Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
డేటింగ్ లో కొత్త ట్రెండ్...కాంట్రాడేటింగ్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న Gen-Z
మారుతున్న కాలంతో పాటు కాలం మనుషుల లైఫ్ స్టైల్, ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. మానవ సంబంధాల్లో కూడా అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు లవ్ అంటే ఒకేలాంటి ఇష్టాలు, అభిరుచులు ఉన్న ఇద్దరి మధ్య చిగురించే బంధం. అయితే ప్రస్తుతం లవ్ కు కొత్త కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతున్న ఈ కొత్త పదాల్లో ఇప్పుడు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న ట్రెండ్ 'కాంట్రా డేటింగ్'. అసలు ఏంటిది? ఎందుకింత క్రేజ్? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మన కంఫర్ట్ జోన్
సాధారణంగా మనం ఎవరితోనైనా ప్రేమలో పడటానికి లేదా ఫ్రెండ్ షిప్ చేయడానికి మనలాంటి మనస్తత్వం, ఒకే రకమైన ఇష్టాలు, బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారితో కలవడానికే మొగ్గు చూపుతాం. ఎందుకంటే వారితో మనకు సేఫ్ గా, కంఫర్ట్ గా ఉంటుంది. మన ఆలోచనలకు అడ్డు చెప్పరనే భరోసా ఉంటుంది. అయితే ఈ కంఫర్ట్ జోన్ కొన్నిసార్లు మన ఎదుగుదలకు అడ్డుకట్ట వేసి, నిజమైన ప్రేమను కనుగొనకుండా ఆపేస్తుందనేది కాదనలేని నిజం.

కాంట్రా డేటింగ్ అంటే ఏమిటి?
కాంట్రా అంటే వ్యతిరేకం. అంటే మీరు సాధారణంగా ఇష్టపడే టైప్ కు పూర్తిగా భిన్నమైన వ్యక్తితో డేటింగ్ చేయడానికి ధైర్యం చేయడమే కాంట్రా డేటింగ్. ఇది మీ సౌకర్యవంతమైన పరిధిని దాటి, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం లాంటిది. మీరు ఇష్టపడే టైప్ నిజంగా మీ అవసరమా లేక సమాజం, స్నేహితుల ప్రభావంతో ఏర్పడిన అలవాటా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఈ ట్రెండ్ సరికొత్త అనుభవాలకు, విభిన్న దృక్కోణాలకు తలుపులు తెరుస్తోంది.
Gen Z ఎందుకింతగా ఇష్టపడుతోంది?
సంబంధాల విషయంలో Gen Z ప్రయోగాలకు వెనుకాడటం లేదు. వీళ్లు హోదా, నేపథ్యం, భాష వంటి హద్దులను చెరిపేస్తున్నారు. వారికి కావాల్సింది బయటకు కనబడే ఆకర్షణ కాదు, లోతైన భావోద్వేగ బంధం, మానసిక పరిపక్వత. కాంట్రా డేటింగ్ వారికి సరిగ్గా ఇదే అవకాశాన్ని ఇస్తుంది. తమకు ఏమాత్రం పరిచయం లేని ఆలోచనలు, జీవనశైలి ఉన్నవారితో కనెక్ట్ అవ్వడం ద్వారా తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ప్రయోజనాలు
విభిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తితో ప్రయాణం జీవితానికి కొత్త రంగులద్దుతుంది.
వారి సంస్కృతి, అభిరుచులు, దృక్కోణాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
మీరు ఇప్పటివరకూ ఊహించని ఓ కొత్త కోణం మీలో బయటపడవచ్చు. అసలైన మీరు ఎవరో తెలుసుకోవచ్చు.
సవాళ్లు
ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్లే ఇందులోనూ సవాళ్లు తప్పవు. కుటుంబం, సమాజం నుంచి ఒత్తిడి ఎదురుకావచ్చు. పూర్తిగా భిన్నమైన వ్యక్తితో సర్దుకుపోవడం మొదట్లో కష్టంగా ఉండవచ్చు. కానీ నిజాయితీ, ఓపెన్ మైండ్ తో ఈ ప్రయాణాన్ని స్వీకరిస్తే మీ బంధానికి మరింత లోతు, బలం చేకూరుతుంది.
కాంట్రా డేటింగ్ ఎలా మొదలుపెట్టాలి?
మీ టైప్ ఏంటో ఓసారి సమీక్షించుకోండి. ఆ పరిధిని కాస్త విస్తరించండి. డేటింగ్ యాప్ లలో మీ ఫిల్టర్లను కాస్త సడలించండి. కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి, వారిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
మీకు ఏమాత్రం సరిపోడు అనుకున్న వ్యక్తే, మీ జీవితానికి పరిపూర్ణతను ఇచ్చే సరైన వ్యక్తి కూడా కావచ్చు.



Click it and Unblock the Notifications