Latest Updates
-
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.!
Coconut Oil As Lube: శృంగారంలో కొబ్బరి నూనెను లూబ్రికెంట్‌గా వాడొచ్చా?
శృంగారం సమయంలో కొన్నిసార్లు లూబ్రికెంట్ వాడాల్సి వస్తుంది. యోని డ్రై గా ఉన్నప్పుడు సంభోగం నొప్పిని కలిగిస్తుంది. అలాంటి సమయంలో లూబ్రికెంట్ వాడాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. దీని వల్ల సెక్స్ చాలా సౌకర్యవంతంగా సాగుతుంది. సంభోగం ఎలాంటి నొప్పిని కలిగించకుండా సంతృప్తిగా, ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే చాలా మంది లూబ్రికెంట్ వాడుతుంటారు. శృంగారంలో వాడే లూబ్రికెంట్లు మార్కెట్ లో చాలానే ఉంటాయి.
నీటి ఆధారిత, చమురు ఆధారిత లూబ్రికెంట్లు మార్కెట్ లో దొరుకుతాయి. అయితే కొన్ని సార్లు అనుకోని శృంగారంలో పాల్గొన్న సమయంలో లేదా కావాలనే కొందరు లూబ్రికెంట్ల స్థానంలో కొబ్బరి నూనె వాడుతుంటారు. ఇంట్లో జుట్టుకు, చర్మానికి, ఇతర అవసరాలకు వాడే కొబ్బరి నూనెను లూబ్రికెంట్ గా వాడి సెక్స్ చేస్తుంటారు.

కొబ్బరి నూనె సెన్సేషన్ ను మెరుగుపరుస్తుంది. ఎక్కువ సేపు శృంగారం చేసుకునేందుకు సహాయపడుతుంది. మార్కెట్ లో లభించి ఇతర లూబ్రికెంట్ల మాదిరిగానే కొబ్బరి నూనెతో సెక్స్ చాలా ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఇలా కొబ్బరి నూనెను లూబ్రికెంట్ గా వాడొచ్చా.. ఇలా వాడటం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.. వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె వాడటం సురక్షితమేనా?
శృంగారంలో లూబ్రికెంట్ గా కొబ్బరి నూనె వాడటం సురిక్షితమే. నిరభ్యంతరంగా కొబ్బరి నూనెను లూబ్రికెంట్ గా వాడొచ్చు. కొబ్బరి నూనె చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎక్కువసేపు ఉండేందుకు సహాయపడుతుంది. మార్కెట్ లో లభించే ఇతర లూబ్రికెంట్ల మాదిరిగానే సంతృప్తిని అందిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
లూబ్రికెంట్స్ కంటే కూడా..:
కొబ్బరి నూనెను లూబ్రికెంట్ గా వాడటం చాలా సౌకర్యంగా ఉంటుంది. నీరు లేదా సిలికాన్ ఆధారిత కృత్రిమ లూబ్ లతో పోలిస్తే కొబ్బరి నూనె మందంగా, ఎక్కువ సేపు ఉంటుంది. స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది లూబ్రికెంట్లు లాగా క్లంప్సీ గా ఉండకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు:
- కొబ్బరి నూనెను రబ్బరు పాలు కండోమ్‌లతో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆయిల్ కండోమ్ లోని రబ్బరు పాలును క్షీణింపజేస్తుంది.
- లేటెక్స్ కండోమ్ లతో నీటి ఆధారిత లేదా సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లను మాత్రమే ఉపయోగించాలి.
- కొబ్బరి నూనెను పాలియురేతేన్ కండోమ్ లతో మాత్రమే లూబ్ గా ఉపయోగించాలి.
- ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే కొబ్బరి నూనెను ల్యూబ్ గా ఉపయోగించడం మంచిది కాదు. ఇది యోని యొక్క pH బ్యాలెన్స్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications