Latest Updates
-
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి
దూరాన ఉన్నారా?మరొకరితో ఎఫైర్ పెట్టుకోకుండా,మీరే కావాలని కోరుకోవాలంటే..
ఈ రోజుల్లో కుటుంబ పోషణ కోసం లేదా బతుకుదెరువు కోసం మెళ్ల దూరం వెళ్లి పనులు చేస్తున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో తమ భార్యలను ఇళ్ల దగ్గరే వదిలిపెట్టి వెళ్లేవాళ్లు, భర్త ఒక ఊర్లో ఉద్యోగం చేస్తుంటే భార్య మరో ఊర్లో ఉద్యోగం చేయడం వంటివి చూస్తుంటాం. దూరంగా ఉన్న సమయంలో ప్రేమకు అసలైన పరీక్షలు ఎదురవుతుంటాయి. భార్యకు మరొకరి మీద ఆకర్షణ కలగడమో లేదా భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడమో లేదా మీ లవర్ మీకు బైబై చెప్పి మరొకరిని చూసుకోవడం వంటివి నిత్యం జరుగుతున్నాయి,మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి జరగకుండా,జీవితాలను నాశనం చేసుకోకుండా దూరానా ఉన్నా కూడా మీ ప్రియమైనవారికి, మీ మధ్య బంధం బలపడాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.
అది వాడి దగ్గరగా
కొన్నిసార్లు ప్రియమైన వారికి దూరంగా ఉండటం ఒక అగాధంలా అనిపించవచ్చు. సవాళ్లు ఎదురైనప్పుడు మనసులోని మాటను ఎలా పంచుకోవాలో, ఒకరికొకరు ఎలా తోడుగా నిలవాలో తెలియక ఇబ్బంది పడటం సహజం. కానీ ఈ దూరాన్ని ప్రేమమయం చేసే వంతెనను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుంటే మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇక్కడే కొన్ని చిన్న చిన్న వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. భౌతిక భౌతిక దూరం ఉన్నప్పటికీ మానసికంగా ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి చేసే ప్రతి ప్రయత్నం ప్రేమకు బలాన్ని చేకూరుస్తుంది.

దూరానా ఉన్నా కూడా మానసికంగా,శారీరకంగా ఒకరికొకరు పక్కనే ఉండేలా చేసుకోడానికి ప్రస్తుత టెక్నాలజీ చాలా సాయపడుతుంది. కేవలం సాధారణ వీడియో కాల్స్‌కే పరిమితం కాకుండా, అప్పుడప్పుడు ఒక వర్చువల్ డేట్' ప్లాన్ చేసుకోండి. అందంగా రెడీ అయ్యి ఇద్దరికీ ఇష్టమైన ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని ఒకే సినిమాను చూస్తూ లేదా ఆన్ లైన్ లో సరదాగా గేమ్స్ ఆడుతూ గడపండి. ఇలాంటివి మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
ప్రతిరోజూ ఉదయం ఒకరి ముఖం చూసి రోజును ప్రారంభించడం, రాత్రి నిద్రపోయే ముందు మనసు విప్పి మాట్లాడుకోవడం వంటి చిన్న చిన్న పనులు మీ మధ్య ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఏర్పరుస్తాయి. అలాగే మీ భాగస్వామికి చిన్న అనారోగ్యం చేసినా లేదా వారు పని ఒత్తిడిలో ఉన్నా వారిని ఆలోచిస్తూ ఒక కేర్ ప్యాకేజీ పంపండి. ఈ చిన్న హావభావం నువ్వు దూరంగా ఉన్నా, నా మనసు నీతోనే ఉంది అని చెప్పే ఒక హృదయపూర్వకమైన మార్గం.

స్పష్టత, నమ్మకం
ఏ బంధానికైనా పునాది నిజాయితీ,స్పష్టమైన అంచనాలు. మీ భావాలను, భయాలను, అభద్రతా భావాలను దాచుకోకుండా ఒకరికొకరు ఫోన్ ద్వారా లేదా మరో మార్గం ద్వారా అయినా షేర్ చేసుకోవడం పంచుకోవడం ముఖ్యం. మీ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేనప్పుడు ఆ బంధం ఒక సురక్షితమైన ప్రదేశంగా మారుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకున్నారని మీకు అనిపించినప్పుడు వారిని అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నిస్తారు. సుదూర సంబంధాన్ని నిలబెట్టేది ఖరీదైన బహుమతులు కాదు, గొప్ప గొప్ప వాగ్దానాలు కాదు.. దానిని నిలబెట్టేది స్థిరమైన ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం, ప్రతిరోజూ చూపే చిన్న చిన్న శ్రద్ధేనని రిలేషన్ షిప్ నిపుణులు తరచూ చెబుతుంటారు.



Click it and Unblock the Notifications