Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Celebrity Divorces: సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎందుకు నిలవడం లేదు? పెళ్లి జరిగిన కొన్నాళ్లకే విడాకులకు కారణమిదేనా!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత తర్వగా అవుతున్నాయో..అంతే త్వరగా పెటాకులవుతున్నాయి. సినీ, క్రీడా,వ్యాపార ఇలా అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీలు కొందరు పెళ్లిళ్లు చేసుకున్న రోజులకే బ్రేకప్ చేప్పుకొని టాటా చెప్పేసుకుంటున్నారు. దేవలోకం భూమికి దిగివచ్చిందా అన్నట్టు అంగరంగ వైభవంగా జరిగే వారి పెళ్లిళ్లు.. కోట్ల రూపాయల ఖర్చు, దేశమంతా మాట్లాడుకునే డిజైనర్ దుస్తులు, అందమైన ప్రదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ లు. సోషల్ మీడియాలో వారి ఫోటోలు చూసి ఆహా,ఓహో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మురిసిపోతుంటాం. వారి ప్రేమకథను మన కథలా భావించి ఆనందపడతాం. అయితే పెళ్లయిన కొన్ని నెలలు గడవకముందే. మేం విడిపోతున్నాం అనే ఒకే ఒక్క సోషల్ మీడియా ప్రకటనతో మన ఆనందాన్ని, భ్రమలను పటాపంచలు చేస్తారు.
సమంత-నాగచైతన్య దంపతులు, ధనుష్-ఐశ్వర్య,హార్థిక్ పాండ్య-నటాశా, సానియా మిర్జా-షోయబ్ మాలిక్, తాజాగా సైనా నెహ్యాల్ కశ్యప్ జంట విడాకుల గురించి చేసిన ప్రకటన అభిమానులను పెద్ద షాక్ ఇచ్చింది. అస్సలు జన్మలో విడిపోరు అనుకున్నోళ్లు కూడా పెళ్లయిన రోజుల వ్యవధిలో విడిపోతున్నారు. అద్భుతమైన ప్రేమకావ్యంగా మొదలైన వీరి ప్రయాణం, అర్ధాంతరంగా ఎందుకు ముగుస్తోంది? సెలబ్రిటీల వైవాహిక బంధాలు గాజు మేడల్లా ఎందుకు కూలిపోతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు చూద్దాం.

భరించలేని ఒత్తిడి,అంచనాలు
సెలబ్రిటీల జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదు. వారి ప్రతి కదలిక మీడియా కంట పడుతుంది. పెళ్లయిన తర్వాత ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంది. పరిపూర్ణ జంటగా కనిపించాలనే సొసైటీ, మీడియా ఒత్తిడి వారిపై తీవ్రంగా ఉంటుంది. కలిసి పార్టీలకు వెళ్లినా, విడిగా కనిపించినా ప్రతిదానికీ ఓ అర్థం తీసి కథనాలు అల్లేస్తారు. ఈ నిరంతర పర్యవేక్షణ వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, బంధంలో సహజత్వాన్ని చంపేస్తుంది. చిన్న చిన్న అభిప్రాయభేదాలు కూడా పెద్దవిగా మారి ఒత్తిడికి దారితీస్తాయి.
అహం, వ్యక్తిత్వం
ఇద్దరు సెలబ్రిటీలు వ్యక్తులు ఒక్కటైనప్పుడు వారిద్దరిలోనూ బలమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ తమ నిర్ణయమే నెగ్గాలనే తపన, నేను గొప్పా? నువ్వు గొప్పా? అనే అహం వారి మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. వివాహ బంధంలో ఒకరి కోసం ఒకరు సర్దుకుపోవడం, తగ్గడం చాలా అవసరం. కానీ తమ కెరీర్ లో ఎప్పుడూ పైచేయి సాధించిన వీరికి, వ్యక్తిగత జీవితంలో తగ్గడం కష్టంగా మారుతుంది. ఈ అహాల ఘర్షణ వారి బంధాన్ని బలహీనపరుస్తుంది.
సమయం లేకపోవడం,జీవనశైలి
సెలబ్రిటీల కెరీర్ చాలా డిమాండింగ్ గా ఉంటుంది. తీరికలేని వర్క్, వేర్వేరు నగరాల్లో, దేశాల్లో నెలల తరబడి పనుల్లో ఉండటం.. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసి గడిపే సమయం చాలా తక్కువ ఉండటం... ఒకరు ఉత్తరాన ఉంటే, మరొకరు దక్షిణాన ఉంటారు. ఈ భౌతిక దూరం క్రమంగా భావోద్వేగ దూరంగా మారుతుంది. ఒకరి కష్టసుఖాలు పంచుకోవడానికి, ఒకరికొకరు అండగా నిలవడానికి సమయం చిక్కదు. ఇది వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ను సృష్టించి, బంధం బీటలు వారడానికి కారణమవుతుంది.\

మీడియా, సోషల్ మీడియా జోక్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో మీడియా జోక్యం మరింత ఎక్కువైంది. వారి మధ్య చిన్న గొడవ జరిగినా అది క్షణాల్లో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. పుకార్లు షికార్లు చేస్తాయి. స్నేహితులతో బయటకు వెళ్లినా, వేరే నటులతో స్నేహంగా మాట్లాడినా... దానికి తప్పుడు రంగు కథనాలు ప్రచురిస్తారు. ఈ నిరంతర నెగెటివిటీ వారి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాన్ని కూడా మీడియా ఇవ్వదు.
అవాస్తవిక అంచనాలు
చాలా సందర్భాల్లో సెలబ్రిటీలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకముందే ప్రేమ మైకంలో పెళ్లి చేసుకుంటారు. గ్లామర్, ఇమేజ్‌ను చూసి ఇష్టపడతారు కానీ, నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, భాగస్వామిలోని లోపాలు తెలిసొచ్చినప్పుడు వారు నిర్మించుకున్న కలల సౌధం పేకమేడలా కూలిపోతుంది. వాస్తవానికి ప్రేమలో ఉన్నప్పటి రొమాంటిక్ ప్రపంచానికి, పెళ్లి తర్వాత బాధ్యతలతో కూడిన జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోవడం కూడా విడాకులకు దారితీస్తుంది.
మనలాంటోళ్లే
సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే. వారికి మనకంటే భిన్నమైన, సంక్లిష్టమైన సవాళ్లు ఉంటాయి. వారి జీవితం నిరంతరం ప్రజల కళ్ల ముందు ఉంటుంది. ప్రేమ, నమ్మకం, సమయం, గౌరవం.. ఏ బంధానికైనా ఇవే పునాదులు. కానీ వెలుగుల ప్రపంచంలో జీవించే తారలకు, ఈ పునాదులను పటిష్టంగా నిర్మించుకునే ఏకాంతం, ప్రైవసీ దొరకడం చాలా కష్టం. అందుకే వారి పెళ్లిళ్లు అట్టహాసంగా మొదలైనా, కథ కంచికి చేరకుండానే ముగిసిపోతున్నాయి. వారి విడాకుల వార్త విన్నప్పుడు విమర్శించడం కన్నా కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.



Click it and Unblock the Notifications