Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పెళ్లి కాని జంటలు హోటల్ రూమ్ కి వెళ్తున్నారా? ఒక్క నిమిషం ఆగి ఇది చూడండి..లేకుంటే అస్సామే!
పెళ్లి కాని జంటలు హోటల్ రూమ్ బుక్ చేయడం అనేది ఒకప్పుడు పెద్ద నేరమైన విషయంగా భావిస్తుండేవాళ్లు. అయితే ఇప్పుడది సర్వసాధారణం అయింది. ఫ్రెండ్స్ తో లేదా లవర్స్ కలిసి టూర్స్ కు వెళ్లడం, లేదా కొత్త ప్లేస్ లకు వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా పెళ్లికాని జంటలు హోటల్ గదిని బుక్ చేసుకునేటప్పుడు కొన్ని కీలకమైన విషయాలను గమనించకపోవడం వల్ల చెక్ ఇన్ సమయంలో లేదా బస చేస్తున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గోప్యతకు భంగం కలగడం, అనవసరమైన చట్టపరమైన చిక్కులు, అవమానకరమైన పరిస్థితులు వంటివి ఎదురవుతున్నాయి. కాబట్టి హోటల్ బుకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
అసలు పెళ్లికాని జంటలు హోటల్ లో బస చేయవచ్చా? చట్టం ఏం చెబుతోంది?
మనదేశంలో పెళ్లికాని జంటలు హోటల్ లో కలిసి ఉండటంపై చాలామందిలో అపోహలు, అయోమయం నెలకొని ఉన్నాయి. వాస్తవానికి భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు (స్త్రీ, పురుషుడు) పరస్పర అంగీకారంతో ఒకే హోటల్ గదిలో బస చేయడం చట్టవిరుద్ధం కాదు. చట్టం మిమ్మల్ని నిరోధించదు. అయితే హోటళ్లు తమ సొంత నిబంధనలు, పాలసీలను కలిగి ఉండే హక్కును కలిగి ఉంటాయి. కొన్ని హోటళ్లు ఫ్యామిలీ ఓన్లీ పాలసీ కారణంగా పెళ్లికాని జంటలను అనుమతించకపోవచ్చు. కాబట్టి చట్టపరంగా మీకు హక్కు ఉన్నప్పటికీ హోటల్ నిబంధనలను గౌరవించడం ముఖ్యం. మీ ఇద్దరి వయసు 18 ఏళ్లు పైబడి, మీ దగ్గర చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటే మీరు చట్టబద్ధంగా హోటల్ లో బస చేయవచ్చు.

పెళ్లికాని జంటలు పాటించాల్సిన 7 ముఖ్య సూత్రాలు
కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ మాత్రమే ఎంచుకోండి
ప్రతి హోటల్ జంటలకు అనుకూలంగా ఉండదు. కొన్ని హోటళ్లు పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. దీంతో చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనవసరమైన వాదనలు, అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసేటప్పుడు కపుల్ ఫ్రెండ్లీ ఫిల్టర్ ను ఉపయోగించండి. మేక్ మై ట్రిప్, గో అబిబో, అగోడా వంటి యాప్ లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది మీకు సరైన హోటల్ ను సులభంగా ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
హోటల్ రివ్యూలను క్షుణ్ణంగా చూడండి
ఒక హోటల్ మీకు నచ్చిన తర్వాత వెంటనే బుక్ చేయకండి. ముందుగా ఆ హోటల్ పేరును గూగుల్ లో వెతికి, దాని రివ్యూస్ ని చదవండి. ముఖ్యంగా ఇతర జంటలు పోస్ట్ చేసిన రివ్యూలపై దృష్టి పెట్టండి. వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? హోటల్ సిబ్బంది ప్రవర్తన, గదుల శుభ్రత, భద్రత, గోప్యత వంటి విషయాలపై వారు ఏం చెప్పారో గమనించండి. నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా ఉంటే ఆ హోటల్ ను వదిలివేయడం బెటర్.
హోటల్ పాలసీని తప్పనిసరిగా చదవండి
ప్రతి హోటల్‌కు ఒక పాలసీ ఉంటుంది. బుకింగ్ కన్ఫర్మ్ చేసే ముందు ఆ పాలసీని పూర్తిగా చదవండి. కొన్ని హోటళ్లు పెళ్లికాని జంటల కోసం ప్రత్యేక నిబంధనలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, 'స్థానిక ఐడీలు అంగీకరించబడవు' (Local IDs not accepted) అనే నిబంధన ఉండవచ్చు. అంటే, మీరు నివసిస్తున్న నగరంలోని ఐడీతో అదే నగరంలోని హోటల్‌లో బస చేయలేరు. పాలసీలో ఏదైనా అనుమానాస్పదంగా లేదా మీకు అసౌకర్యంగా అనిపిస్తే, వేరే హోటల్‌ను వెతకండి.
సేఫ్ ప్లేస్ లో ఉన్న హోటల్ ను ఎంచుకోండి
హోటల్ ఉన్న లొకేషన్ చాలా ముఖ్యం. అది నగరంలో రద్దీగా, సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఉందా లేదా అని గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేయండి. మారుమూల ప్లేస్ లలో, నగర శివార్లలో, చీకటి సందులలో ఉన్న హోటళ్లకు దూరంగా ఉండండి. రాత్రిపూట కూడా సులభంగా చేరుకోగలిగే, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండే ప్లేస్ లోని హోటల్ ఎల్లప్పుడూ సేఫ్ గా ఉంటుంది.

భద్రతా ఏర్పాట్లను పరిశీలించండి
మీ భద్రత, గోప్యత విషయంలో అస్సలు రాజీ పడకండి. హోటల్ లాబీ, కారిడార్లు, ప్రవేశ ద్వారాల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? 24 గంటల సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? వంటి విషయాలను ఆన్ లైన్ లో లేదా ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి. భద్రతాపరమైన ఏర్పాట్లు సరిగా లేని హోటళ్లలో మీ గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఎక్కువ.
ఇద్దరి గుర్తింపు కార్డులు తప్పనిసరి
ఇది అత్యంత ముఖ్యమైన నియమం. ఆన్ లైన్ లో బుక్ చేసినప్పటికీ చెక్ ఇన్ సమయంలో జంటలు ఇద్దరూ తమ తమ ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డులను సమర్పించాలి. కేవలం ఒక్కరి ఐడీతో ఇద్దరూ చెక్ ఇన్ అవ్వడం సాధ్యం కాదు, ఇది హోటల్ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ప్రయాణానికి ముందే ఇద్దరి దగ్గర చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డులు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది.
నమ్మకమైన వెబ్ సైట్, యాప్ ద్వారానే బుక్ చేయండి
వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలలో వచ్చే చౌక ఆఫర్లను చూసి మోసపోకండి. తెలియని ఏజెంట్ల ద్వారా లేదా గుర్తింపు లేని చిన్న హోటళ్లను నేరుగా సంప్రదించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా పేరున్న, విశ్వసనీయమైన బుకింగ్ వెబ్ సైట్ లు లేదా యాప్ ల ద్వారా మాత్రమే మీ గదిని బుక్ చేసుకోండి. దీనివల్ల మీ బుకింగ్ భద్రంగా ఉండటమే కాకుండా ఏదైనా సమస్య వస్తే కస్టమర్ సపోర్ట్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications