Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రేమలో ఉన్నారా? అయితే అబ్బాయిలు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
ప్రేమలో పడటం ఒక అందమైన అనుభూతి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడం ఒక కళ. బలమైన బంధాన్ని నిర్మించడం అంత ఈజీ విషయం కాదు. అబ్బాయిలు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వారికి పెద్దవిగా అనిపించకపోవచ్చు కానీ అమ్మాయిల దృష్టిలో అవి రిలేషన్ ను నాశనం చేస్తాయి. మీరు కూడా ఒక మంచి భాగస్వామిగా మారి మీ జీవితంలోకి నిజమైన ప్రేమను ఆహ్వానించాలనుకుంటే 5 తప్పులకు దూరంగా ఉండాలి.
నేనే తోపు అనే అహంకారం
కొంతమంది అబ్బాయిలు యాటిట్యూడ్ చూపిస్తే అమ్మాయిలు పడిపోతారని భ్రమలో ఉంటారు. కానీ మీలోని ఆ నకిలీ గర్వాన్ని అమ్మాయిలు ఇట్టే పసిగట్టేస్తారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి అవ్వాలని చూడటం, ఇతరులను కించపరుస్తూ మిమ్మల్ని మీరు పొగుడుకోవడం ఆత్మవిశ్వాసం కాదు, అహంకారం. తమను తాము హీరోలుగా ఊహించుకునే అబ్బాయిల నుంచి అమ్మాయిలు వంద అడుగుల దూరం పాటిస్తారు.

శుభ్రతను గాలికి వదిలేయడం
మీరు నీటుగా లేకపోవడం అమ్మాయిలకు అస్సలు నచ్చదు. మురికి గోళ్లు, చెమట వాసన కొట్టే బట్టలు, చింపిరి జుట్టు ఇవి మిమ్మల్ని కేవలం సోమరిపోతుగా మాత్రమే కాదు, బాధ్యత లేని వ్యక్తిగా కూడా చూపిస్తాయి. అమ్మాయిలు ఎప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా, తమను తాము జాగ్రత్తగా చూసుకునే అబ్బాయిలనే ఇష్టపడతారు. మీ రూపం కన్నా మీ శుభ్రత మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
అబద్ధాలు, అనవసరపు సాకులు
ఒక్క అబద్ధం చాలు, నమ్మకం అనే సౌధాన్ని కూల్చేయడానికి.. చిన్న విషయానికి కూడా కల్లబొల్లి కబుర్లు చెప్పడం, తప్పు చేసి దొరికిపోయినప్పుడు సాకులు వెతకడం వంటివి చేస్తే మీపై వారికి ఉన్న గౌరవం పోతుంది. మీ మాటల్లో నిజాయితీ లేనప్పుడు మీ బంధానికి భవిష్యత్తు లేదని అమ్మాయిలు సులభంగా అర్థం చేసుకుంటారు. ఏ బంధానికైనా పునాది నమ్మకమే.
స్త్రీలను గౌరవించకపోవడం
నా ఇష్టం, నా నిర్ణయం అనుకుంటూ అమ్మాయిల అభిప్రాయాలకు, ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వకపోవడం చాలా పెద్ద తప్పు. తనను చులకనగా చూసే తన ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యక్తితో ఏ అమ్మాయి కూడా జీవితాన్ని పంచుకోవాలనుకోదు. బంధంలో ఇద్దరూ సమానమే. స్త్రీని బలహీనమైనదిగా లేదా తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ఆమె గమనిస్తే మీతో భవిష్యత్తును ఊహించుకోవడానికి కూడా ఇష్టపడదు.
అతి ప్రేమ పేరుతో బంధించడం
ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? ఎవరితో మాట్లాడుతున్నావ్? అంటూ ప్రతిక్షణం తనను నియంత్రించాలని చూడటం ప్రేమ కాదు, జైల్లో పెట్టడం. అతిగా పొసెసివ్‌గా ఉండటం వల్ల ఆమె మీ ప్రేమలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరం, అది బంధంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యం. మీ ప్రవర్తనతో ఆమెకు స్వేచ్ఛ లేకుండా చేస్తే, ఆ బంధం నుంచి బయటపడటానికే ప్రయత్నిస్తుంది.



Click it and Unblock the Notifications