Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
మొగుడికి లేదు,ప్రియుడికీ లేదు..ఈ వింత ఘటన తెలిస్తే నవ్వాలో,ఏడవాలో తెలియదు!
నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా కథలను మించి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సరిగ్గా అలాంటి వింత ఘటనే జర్మనీలోని స్టట్ గార్ట్ లో చోటుచేసుకుంది. సంతానం కోసం ఒక భర్త తీసుకున్న విపరీత నిర్ణయం చివరికి ఊహించని మలుపు తిరిగి కోర్టు మెట్లెక్కేలా చేసింది. అసలేం జరిగిందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.
అసలేం జరిగింది
స్టట్ గార్ట్ నగరంలో డెమెట్రియస్ సోపౌలోస్, అతని భార్య ట్రౌట్ నివసిస్తున్నారు. వీరిది అన్యోన్య దాంపత్యం. ట్రౌట్ మామూలు గృహిణి కాదు, ఆమె అందాల పోటీల్లో పాల్గొన్న సుందరి. పెళ్లయి కొన్నేళ్లు గడుస్తున్నా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. వైద్య పరీక్షలు చేయించుకోగా డెమెట్రియస్ కి వంధ్యత్వ సమస్య ఉందని అతను తండ్రి కాలేడని డాక్టర్లు తేల్చారు.

వింత ఒప్పందం
డెమెట్రియస్.. తన భార్య గర్భం దాల్చడానికి ఒక వింత మార్గాన్ని ఎంచుకున్నాడు. తన పొరుగున ఉండే ఫ్రాంక్ మౌస్ అనే యువకుడిని సంప్రదించాడు. తన భార్యతో శృంగారంలో పాల్గొని, ఆమెకు బిడ్డను ఇస్తే 2500 డాలర్లు ఇస్తానని డెమెట్రియస్ ఆఫర్ చేశాడు.
మొదట ఫ్రాంక్ భార్య దీనికి ఒప్పుకోకపోయినా కేవలం డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నానని ఫ్రాంక్ ఆమెను ఒప్పించాడు. అలా డెమెట్రియస్, ఫ్రాంక్ మధ్య ఒక లిఖితపూర్వక ఒప్పందం కుదిరింది.
6 నెలల నిరీక్షణ
ఒప్పందం ప్రకారం ఫ్రాంక్ తన పని మొదలుపెట్టాడు. వారానికి మూడుసార్లు డెమెట్రియస్ ఇంటికి వెళ్లేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు నెలలు గడిచాయి. లెక్క ప్రకారం దాదాపు 72 సార్లు వారి మధ్య కలయిక జరిగింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ట్రౌట్ గర్భం దాల్చలేదు.
ఊహించని ట్విస్ట్
ఆరు నెలలైనా శుభవార్త వినబడకపోయేసరికి డెమెట్రియస్ కు కోపం కట్టలు తెంచుకుంది. అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఫ్రాంక్ ను కూడా వైద్య పరీక్షలు చేయించుకోమని గట్టిగా డిమాండ్ చేశాడు. ఆ పరీక్షల రిపోర్ట్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అసలు విషయం ఏంటంటే..భర్త డెమెట్రియస్ లాగానే, పొరుగువాడు ఫ్రాంక్ కూడా వంధ్యత్వంతో బాధపడుతున్నాడు. అతనికి కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది. ఈ విషయం బయటపడగానే ఫ్రాంక్ భార్య మరో బాంబు పేల్చింది. తమకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఫ్రాంక్ రక్తం పంచుకు పుట్టలేదని, వేరే వారి ద్వారా తాను గర్భం దాల్చానని ఒప్పుకుంది.
కోర్టులో విచారణ
దీంతో మోసపోయానని గ్రహించిన డెమెట్రియస్ కోర్టును ఆశ్రయించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించారని, తన డబ్బు తనకు ఇప్పించడంతో పాటు నష్టపరిహారం కావాలని ఫ్రాంక్ పై కేసు వేశాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే ఇలాంటి అనైతిక ఒప్పందాలు చట్టబద్ధం కావని, అసలు ఈ కేసు చెల్లుతుందా అని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం.
మొత్తానికి బిడ్డ కోసం పొరుగువాడిని నమ్ముకుంటే.. అసలుకే ఎసరు వచ్చినట్లయింది డెమెట్రియస్ పరిస్థితి. ఈ వింత ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications