Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శృంగారం విషయంలో హద్దులు గీసుకుంటున్నారా.. అయితే వాటిని పక్కన పెట్టి పడక సుఖం పొందాల్సిందే
సెక్స్.. ఈ పదం వింటే చాలు చాలా మంది ఏదో అపచారం జరిగిపోయినట్లుగా ఫీలవుతుంటారు. అంతేనా గిరి గీసుకొని కూర్చుంటారు. పెళ్లికి ముందు ఈ విషయాల గురించి కనీసం ఎవరి ముందు మాట్లాడకూడదని అనుకుంటారు. అలా చేస్తే ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా భయపడిపోతుంటారు. నిజానికి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం.
ప్రతీ ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. లేకపోతే పెళ్లి తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడ వాళ్లు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. గిరి గీసుకొని కూర్చొని ఉంటారు. పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో భర్తకు సపోర్ట్ చేసినప్పటికీ... సెక్స్ లో కొన్నింటిని అస్సలే ఆస్వాదించరు.

టీవీలు, సినిమాల్లో చూసిందే నిజం కాదండోయ్..!
వాటిని చేయమని మారాం చేస్తుంటారు. అస్సలే ఇంట్రెస్ట్ చూపించరు. తద్వారా భాగస్వామి ఫీలవ్వడం, ఏదో చేస్తున్నామా అంటే చేసేస్తున్నాం అన్నట్లుగానే ఉంటారు. కానీ దీన్నంతటినీ పక్కన పెట్టి చాలా బోల్డ్ గా బిహేవ్ చేయండి. మీకు నచ్చినట్లుగా, మీ భాగస్వామి నచ్చినట్లుగా పడక సుఖాన్ని పండగలా మార్చుకోండి. ముఖ్యంగా స్త్రీలూ.. కంఫోర్ట్ జోన్ వదిలి బయటకు రండి. సెక్స్ అనేది మానసికంగా ఉండే ప్రేమను శారీరకంగా చూపిస్తూ ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకుపోవడమే. దీన్ని దోషరహితంగా అమలు చేయాలి. చాలా మంది వాస్తవానికి సెక్స్ అనేది ఏంటో తెలుసుకోకుండా టీవీల్లో, సినిమాల్లో చూపించిందే నిజం అని నమ్మతుంటారు. కాబట్టి ముందు వాటిని ఎలా ఎదుర్కోవాలో నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సిగ్గూ, ఎగ్గు పక్కన పెట్టేయాల్సిందే..!
సెక్స్ విషయం సిగ్గు, ఎగ్గూ పక్కన పెట్టేసి మనసు చెప్పేది మాత్రమే చెప్పాలి. మీకున్న ఫాంటసీలన్నీ తీర్చుకోవాలి. మీభాగస్వామిని కూడా ఉత్తేజ పరిచేలా చాలా కొత్తగా ట్రై చేయాలి. భాగస్వామికి నచ్చినట్లుగా చేయడం అస్సలే మర్చిపోవద్దు. వారి ఇష్టాఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించాలి. మీ ఇష్టాలను, ఫాంటసీలను వివరిస్తూనే.. ఎప్పుడూ రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేయాలి. మీరే ప్రత్యేక చొరవ తీసుకొని రోల్ ప్లే చేయడం, డిఫరెంట్ పొజిషన్స్ ప్రయత్నంచడం లాంటివి చేస్తుండాలి.
తరచుగా కొత్త పొజిషన్స్..
మీకు ఇష్టమైన కోరికలను అన్వేషించి వాటిని తీర్చుకోవడం వల్ల సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ చాలా మంది జంటలు ఎప్పుడూ ఒకేలా చేసుకుంటూ ఉంటాయి. కాస్త కంఫర్ట్ గా అనిపించడంతో ఎప్పుడూ దాన్నే ట్రై చేస్తారు. కానీ కాస్త కష్టంగా అనిపించినా కొత్తగా ట్రై చేయడమే బెటర్. మీ ఇష్టాలను మనసులోనే దాచుకొని భయంగా ఉంటే సుఖమైన పడక జీవితాన్ని పొందలేరు. కొత్త కొత్త ప్రయోగాలకు దూరంగా ఉన్నప్పుడు వారిని ఉత్తేజపరిచే, సంతోషపెట్టే వాటిని అస్సలే కనుగొనలేరు.
భాగస్వాములను బాగా అర్థం చేసుకునే మార్గమిదే..!
విభిన్న స్థానాలు, బొమ్మలు, సాంకేతికతలతో ప్రయోగాలు చేయడం వల్ల వ్యక్తులు వారి శరీరాలు ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటారు. అలాగే భాగస్వాములతో మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడతారు. దీన్ని ఎప్పుడూ ఇలాగే కొనసాగిస్తూ ఉండాలి. కంఫోర్ట్ జోన్ లోనే ఉంటే మీకు సుఖముండదు. మీ భాగస్వామికి ఉండదు. తద్వారా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వాటిని దూరం చేసుకోండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడమంటే... మీకు ఇష్టమైన ఆహారానికి అదనపు మసాలా యాడ్ చేయడం వంటిదే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications