Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లేట్‌గా పెళ్లి చేసుకుంటే సెక్స్ సమయంలో సమస్యలొస్తాయా?
చాలా కారణాల కొందరికి పెళ్లి కాస్త ఆలస్యంగా జరుగుతుంది. 30 ఏళ్లలోపు కావాల్సిన వివాహ కార్యం.. కొందరికి 35 ఏళ్లకు అవుతుంది. వయస్సు మీద పడే కొద్దీ ఆ ప్రభావం శృంగారంపైనా పడుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఎప్పుడు కావాల్సిన పని అప్పుడు అయితేనే అన్నీ సక్రమంగా సాగుతాయని. లేట్ అయ్యే కొద్దీ సమస్యలు తలెత్తుతూ ఉంటాయని చెబుతున్నారు.

దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచే వాటిల్లో శృంగారం అత్యంత ముఖ్యమైనది. లైంగిక జీవితంలో లేని వివాహ జీవితం ఎక్కువ రోజులు ఉండదనేది నిపుణులు చెప్పే మాట. దంపతుల మధ్య సాన్నిహిత్యమే వారి బంధాన్ని బలోపేతం చేస్తుంది. వ్యక్తీకరించలేని ప్రేమను శృంగారం వ్యక్తపరుస్తుంది అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. శృంగారానికి సంబంధించి సందేహాలు, అనుమానాలు, అపోహలు చాలా మందికి ఉంటాయి. పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ ఆ సమస్యలు మరింతగా పెరిగిపోతుంటాయని అంటున్నారు నిపుణులు.
ఆలస్యంగా పెళ్లి జరిగితే శృంగారాన్ని ఆస్వాదించలేరా.. భాగస్వామిని సంతృప్తి పరచలేరా.. సెక్స్ హార్మోన్లు తగ్గి కోరికలు తగ్గిపోతాయా.. ఎక్కువ సేపు సెక్స్ చేసేందుకు శరీరం మనసు సహకరించవా.. ఇలాంటి అపోహలు, అనుమానాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికే వృద్ధాప్యం మనసుకు కాదు:
సాధారణంగా శరీరానికి వృద్ధాప్యం వస్తుందని కానీ మనసుకు రాదని అంటున్నారు నిపుణులు. శారీరకంగా చురుకుగా ఉండటం మనసును మరింతగా ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మనసులో శృంగార పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయని.. మానసికంగా శృంగారం కావాలనుకుంటే అందుకు తగ్గట్లుగా మెదడు స్పందించి హార్మోన్లను విడుదల చేస్తుందని చెబుతున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. దాని వల్ల ఏ వయస్సు వారు అయినా.. సెక్స్‌ను చక్కగా ఆస్వాదించవచ్చని అంటున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు, 35 ఏళ్లు దాటిన వారు.. కుర్రాళ్లలా ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోవచ్చు, అనేక సార్లు సెక్స్‌లో పాల్గొనలేకపోవచ్చు కానీ శృంగారాన్ని బాగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
70, 80 ఏళ్లు వచ్చినా సెక్స్ చేయవచ్చు:
మగవాళ్లు అయితే 70, 80 ఏళ్లు వచ్చినా.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సహకరిస్తే.. శృంగారంలో పాల్గొని ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు సినాఫిల్ వంటి మాత్రలు వాడితే మరింత ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. స్త్రీలలో కూడా ఆరోగ్యం బాగుంటే.. ఎంత వయస్సు వచ్చినా సెక్స్‌లో సంతృప్తిని పొందవచ్చని వివరిస్తున్నారు. అయితే యువతీ యువకులతో, మధ్యవయస్కులతో పోలిక మాత్రం వద్దని చెబుతున్నారు.
సెక్స్‌లో విఫలం కావడానికి కారణాలు:
మనసు పడిన అమ్మాయితో సెక్స్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. తీరా శృంగారం చేసుకునే సమయంలో కంగారు, బెరుకు, అమ్మాయిని సంతృప్తి పరచగలనా లాంటి అనుమానాలతో ఒత్తిడి ఎదుర్కొని సెక్స్‌లో విఫలం అయిపోతుంటారు. దీని వల్ల మరింత ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడితో మళ్లీ సెక్స్‌లో ఫెయిల్ అవుతారు. ఇదో సర్కిల్ లా బాధిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఈ సమస్యనే యాంగ్జైటీ డిజార్డర్ అని పేర్కొంటున్నారు వైద్యులు. అమ్మాయిని సెక్స్ లో సంతృప్తి పరచగలనా, ఆమె అంచనాలను అందుకోగలనా అనే అనుమానాలే ఈ సమస్యకు కారణమని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. సెక్స్ సమయంలో ఆందోళన, అనుమానాల వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదల అవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్లు అంగం గట్టిపడకుండా చేస్తాయి. అందుకే సెక్స్ సమయంలో ప్రశాంతంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కనబరచాలని అంటారు నిపుణులు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications