్తారు.

మకర రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో ఓపెన్ గా ఉంటారు. వీరు ఎప్పుడూ ఎక్కువగా హడావుడి చేస్తుంటారు. అయితే వీరికి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరిని అర్థం చేసుకునే వారు స్నేహితులుగా కావాలని కోరుకుంటారు. ఈ రాశి వారికి కన్య రాశి వారు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి చాలా విషయాల్లో సెంటిమెంట్లు ఉంటాయి. కాబట్టి వీరు స్నేహం చేసే వారికి కూడా అలాంటి అలవాట్లే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే తాము ఒకరికొకరు అలాంటి వాటి గురించి చర్చించుకోవచ్చని భావిస్తారు. ఈ రాశి వారు కుంభ రాశి వారిని బెస్ట్ ఫ్రెండ్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు ఈరోజు తమను బాగా లోతుగా అర్థం చేసుకోవాలని భావిస్తారు. వీరు కుంభ రాశి వారితో బాగా కలిసిపోతారు. వీరిని కుంభ రాశి వారు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోరు. అందుకే మీన రాశి వారు కుంభ రాశి వారిని బెస్ట్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకుంటారు.



Click it and Unblock the Notifications