Latest Updates
-
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
భార్యా భర్తలు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి..! అవేంటో మీరే తెలుసుకోండి..!
జీవితంలో ఎన్నో మధుర ఘ్నాపకాలు వుంటాయ్. పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత ఆ మధుర ఘ్నాపకాలు మరింత ఎక్కువగా వుంటాయ్. ఒక వేల ప్రేమించి వివాహం చేసుకుంటే కలిసి తిరిగి రోజులు, ఆ తేదీలూ, సమయం ఎప్పటికీ గుర్తిండిపోతాయ్. అవి మన జీవితంలో పండగకు ఏమాత్రం తక్కువగా కాదు. అలాంటి రోజులకు ఘ్నాపకం చేసుకుంటూ భార్యా భర్తలిద్దరూ కలిసి వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్, బంధం మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. ఇద్దరూ మరింత దగ్గరై, వారి మధ్య ప్రేమ మరింత చిగురిస్తుంది. అయితే ఆ రోజులేంటి, వేటిని భార్యా భర్తలు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

1. మొదటి సారి కలిసిన క్షణాలు, ప్రదేశం
భార్యా భర్తలిద్దరూ మొదటిసారి ఎక్కడో ఒక దగ్గర కలిసే వుంటారు. అది ప్రేమవివాహమైనా సరే లేదంటే పెద్దలు కుదిర్చిన సంబంధమైనా సరే. దానికి ఒక రోజు కూడా వుంటుంది. ఆ రోజు మాట్లాడుకున్న విషయాలను కూడా ఇద్దరికీ ఎప్పటికీ గుర్తిండే వుంటాయ్. వాటిని ఆ రోజు లేదా ఆ ప్రదేశంలో గుర్తుచేసుకొని ఒక వేడుకలా దంపతులు జరుపుకోవచ్చు. ఇది ఇద్దరిలో ఆనందాన్ని, సంతోషాన్ని మరింత పెంచుతుంది.
2. ఒక రోజు మొత్త గడిపిన క్షణాలు
భాగస్వామితో కలిసి మొదటి సారి ఏదైనా ప్రదేశానికో లేదంటే టూర్‌కో వెళ్లి వుంటారు. అది పెళ్లి తరువాత హనీమూన్ అయినా కావచ్చు. అప్పటి రొమాంటిక్ ఘ్నాపకాలు, గుర్తులు మీకు ఎన్నో వుంటాయ్. అవి జరిగిన రోజు గనుక మీకు గుర్తుకువుంటే ఇద్దరూ కలిసి దాన్ని రొమాంటిక్‌గా జరుపుకోండి.
3. పెళ్లి వార్షికోత్సవం
పెళ్లి వార్షికోత్సవమనేది పెద్ద వేడుక పండగ లాంటిది. భార్యా భర్తల జీవితంలో దీనికంటే ముఖ్యమైన రోజు ఇంకేమి వుంటుంది. ఆ రోజు మంచి వంట వండుకొని రొమాంటిక్‌గా రోజంతా వేడుక చేసుకోండి. కుదిరితే బయటకు ఒక్కడికైనా టూర్‌ను ప్లాన్ చేసుకోండి. ఆఫీస్‌కు ప్రత్యేకంగా సెలవు పెట్టి మరీ మీరు కచ్ఛితంగా ఈ వేడుకను జరుపుకోవాల్సిందే. వివాహ వార్షికోత్సవమనేది సంవత్సరంలో ఒకసారే వస్తుంది. మీ దాంపత్య జీవితం మరింత సంతోషంగా సాగడానికి ఈ వివాహ వార్షికోత్సవం కూడా ఒక వారధిగా వుంటుంది.

4. రెండు కుటుంబాలూ కలుసుకున్న రోజు
పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు ఎక్కడో ఒక దగ్గర కలుసుకొని వుంటారు. ఆ తేదీకూడా మీకు గుర్తువుండే వుంటుంది. ఆ తేదీ రోజున ఇరు కుటుంబాలు మళ్లీ కలిసి భోజనం చేయడం లాంటిది కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఇద్దరి కుటుంబాలు మరింత దగ్గరౌతాయ్.
5. నిశ్చితార్ధం చేసుకున్న రోజు
పెళ్లికి ముందు నిశ్చితార్ధం జరుగుతుంది. ఆ రోజును కూడా ఒక పెద్ద వేడుకలా మీరు జరుపుకోవాలి. ఆ రోజు నుంచి మీరిద్దరూ కలిసి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి ఆ రోజున ఇద్దరూ రొమాంటిక్‌గా బయట ఎక్కడికైనా వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలి.
మీ వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు, మధురమైన రోజులు ఎన్నో వుంటాయ్. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని ఆ రోజున ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications