Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అన్నదమ్ములని పెళ్లి చేసుకున్న యువతి.. నేటికీ సజీవంగా ఉన్న ద్రౌపది ఆచారం..ఎక్కడంటే..
ఇద్దరు అన్మదమ్ములు కలిసి ఒకే మహిళను పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈమెను కలియుగ ద్రౌపదిగా అభివర్ణిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు వీరి జీవితంపై నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకించేటోళ్లు కూడా కొందరు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా అసలు ఈ వివాహం తర్వాత బయట ప్రపంచానికి తెలియని కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారని మనందరికీ తెలిపిన విషయమే. అయితే ఆ పురాణ గాథలోని సంప్రదాయం నేటికీ భారతదేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో సజీవంగా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
కలియుగ ద్రౌపదులు ఇక్కడ ఉంటారు
చట్టప్రకారం బహుభర్తృత్వం నేరమైనప్పటికీ హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో హట్టి తెగ ప్రజలు ఈ ఆచారాన్ని గర్వంగా పాటిస్తున్నారు. బహుభర్తృత్వం అనేది ఒక ఆచారం. ఈ ఆచారం ప్రకారంఒక స్త్రీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలను వివాహం చేసుకుంటుంది.షిల్లాయ్ గ్రామానికి చెందిన హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ప్రదీప్ నేగి, కపిల్ నేగి, కున్హాట్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను జూలై 12 నుండి 14 వరకు ట్రాన్స్ గిరి ప్రాంతంలో జరిగిన ఒక వేడుకలో వివాహం చేసుకున్నారు, ఈ వేడుకకు వందలాది మంది సాక్షులుగా నిలిచారు. ప్రదీప్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా అతని తమ్ముడు కపిల్ ఫారిన్ లో ఉద్యోగం చేస్తున్నాడు.ఈ నిర్ణయం తాము ఎటువంటి ఒత్తిడి లేకుండా తీసుకున్నామని, తమ కుటుంబాల నుండి అనుమతి పొందామని వధూవరులు తెలిపారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహుభర్తృత్వ వివాహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

సామాజిక, ఆర్థిక కారణాలు
స్థానికంగా జోడిదరన్ లేదా ద్రౌపది ప్రథ అని పిలువబడే ఈ సంప్రదాయం వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. కుటుంబ ఆస్తులు, పూర్వీకుల నుంచి వస్తున్న భూములు అన్నదమ్ముల మధ్య చీలిపోకుండా ఉండటమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశం. అన్నదమ్ములు ఒకే భార్యను పంచుకోవడం ద్వారా కుటుంబం ఐక్యంగా ఉంటుందని, భూమి చెక్కుచెదరకుండా తమ దగ్గరే ఉంటుందని వారు బలంగా నమ్ముతారు. ఒక సోదరుడికి అనుకోని ప్రమాదం జరిగినా మరొకరు కుటుంబాన్ని, భార్యను ఆదుకుంటారు. ఇది వారి దృష్టిలో కుటుంబ ఐక్యతకు, భద్రతకు ప్రతీకగా చెబుతుంటారు.
1,300 చదరపు కిలోమీటర్ల ట్రాన్స్-గిరి ప్రాంతంలో 154 పంచాయతీలు ఉన్నాయి, వాటిలో 147 లో హట్టి కమ్యూనిటీ ఉంది. అయితే ఈ డిజిటల్ యుగంగలో యువత చదువుకుని, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్తుండటంతో జోడిదరన్ ఆచారం నెమ్మదిగా కనుమరుగవుతోంది. చట్టపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, గిరిజన ఆచారాలను పరిరక్షించే నిబంధనలు తమకు అండగా ఉన్నాయని స్థానికులు వాదిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జోడిదార్ చట్టం కింద ఈ ఆచారానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. ఒకవైపు సంప్రదాయ పరిరక్షణ, మరోవైపు ఆధునిక విలువల మధ్య హట్టిల ద్రౌపది ప్రథ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత 6 ఏళ్లుగా ఇలాంటి వివాహాలు కేవలం కొన్ని మాత్రమే ఈ తెగలో జరిగాయి.
ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక ప్రాంతం యొక్క చరిత్ర, జీవన పరిస్థితులు, సామాజిక అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఈ వింత సంప్రదాయం మన దేశంలో ఉన్న వైవిధ్యాన్ని, విభిన్న జీవనశైలిని మరోసారి గుర్తు చేస్తుంది.



Click it and Unblock the Notifications











