Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
డబ్బు,పొలం కాదు..మంచి అల్లుడు కావాలంటే ఇవి ముఖ్యం
పెళ్లి అయిన రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల బంధం. కంటికి రెప్పలా కాపాడుకున్న తన కూతురిని మరొకరి చేతిలో పెట్టాలంటే ఏ తండ్రికైనా గుండెలో ఓ చిన్న కలవరం మొదలవుతుంది. ఆ అబ్బాయి తన కూతురిని బాగా చూసుకుంటాడా? కన్నీళ్లు పెట్టకుండా కాపాడుకుంటాడా? అనే వేల ప్రశ్నలు ఆ తండ్రి మదిని తొలుస్తుంటాయి. అందుకే కాబోయే అల్లుడి ఖరీదైన కారు కన్నా, అతని గుణగణాలకే ఎక్కువ మార్కులు వేస్తాడు. ఇప్పుడైతే కొందరు తండ్రులు బాగా ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తికే తమ కూతురును ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది వేరే విషయం. అయితే ప్రతి తండ్రీ తన అల్లుడిలో కోరుకునే ముఖ్యమైన లక్షణాలేంటో ఇక్కడ చూడండి.
బాధ్యత
జీవితమనే బండిని నడపగల సత్తా అబ్బాయికి ఉందా అని తండ్రి ముందుగా చూస్తాడు. తన భార్యను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా ఆమె కష్టసుఖాల్లో తోడునీడగా, బాధ్యతాయుతమైన భుజంగా నిలబడేవాడే నిజమైన భాగస్వామి. అలాంటి వాడికే తన కూతురిని ఇవ్వాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు.

గౌరవం, మర్యాద
గౌరవం అనేది చదువుతో రాదు సంస్కారంతో వస్తుంది. తన ఫ్రెండ్స్ తో ప్రేమగా ఉంటూ కన్నవారిని, కాబోయే అత్తమామలను గౌరవించలేని వాడికి తన కూతురిని ఎలా ఇవ్వగలడు? అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని, ఆ బంధాన్ని గౌరవించే వ్యక్తిత్వం ఉన్నవాడే ఆ తండ్రి దృష్టిలో ఉత్తముడు. నిజాయితీ, నమ్మకం అనే పునాదుల మీదే ఏ బంధమైనా నిలబడుతుంది.
సహనం
జీవితమన్నాక ఒడిదొడుకులు సహజం. కష్టాలు,సుఖాలు, కోపాలు అన్నీ ఉంటాయి జీవితంలో. కోపం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలా పేలిపోయే వాడితో జీవితం నరకప్రాయం. అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా, కూల్ గా ఆలోచించే ప్రశాంతమైన వ్యక్తి కోసం తండ్రి వెతుకుతాడు. సహనం ఉన్న అబ్బాయికే తన కూతురిని ఇవ్వడానికి ఇష్టపడతాడు.
ఆర్థిక స్థిరత్వం
ఒక తండ్రి అల్లుడి నుండి కోట్లు ఆశించకపోవచ్చు కానీ తన కూతురు ఏ చిన్న అవసరానికైనా ఎవరి ముందూ చేయి చాపాల్సిన దుస్థితి రాకూడదని బలంగా కోరుకుంటాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, సురక్షితమైన భవిష్యత్తు ప్రణాళిక ఉన్న అబ్బాయి అయితే తన కూతురు జీవితానికి ఆర్థిక భరోసా ఉంటుందని నమ్ముతాడు. ఈ రోజుల్లో డబ్బు, పొలం,ఫ్లాట్స్, బ్యాంకె బ్యాలెన్స్ భారీగా ఉంటే చాలు ా ఇంకే లక్షణాలు లేకున్నా అలాంటి అబ్బాయికి తమ బిడ్డను ఇచ్చేందుకు కొందరు తల్లిదండ్రులేు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అందరినీ కలుపుకుపోవడం
అల్లుడు కేవలం తన భార్యకే పరిమితం కాకూడదు. కొత్త ఇంటికి వెళ్లిన తన కూతురితో పాటు, అత్తమామలను కూడా తన తల్లిదండ్రుల్లా భావించాలి. అందరినీ కలుపుకుపోయే లాంటి వాడు కావాలి. జీవితంలో చిన్న చిన్న ఆనందాలను వెతుక్కునేవాడు, ఎలాంటి కష్టంలోనైనా చిరునవ్వు చెదరనివ్వని సానుకూల దృక్పథం ఉన్నవాడు దొరికితే, ఆ తండ్రికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
అందుకే, కాబోయే మామగారిని మెప్పించాలంటే సూట్లు, బూట్లు కాదు, ఈ లక్షణాలు ముఖ్యం.



Click it and Unblock the Notifications